Lionel Messi: కలకత్తాలో లియోనెల్ మెస్సీ ( Lionel Messi) పర్యటన అట్టర్ ఫ్లాఫ్ అయింది. ఈ తరుణంలోనే మెస్సీకి క్షమాపణలు కూడా చెప్పారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కలకత్తాలోని స్టాలెక్ స్టేడియంలో ‘గజిబిజిగా’ మెస్సీ ఈవెంట్ మారింది. 14 సంవత్సరాల తర్వాత మూడు రోజుల పర్యటనల భాగంగా భారత్ కు వచ్చారు అర్జెంటీనా స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ. ఈ తరుణంలో తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు భారీగా తరలివచ్చారు మెస్సీ అభిమానులు. మెస్సి చుట్టూ సెక్యూరిటీ, మంత్రి కుటుంబ సభ్యులు, ఇతర నిర్వాహకులు కనపడకుండా అడ్డు ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు అభిమానులు. భద్రత కారణాలు దృష్ట్యా నిమిషాల వ్యవధిలోనే మెస్సీ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు ఆయన బృందం.
కలకత్తాలో లియోనెల్ మెస్సీ ( Lionel Messi) పర్యటన అట్టర్ ఫ్లాఫ్ అయిన నేపథ్యంలో ఈవెంట్ నిర్వాహకులపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులను టికెట్ డబ్బును తిరిగి చెల్లించాలని కోరారు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్. నిర్వాహకులను అరెస్టు చేయాలని పిలుపునిచ్చిన ఆనంద బోస్.. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో బెంగాల్ డీజీపీ వెంటనే రియాక్ట్ కూడా అయ్యారు. ఈవెంట్ మెయిన్ ఆర్గనైజర్ ను అరెస్టు చేసామని స్పష్టం చేశారు బెంగాల్ డీజీపీ. మిగిలిన నిర్వాహకులను కూడా అరెస్టు చేస్తామన్న డిజిపి, నిర్వాహకులను విచారించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిర్వాహకుల మీదే పూర్తి నెపం నేడుతున్న పోలీసులు, వారిపై చర్యలు తీసుకోనున్నారు. ఇక అటు మెస్సి ఈవెంట్ నిర్వహణ లోపాలపై విచరించేందుకు ఒక ప్యానెల్ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం మమత బెనర్జీ ( Mamata Banerjee). ప్యానల్ సభ్యులను త్వరలోనే ప్రకటిస్తామని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
మెస్సికి సీఎం మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో గందరగోళం చోటు చేసుకున్న నేపథ్యంలో స్టేడియం నుంచి మెస్సి త్వరగా వెళ్లిపోయాడంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదానంలోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు అభిమానులు. ఈ ఘటనపై మెస్సికి, క్రీడాభిమానులకు క్షమాపణలు చెప్పారట సీఎం మమతా బెనర్జీ. ఈ వ్యవహారంపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేశారు సీఎం మమతా బెనర్జీ. ఇక అటు మరికొన్ని గంటల్లో హైదరాబాద్ కు మెస్సీ రానున్నారు. కోల్ కతా స్టేడియంలో ఉద్రిక్తత నేపథ్యంలో హైదరాబాద్ లో భద్రత కట్టుదిట్టం ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 3 వేల మందితో మూడంచెల భద్రత ఏర్పాటు చేఆరు. 450 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో భద్రత పర్యవేక్షణ చేస్తున్నారు.
Kolkata, West Bengal: Angry fans vandalise the Salt Lake Stadium in Kolkata, alleging poor management of the event
A fan of star footballer Lionel Messi said, "Absolutely terrible event. He came for just 10 minutes. All the leaders and ministers surrounded him. We couldn't see… pic.twitter.com/a3RsbEFmTi
— ANI (@ANI) December 13, 2025