E-Paper
Advertisement

ఎండాకాలంలో పాలు తరచుగా విరిగిపోతున్నాయా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే

ఎండాకాలంలో పాలు తరచుగా విరిగిపోతున్నాయా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే
Advertisement

Summer Milk Preservation: సమ్మర్ వచ్చిందంటే చాలు గృహిణులు పాలను కాపాడటం ఒక సవాలుగా మారుతుంది. బయట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ దాటినప్పుడు పాలలోని ‘లాక్టోబాసిల్లస్’ అనే బ్యాక్టీరియా అతి వేగంగా వృద్ధి చెంది పాలను పులియబెడుతుంది. దీని వల్ల పాలు విరిగిపోయి వృథా అవుతాయి. అయితే.. కొన్ని  పద్ధతులు,  చిట్కాలను పాటించడం ద్వారా సమ్మర్ లోనూ  పాలను రెండు నుంచి మూడు రోజుల వరకు  తాజాగా ఉంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ ఆసక్తికరమైన చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పాలు పాడవకుండా ఉండటానికి 5 సింపుల్ చిట్కాలు

1.కొన్న వెంటనే మరిగించడం:
పాల ప్యాకెట్లు లేదా తాజా పాలను తెచ్చిన వెంటనే గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచకూడదు. తెచ్చిన 10-15 నిమిషాల్లోనే పాలను స్టవ్ మీద పెట్టి మరిగించాలి. మరిగించడం వల్ల పాలలోని బ్యాక్టీరియా నశిస్తుంది. వేసవిలో.. రోజుకు కనీసం రెండు నుంచి మూడు సార్లు పాలను మరిగించడం వల్ల అవి ఎక్కువ సేపు నిల్వ ఉంటాయి. ప్రతి సారి మరిగించేటప్పుడు పాలు పొంగే వరకు కాచడం ముఖ్యం.

Advertisement

2. చల్లబరచడంలో జాగ్రత్తలు:
చాలా మంది పాలు కాచిన వెంటనే మూత పెట్టేస్తారు. దీని వల్ల లోపల ఆవిరి చేరి, ఆ నీటి బిందువులు పాలలో పడటం వల్ల బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. పాలు మరిగాక స్టవ్ ఆపి.. గాలి తగిలేలా జాలి మూత పెట్టాలి. పాలు పూర్తిగా చల్లబడిన తర్వాతే వాటిని ఫ్రిజ్‌లో పెట్టాలి. వేడి పాలను నేరుగా ఫ్రిజ్‌లో పెడితే.. అది ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రతను పెంచి ఇతర వస్తువులను కూడా పాడు చేస్తుంది.

3. ఫ్రిజ్ లోపలి భాగం నిల్వ :
మనం చేసే సాధారణ పొరపాటు ఏటంటే.. పాలను ఫ్రిజ్ డోర్ షెల్ఫ్‌లో పెట్టడం. మనం ఫ్రిజ్ పదే పదే తీయడం వల్ల డోర్ వద్ద ఉష్ణోగ్రత మారుతూ.. ఉంటుంది. దీని వల్ల పాలు త్వరగా విరిగిపోతాయి. పాలను ఎప్పుడూ ఫ్రిజ్ లోపలి భాగంలో.. చివరన ఉంచాలి. అక్కడ ఉష్ణోగ్రత స్థిరంగా ఉండి పాలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

Advertisement

4. గిన్నె శుభ్రత :
పాలు పోసే ముందు గిన్నెను శుభ్రంగా కడగాలి. పాత పాలు కాచిన గిన్నెలోనే మళ్ళీ కొత్త పాలు పోయకూడదు. పాలు పోయడానికి ముందు గిన్నెలో.. కొద్దిగా చల్లటి నీటిని పోసి, గిన్నె అంతా తడిపి ఆ నీటిని పారబోయాలి. ఆ తర్వాత పాలు పోసి కాచడం వల్ల పాలు గిన్నె అడుగు భాగానికి అంటుకోవు, త్వరగా పాడవ్వవు.

5. బేకింగ్ సోడా :
ఒకవేళ మీరు పాలు మరిగించేటప్పుడు అవి విరిగిపోతాయని అనుమానం ఉంటే.. కనక ముందే ఒక చిటికెడు ‘బేకింగ్ సోడా వేయండి. పాలలోని పిహెచ్ (pH) స్థాయిని సమతుల్యం చేసి, పాలు పులియకుండా కాపాడుతుంది. అయితే ఇది పాలు విరిగిపోయే స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే వాడాలి.

పాలు అత్యంత సున్నితమైన ఆహార పదార్థం. వేసవిలో చిన్న అశ్రద్ధ కూడా పాలను పాడు చేస్తుంది. పైన పేర్కొన్న చిట్కాలను పాటిస్తూ, పరిశుభ్రతను పాటిస్తే వేసవిలో కూడా పాలు పాడుకాకుండా వాడుకోవచ్చు. నిరంతరం మరిగించడం , సరైన రీతిలో ఫ్రిజ్‌లో దాచుకోవడం అనేవి పాల నిల్వకు ప్రాథమిక సూత్రాలు.

Related News

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

ప్రతిరోజూ హెల్మెట్ ధరిస్తే జుట్టు డ్యామేజ్.. ఈ సులభమైన హెయిర్ కేర్ చిట్కాలు మీ కోసం

పాము, ముంగీస లాంటి స్వభావం వీరిది.. ఈ తేదీల్లో పుట్టినవారు పెళ్లి తరువాత గొడవపడుతూనే ఉంటారు

మద్యం లేదా సిగరెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రమాదకరం.. ఏది ముందుగా మానేయాలి?

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

Big Stories

Advertisement
×