Hyderabad News: కల్లు తిప్పితేచాలు అవలీలగా వస్తువులను దొంగలిస్తారు నేటి కాలంలో. సీసీకెమెరాలు లేకుంటే షాపు ఓనర్ నష్టపోవడం ఖాయం. అందుకే షాపుల్లో నిత్యం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తుంటారు. చాలామంది చిరు వ్యాపారులు రోడ్డుపై తోపుడు బల్లు పెట్టేసి వాటిపై కవర్లు కప్పేస్తారు. ఆయా బల్లలో వస్తువులు చోరీ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ సిటీలో వెలుగుచూసింది.
హైదరాబాద్ సిటిలో బంజారాహిల్స్ రోడ్ నెంబరు 14లో కేబీఆర్ పార్కుకు సమీపంలోని ఖాళీ స్థలంలో కొబ్బరి బొండాలు, పండ్ల విక్రయాలు చేస్తుంటారు చిరు వ్యాపారులు. సాయంత్రం వరకు వ్యాపారం చేసుకుని చీకటి అయ్యాక రాత్రి వేళ ఆయా బళ్లకు చుట్టూ కవర్లు కప్పేసి వెళ్లిపోతారు. ఎందుకంటే నిత్యం పోలీసు వాహనాలు తిరుగుతాయని నమ్ముతారు.
దీనివల్ల తమ బళ్లులో వస్తువులకు ఏలాంటి ఢోకా ఉండదని నమ్ముతారు. అయితే ఒక్కోసారి ఆయా వస్తువులు చోరీ అయిన ఘటనలు లేకపోలేదు. ఇదే అదునుగా భావించిన ఓ ఆటోడ్రైవర్ సరిగ్గా అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆ ప్రాంతానికి వచ్చి కొబ్బరి బొండాలను దొంగిలించాడు. సమీపంలో సీసీటీవీ ఫుటేజీ రికార్డు అయ్యింది. దాన్ని పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడి కోసం గాలిస్తున్నారు బంజారాహిల్స్ పోలీసులు. కేవలం కేబీఆర్ పార్కు మాత్రమే హైదరాబాద్ సిటీలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కేబీఆర్ పార్క్ వ్యవహారం కెమెరాకు చిక్కడంతో బయటకు వచ్చింది.
ALSO READ: మెట్రో స్టేషన్‌లో అడుక్కుంటున్న యువతి, ఏం కష్టమొచ్చిందో?
ఇలాంటి ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని చిరువ్యాపారులు భావించేవారు. అయితే కేసు నిమిత్తం పోలీసులు పదే పదే పిలుస్తారని భావించి సైలెంట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ వ్యవహారం బయటపడడంతో ఇకపై సీసీకెమెరాలను కంటిన్యూగా వాచ్ చేయాలని భావిస్తున్నారు పోలీసులు.
ఆటోలో వచ్చి.. కొబ్బరి బొండాలు ఎత్తుకెళ్లి…
హైదరాబాద్-బంజారాహిల్స్ రోడ్ నెం.14లో కేబీఆర్ పార్కుకు సమీపంలోని ఖాళీ స్థలంలో కొబ్బరి బొండాలు, పండ్ల విక్రయాలు
వ్యాపారం ముగిశాక రాత్రిపూట వాటి చుట్టూ కవర్లు కప్పేసి వెళ్లిన వ్యాపారులు
ఇదే అదునుగా భావించి.. అర్థరాత్రి దాటిన… pic.twitter.com/rpCTZgMAlt
— BIG TV Breaking News (@bigtvtelugu) September 8, 2025