Viral News: చూడటానికి సాధారణంగానే ఉన్న ఒక యువతి, మెట్రో స్టేషన్‌లో ప్రయాణికుల దగ్గర ఆర్థిక సహాయం కోరుతూ కనిపించింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చలికి వణుకుతూ, తలవంచుకొని ఎవరు సహాయం చేస్తారో అన్న ఆశతో అక్కడున్న ప్రయాణికులను చూస్తూ ఉండటం అందరిని కదిలించింది. ఆ దృశ్యాన్ని కొందరు సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, ఇది ఎక్కడ జరిగింది? అంటూ నెటిజన్లలో ప్రశ్నలు మొదలయ్యాయి.
ఆమె ఎవరు?
మెట్రో స్టేషన్‌లో అడుక్కుంటున్న ఈ అమ్మాయి ఎవరు? ఇండియాలో ఏ రాష్ట్రానికి చెందినది? ఏ పరిస్థితులు ఆమెను విదేశాల్లో ఇలా ఆర్థికంగా ఇబ్బంది పడేలా చేసాయి? అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె అడుక్కుంటున్న ఈ వీడియో కెనడాలోని మెట్రోస్టేషన్. ఆమెను గమనించిన ఓ వ్యక్తి వీడియో తీయడానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తిని గమనించిన ఆ యువతి వెంటనే తన వద్ద వున్న అట్ట ముక్కను తన ముఖానికి అడ్డు పెట్టుకుంది. అయినా ఆ వ్యక్తి వీడియో తీయడం ఆపలేదు, దీంతో చేసేదేమిలేక అక్కడి నుంచి పరుగులు పెట్టింది.
వీడియో ఎందుకు తీస్తున్నారు? తీయకండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఆమె మాట్లాడిన మాటల్ని బట్టి, తాను ఉత్తర భారత ప్రాంతానికి చెందిన అమ్మాయిగా అంటున్నారు. మరికొందరు ఆమెను పంజాబ్‌కు చెందిన అమ్మాయి అంటున్నారు. కానీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ వార్తలో వాస్తవం ఏమిటి అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Jio Anniversary Offer: జియో వార్షికోత్సవ గిఫ్ట్.. 2 నెలల ఉచిత ట్రయల్ ఆఫర్ వివరాలు
ఖర్చులు చాలక అడుక్కుంటున్నారా?
విదేశాల్లో చదువుకోవడానికి లేదా ఉద్యోగం కోసం వెళ్లే అనేక మంది యువత అప్పులు చేసి బయలుదేరుతుంటారు. అక్కడ ఉద్యోగం దొరకకపోతే, లేదా వర్క్ పర్మిట్ సమస్యలు ఎదురైతే, ఖర్చులు పెరిగిపోతాయి. హాస్టల్ లేదా హౌస్ రెంట్, ఫుడ్ ఖర్చులు, ట్రావెల్ ఖర్చులు ఇవన్నీ భరించలేక చివరికి ఇలాంటి పరిస్థితులకు చేరుకుంటారు. ఈ అమ్మాయి పరిస్థితి కూడా అలా ఉందని అంచనా వేస్తున్నారు.
వేల సంఖ్యలో ఉద్యోగాల కోసం కెనడాకు
అంతేకాదు, కెనడాలో ఇటీవల పెద్ద సంఖ్యలో ఇండియన్ స్టూడెంట్స్ వెళ్లారు. కానీ వారందరికీ ఆశించిన విధంగా ఉద్యోగాలు దొరకడం లేదు. పైగా వీసా రూల్స్ కూడా కఠినంగా మారాయి. ఇలాంటి సమస్యల కారణంగానే కొంతమంది ఆర్థిక కష్టాల్లో చిక్కుకుపోతున్నారు. ఆ కష్టాల వల్లే ఒక యువతి ఇలా పబ్లిక్‌గా సహాయం కోరడం మనం ఇప్పుడు చూస్తున్నాం.
ఈ ఘటన యువతకు హెచ్చరిక
వీడియో చూసిన చాలామంది ఇండియాలోని యువతకు ఒక హెచ్చరికలా భావిస్తున్నారు. విదేశాలకు వెళ్ళేముందు అక్కడి పరిస్థితులు, అవకాశాలు, చట్టాలు బాగా తెలుసుకోవాలి అని చెబుతున్నారు. కెనడా అంటే గ్రీన్ కార్డ్, మంచి జీతం, సాఫ్ట్ లైఫ్ అని కలలు కనే ముందు అక్కడ జీవించడం ఎంత కష్టమో కూడా తెలుసుకోవాలి అని కామెంట్లు చేస్తున్నారు.
కెనడాలోని ఇండియన్ కమ్యూనిటీ స్పందన
ప్రస్తుతం ఈ అమ్మాయి పరిస్థితి గురించి కెనడాలోని ఇండియన్ కమ్యూనిటీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొందరు ఆమెకు సహాయం చేయాలని ముందుకు వచ్చారు. మనం ఎక్కడ ఉన్నా మనం ఇండియన్సే, మనం మనకు అండగా ఉండాలి అని సోషల్ మీడియా ద్వారా అందరికి పిలుపు నిచ్చారు. అయితే కొందరు నిజంగా ఆమె ఇండియన్ అమ్మాయే నా? లేక ఎవరు? అనేది ప్రశ్నిస్తున్నారు. ఈ వార్తలో వాస్తవం ఏమిటి? ఆ అమ్మాయి నిజంగా ఎవరు, ఏ రాష్ట్రానికి చెందినది అనేది పూర్తిగా ఇంకా బయటకు రాలేదు. కానీ ఆమె పరిస్థితి మనసును కదిలించేలా ఉంది.
వీడియోలో చూడండి..