E-Paper
Advertisement

Copper Utensils: రాగి పాత్రల్లో.. ఈ ఆహారాలు వండుతున్నారా ? జాగ్రత్త

Copper Utensils: రాగి పాత్రల్లో.. ఈ ఆహారాలు వండుతున్నారా ? జాగ్రత్త
Advertisement

Copper Utensils: రాగి పాత్రలలో నీరు తాగడం లేదా ఆహారం వండటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతుంటారు. రాగి సహజంగానే యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉన్నప్పటికీ.. దానిని సరిగ్గా ఉపయోగించకపోతే లేదా అతిగా వాడితే.. అది మన ఆరోగ్యానికి మంచి కంటే ఎక్కువ హాని కలిగించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1. రాగితో సమస్యలు:
రాగి అనేది మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం అయినప్పటికీ.. అది కేవలం చాలా తక్కువ పరిమాణంలోనే అవసరం. సాధారణంగా.. మన ఆహారం ద్వారానే మన శరీరానికి తగినంత రాగి లభిస్తుంది. రోజూ రాగి పాత్రలలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల శరీరంలో రాగి మోతాదు ప్రమాదకరంగా పెరిగుతుంది. దీన్నే కాపర్ టాక్సిసిటీ అంటారు.అతిగా రాగి శరీరంలో చేరితే.. కడుపు నొప్పి, వికారం, వాంతులు, అతిసారం వంటి జీర్ణ సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. దీర్ఘకాలికంగా ఇది కాలేయం, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Advertisement

2. విషపూరిత లోహాలు:
మార్కెట్లో లభించే అనేక రాగి పాత్రలు పూర్తిగా శుద్ధమైన రాగి కాకపోవచ్చు. వాటి తయారీలో నాణ్యత తక్కువగా ఉన్నప్పుడు.. ఆ పాత్రలకు మెరుపు తీసుకురావడానికి లేదా ఖర్చు తగ్గించడానికి సీసం లేదా ఆర్సెనిక్ వంటి ఇతర ప్రమాదకర లోహాలను కలిపే అవకాశం ఉంటుంది. ఈ పాత్రలలో వంట చేసినప్పుడు లేదా నీటిని నిల్వ చేసినప్పుడు.. ఈ విషపూరిత లోహాలు నీరు లేదా ఆహారంలోకి కరిగి మన శరీరంలోకి చేరతాయి.

3. కొన్ని రకాల ఆహారాలకు పనికిరాదు:
రాగి అనేది ఆమ్ల పదార్థాలతో త్వరగా రసాయన ప్రతిచర్య చెందుతుంది. నిమ్మరసం, పచ్చళ్లు, పెరుగు, టమాటోలు లేదా చింతపండు వంటి పుల్లని ఆహార పదార్థాలను రాగి పాత్రలలో నిల్వ చేయడం లేదా వండటం చాలా ప్రమాదకరం. ఎందుకంటే.. ఈ ఆమ్లాలు రాగితో ప్రతిచర్య జరిపి, భారీ మొత్తంలో రాగిని ఆహారంలోకి విడుదల చేస్తాయి. ఇది తక్షణ విష ప్రభావానికి దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే వంట పాత్రగా రాగిని వాడకూడదు.

Advertisement

4. సరైన నిర్వహణ లేకపోవడం:
రాగి పాత్రలను తరచుగా.. సరిగ్గా శుభ్రం చేయకపోతే, వాటి లోపల ఒక ఆకుపచ్చ రంగు పొర ఏర్పడుతుంది. ఇది రాగి ఆక్సైడ్ లేదా కాపర్ కార్బొనేట్. ఈ పొర విషపూరితమైనది. కాబట్టి.. రాగి పాత్రలను ఎప్పుడూ నిమ్మకాయ లేదా చింతపండుతో బాగా రుద్ది మెరిసేలా శుభ్రం చేయాలి. లేదంటే ఆ కాలుష్యం నీటి ద్వారా శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది.

Also Read: టూత్‌బ్రష్‌‌పై 10 మిలియన్ల జెర్మ్స్.. బాత్రూమ్‌లో మాత్రం అస్సలు వద్దు!

ఎలా వాడాలి ?
రాగి పాత్రలో నీటిని నిల్వ చేసినా.. ఆ నీటిని రోజుకు ఒకసారి మాత్రమే తాగాలి.

ఆహారం వండడానికి లేదా ఆమ్ల పదార్థాలను నిల్వ చేయడానికి రాగి పాత్రలను ఎప్పుడూ ఉపయోగించకూడదు.

రాగి పాత్రలను కేవలం 99.9% శుద్ధమైన రాగితో తయారు చేశారో లేదో నిర్ధారించుకోవాలి.

సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే రాగి మనకు మేలు చేస్తుంది. లేదంటే మాత్రం చాలా ప్రమాదకరం.

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×