E-Paper
Advertisement

 Pumpkin Seeds: హెల్తీ ఫుడ్ అని గుమ్మడి గింజలు ఎక్కువ తింటే.. జరిగేది ఇదే !

 Pumpkin Seeds: హెల్తీ ఫుడ్ అని గుమ్మడి గింజలు ఎక్కువ తింటే.. జరిగేది ఇదే !
Advertisement

Pumpkin Seeds: గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో మెగ్నీషియం, జింక్ , ఆరోగ్యకరమైన కొవ్వులు అధిక మోతాదులో ఉంటాయి. అయితే.. ఏ ఆహారమైనా అమితంగా తీసుకుంటే అది అనర్థానికి దారితీస్తుంది. గుమ్మడి గింజలను మోతాదుకు మించి తినడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, అధిక బరువు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యకరమైనవే కదా అని వీటిని విపరీతంగా తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. ఇంతకీ గుమ్మడి గింజలు ఎక్కువగా తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గుమ్మడి గింజలు- సమస్యలు:

Advertisement

1. జీర్ణక్రియ సమస్యలు:
గుమ్మడి గింజలలో ఫైబర్ (పీచు పదార్థం) చాలా ఎక్కువగా ఉంటుంది. తక్కువ మొత్తంలో తీసుకుంటే ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కానీ అతిగా తింటే.. మీ శరీరం ఆ పీచును అరిగించుకోవడానికి ఇబ్బంది పడుతుంది. దీని వల్ల కడుపులో గ్యాస్ పట్టేయడం, తిమ్మిర్లు రావడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.

2. బరువు పెరగడం:
బరువు తగ్గాలనుకునే వారు గుమ్మడి గింజలను స్నాక్స్‌గా తీసుకుంటారు. అయితే వీటిలో క్యాలరీలు కూడా ఎక్కువే. ఒక కప్పు గింజల్లో దాదాపు 500 క్యాలరీలు ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులే ఉన్నప్పటికీ.. వీటిని స్వీట్స్ లాగా విపరీతంగా తింటే శరీరంలో క్యాలరీలు పెరిగి అనవసరంగా బరువు పెరిగే అవకాశం ఉంది.

Advertisement

3. అలర్జీలు:
కొందరికి గుమ్మడి గింజలు పడవు. వీటిని అతిగా తిన్నప్పుడు చర్మంపై దద్దుర్లు, దురద లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు. అరుదుగా ఉన్నప్పటికీ. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వాటిని తినడం ఆపేయాలి.

4. గొంతు నొప్పి లేదా మింగడంలో ఇబ్బంది:
కొంతమంది గింజలను పొట్టుతో సహా తింటారు. వీటి పొట్టు గట్టిగా ఉండటం వల్ల సరిగ్గా నమలకపోతే అన్నవాహికలో చిన్న చిన్న గాయాలు కావొచ్చు లేదా గొంతులో అసౌకర్యం కలగవచ్చు.

5. రక్తపోటు తగ్గిపోవడం:
రక్తపోటును తగ్గించే మెగ్నీషియం గుమ్మడి గింజల్లో పుష్కలంగా ఉంటుంది. ఇది బీపీ రోగులకు మంచిదే. కానీ ఇప్పటికే బిపి మందులు వాడుతున్న వారు వీటిని అతిగా తింటే.. రక్తపోటు ప్రమాదకర స్థాయికి పడిపోయే అవకాశం ఉంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

రోజూ ఒక చిన్న గుప్పెడు కంటే ఎక్కువ గింజలు తినకండి.

గింజలను వేయించి లేదా నానబెట్టి తింటే జీర్ణక్రియ సులభమవుతుంది.

వీటిని తిన్నప్పుడు నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి.

Related News

ముఖంపై నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? క్లియర్ స్కిన్ కోసం డాక్టర్ ఏం చెప్పారంటే

చూపు దెబ్బతినకముందే అప్రమత్తం కండి.. కళ్లు చెప్పే ఆ రహస్య సంకేతాలు ఇవే!

చాణక్య నీతి.. భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టే స్నేహితులు వీరే.. ఇలా గుర్తించండి

ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చొని మెడనొప్పిగా ఉందా? ఈ సింపుల్ వ్యాయామాలు చేస్తే సరి

రాత్రి చక్కగా నిద్రపోయినా ఉదయం లేవగానే నీరసంగా ఉంటుందా? అయితే మీ బాడీలో ఈ 5 లోపాలున్నట్టే!

ఇంజెక్షన్ వేయించుకోవాలంటే భయపడుతున్నారా? ఇలా చేస్తే నొప్పి అసలు తెలియదు

పనీర్ తయారు చేశాక మిగిలిన నీటిని పారేస్తున్నారా? ఇలా చేస్తే టేస్టీ సూప్ రెడీ

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

Big Stories

Advertisement
×