E-Paper
Advertisement

షుగర్ పేషెంట్స్ జాగ్రత్త! వేసవిలో ఈ 5 తప్పులు చేస్తే ప్రాణాలకే ముప్పు

షుగర్ పేషెంట్స్ జాగ్రత్త! వేసవిలో ఈ 5 తప్పులు చేస్తే ప్రాణాలకే ముప్పు
Advertisement

Diabetes Summer Care Tips: సమ్మర్ డయాబెటిక్ పేషెంట్లకు అత్యంత క్లిష్టమైన సమయం. ఈ సమయంలో పెరిగే ఉష్ణోగ్రతలు శరీరంలోని ఇన్సులిన్ వినియోగాన్ని ప్రభావితం చేస్తాయి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. చాలా మంది ఎండల నుంచి ఉపశమనం కోసం చేసే చిన్న చిన్న పొరపాట్లు వారి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. డీహైడ్రేషన్ మొదలుకొని ఆహారపు అలవాట్ల వరకు, షుగర్ పేషెంట్స్ వేసవిలో ఖచ్చితంగా నివారించాల్సిన 5 విషయాలను గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు మన శరీరం చల్లబడటానికి ఎక్కువ శ్రమ పడుతుంది. మధుమేహం ఉన్న వారిలో చెమట పట్టే.. ప్రక్రియ సరిగ్గా ఉండకపోవచ్చు. ఇది ‘హీట్ ఎగ్జాషన్’కు దారి తీస్తుంది. వేసవిలో.. మీ షుగర్ లెవల్స్‌ను పదిలంగా ఉంచుకోవాలంటే ఈ కింది 5 తప్పులు చేయకండి.

Advertisement

1. సరిగ్గా నీరు తాగకపోవడం:
వేసవిలో డీహైడ్రేషన్ అనేది మధుమేహ వ్యాధిగ్రస్తులకు పెద్ద శత్రువు. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు, రక్తంలోని గ్లూకోజ్ గాఢత పెరుగుతుంది. ఫలితంగా.. రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్క సారిగా షూట్ అప్ అవుతాయి. దాహం వేసే వరకు చూడకుండా.. రోజంతా కొద్ది కొద్దిగా నీరు తాగుతూ ఉండాలి. సాధారణ నీటితో పాటు నిమ్మరసం లేదా మజ్జిగ తీసుకోవడం బెస్ట్.

2. చల్లని డ్రింక్స్, జ్యూస్‌లు:
ఎండలో బయటకు వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్స్ లేదా షుగర్ కలిపిన ఫ్రూట్ జ్యూస్ తాగడం చాలా మంది చేసే పెద్ద తప్పు. వీటిలో ఉండే అధిక చక్కెర , కార్బోహైడ్రేట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అనూహ్యంగా పెంచుతాయి. జ్యూస్ లకు బదులుగా నేరుగా పండ్లను (తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నవి) తినడం వల్ల ఫైబర్ అందుతుంది. ముఖ్యంగా సోడాలు, ఎనర్జీ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.

Advertisement

3. చెప్పుడు లేకుండా నడవడం:
షుగర్ పేషెంట్లు ‘డయాబెటిక్ ఫుట్’ సమస్య ఉంటుంది. వేసవిలో నేల లేదా ఇసుక విపరీతమైన వేడిని కలిగి ఉంటాయి. చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలకు బొబ్బలు రావచ్చు లేదా కాలవచ్చు. నరాల దెబ్బతినడం వల్ల చాలా మందికి ఆ వేడి లేదా గాయం వెంటనే తెలియదు. ఇది ఇన్ఫెక్షన్లకు దారి తీసి తీవ్రమైన పుండ్లుగా మారుతుంది. కాబట్టి.. ఇంట్లో అయినా, బయట అయినా మెత్తని చెప్పులు వాడటం మర్చిపోవద్దు.

Also Read: ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయల శుద్ధి.. మీ కుటుంబ ఆరోగ్యానికి భరోసా

4. మందులు, ఇన్సులిన్‌ను ఎండలో ఉంచడం:
ఇన్సులిన్ , మధుమేహం పరీక్షించే స్ట్రిప్స్ ఉష్ణోగ్రతకు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. ఇన్సులిన్‌ను నేరుగా ఎండ తగిలే చోట లేదా కారులో ఉంచితే దాని పని తీరు దెబ్బతింటుంది. అలాగే గ్లూకోమీటర్ స్ట్రిప్స్ కూడా వేడి వల్ల తప్పుడు రీడింగ్స్ చూపిస్తాయి. మీ మందులను ఎప్పుడూ చల్లని.. పొడి ప్రదేశంలో ఉంచాలి. ప్రయాణాల్లో ఇన్సులిన్ కూలర్ బ్యాగ్స్ వాడటం మంచిది.

5. తీవ్రమైన ఎండలో వ్యాయామం :
శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి వ్యాయామం అవసరమే.. కానీ మధ్యాహ్నం  లేదా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు జిమ్ లేదా వాకింగ్ చేయడం ప్రమాదకరం. వేడి వల్ల రక్తనాళాలు వ్యాకోచించి ఇన్సులిన్ వేగంగా గ్రహించబడుతుంది. ఇది ‘హైపోగ్లైసీమియా’ (షుగర్ పడిపోవడం) కు దారితీస్తుంది. ఉదయం 7 గంటల లోపు లేదా సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాతే వ్యాయామం ప్లాన్ చేసుకోండి.

సమ్మర్ లో షుగర్ కంట్రోల్ లో ఉంచడం కష్టం కావచ్చు.. కానీ సరైన జాగ్రత్తలతో సులభంగా అధిగమించవచ్చు. ప్రతి రోజూ కనీసం రెండు సార్లు షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవడం, వదులైన కాటన్ బట్టలు ధరించడం , పోషకాహారం తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఏదైనా అసౌకర్యం అనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×