Sisodia walks out of Jail: లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా జైలు నుంచి నేడు విడుదలయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తిహార్ జైలు నుంచి 17 నెలల తరువాత శుక్రవారం సాయంత్రం బయటకు వచ్చారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో గతేడాది ఫిబ్రవరిలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం విధితమే. సిసోడియా విడుదల నేపథ్యంలో ఆయన మద్దతుదారులు భారీ సంఖ్యలో జైలు వద్దకు చేరుకుని స్వాగతం పలికారు. వారిని ఉద్దేశిస్తూ సోసిడియా భావోద్వేగంతో కూడిన ప్రసంగం చేశారు.
‘నేను జైలులో ఉన్నంతకాలం ఢిల్లీ ప్రజలు, దేశంలోని చిన్నారులంతా మానసికంగా నాతోనే ఉన్నారు. సుప్రీంకోర్టు నేడు వెలువరించిన తీర్పు నియంతృత్వానికి చెంపపెట్టు. ఇందుకు నేను సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజల ప్రేమ, భగవంతుడి ఆశీస్సులు, నిజానికి ఉన్న బలం.. వీటన్నిటికంటే ఎక్కువగా రాజ్యాంగం శక్తితో నేను జైలు నుంచి బయటకు వచ్చాను. న్యాయ పోరాటాన్ని ఓ ముగింపునకు తీసుకరాగలిగాం. ఈ క్రమంలో నాకు తోడుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం శక్తితో బయటకు నేను.. ఇదే శక్తి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విడుదలకు కూడా మార్గం సుగమం చేస్తుందని ఆశిస్తున్నా’ అంటూ సిసోడియా ఎమోషనల్ గా ప్రసంగించారు.
Also Read: ‘సుదీర్ఘకాలం బెయిల్ నిరాకరించడం సరికాదు’.. హైకోర్టు, ట్రయల్ కోర్టులపై మండిపడిన సుప్రీం
ఇదిలా ఉంటే.. మనీశ్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసే సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఏ నిందితుడినైనా కాలపరిమితి లేకుండా జైలులో ఉంచలేరు. కేసు విచారణలో పురోగతి లేకపోయినా కూడా ఒక పరిమితి దాటిన తరువాత ఆ వ్యక్తిని జైలులో ఉంచడం సరికాదు. అలా కాదంటే ఆ వ్యక్తి హక్కులను హరించడం అవుతుంది. జైలు నుంచి బెయిల్ కు దరఖాస్తు చేసుకోవడం, ఉపశమనం పొందడం వారికి ఉన్నటువంటి హక్కు. బెయిల్ అనేటిది ఒక నియమం.. జైలు మినహాయింపు అనే విషయాన్ని కింది కోర్టులు గ్రహించాల్సిన సమయం ఏర్పడింది’ అంటూ సుప్రీంకోర్టు పేర్కొన్నది.
తీహార్ జైలు నుంచి విడుదలైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా
మనీష్ సిసోడియాకు స్వాగతం పలికిన ఆప్ నేతలు
లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో సిసోడియాకు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు
17 నెలల(530 రోజుల) పాటు తీహార్ జైలులో ఉన్న సిసోడియా#ManishSisodiaBail #AAPleaders #delhi… pic.twitter.com/6sV5nSTERs
— BIG TV Breaking News (@bigtvtelugu) August 9, 2024