E-Paper
Advertisement

Paneer Dum Biryani: ఆదివారం స్పెషల్ పన్నీర్ దమ్ బిర్యానీ.. రెస్టారెంట్ టేస్ట్‌ను తలదన్నే సీక్రెట్ రెసిపీ ఇదే!

Paneer Dum Biryani: ఆదివారం స్పెషల్ పన్నీర్ దమ్ బిర్యానీ.. రెస్టారెంట్ టేస్ట్‌ను తలదన్నే సీక్రెట్ రెసిపీ ఇదే!
Advertisement

Paneer Dum Biryani: బిర్యానీ అంటే కేవలం నాన్‌వెజ్ మాత్రమే కాదు.. వెజిటేరియన్స్ మనసు గెలుచుకునేలా ఇంట్లోనే స్పైసీగా పన్నీర్ దమ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు. ముక్కకు మసాలాలు బాగా పట్టి, నోట్లో వేసుకోగానే కరిగిపోయే సాఫ్ట్ పన్నీర్ ముక్కలు.. ఘుమఘుమాడే బాస్మతి అన్నంతో కలిపి తింటే.. ఆ కిక్కే వేరబ్బా. సాధారణంగా బిర్యానీ అంటే ఏదో పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కానీ, పక్కా కొలతలతో ఈ పద్ధతిలో చేస్తే రెస్టారెంట్ కంటే అద్భుతమైన రుచి మన ఇంట్లోనే వస్తుంది.

పన్నీర్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు:

పనీర్ ముక్కలు – కప్పు
బాస్మతి బియ్యం – కప్పు
పెరుగు – అర కప్పు
వేయించిన ఉల్లిపాయ ముక్కలు – కప్పు
కారం – స్పూన్,
ధనియాల పొడి – స్పూన్
వేయించిన జీలకర్ర పొడి – స్పూన్
పసుపు – చిటికెడు
గరం మసాలా – స్పూన్
దాల్చిన చెక్క – రెండంగుళాల ముక్క
యాలకులు – పది
లవంగాలు – నాలుగు
మిరియాలు – అర టీస్పూన్
షాజీర – స్పూన్
బిర్యానీ ఆకులు – రెండు
అనాసపువ్వు – చిన్నముక్క
నెయ్యి – 2 టేబుల్స్పూన్లు
నూనె – 4 టేబుల్ స్పూన్లు
నిమ్మకాయ – ఒకటి
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర, పుదీనా తురుము – 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం.. స్టెప్ బై స్టెప్:

Advertisement

ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి. ఓ మందమైన గిన్నెలో పన్నీర్ ముక్కలను వేసుకుని అందులో పెరుగు, పుదీనా, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపుతో పాటు మొత్తం బిర్యానీ మసాలాలు, నెయ్యి, నూనె, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మసాలా పట్టిన పన్నీర్ మిశ్రమాన్ని గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.

ఆ తర్వాత స్టవ్ మీద ఎసరు పెట్టుకుని అందులో నెయ్యి, మిగిలిన బిర్యానీ దినుసులు, ఉప్పు, నిమ్మరసం వేసి నీళ్లు మరిగాక నానబెట్టిన బియ్యాన్ని వేసి ఉడికించాలి. అన్నం 70% ఉడికిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ మిశ్రమంపై ఈ అన్నాన్ని పొరలుగా వేసి, పైన కొత్తిమీర, పుదీనా చల్లుకోవాలి. చివరగా మూత పెట్టి పావుగంట పాటు సన్నటి మంటపై దమ్ చేస్తే ఘుమఘుమలాడే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ.

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×