E-Paper
Advertisement

Sperm Colour: వీర్యం రంగు మారుతుందా? ఆ కలర్ లో ఉంటే అంతే సంగతులు!

Sperm Colour: వీర్యం రంగు మారుతుందా? ఆ కలర్ లో ఉంటే అంతే సంగతులు!

వీర్యం ఎంత ఆరోగ్యంగా ఉంటే.. పిల్లలు కలిగే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. సెమన్ అనేది కామన్ గా తెలుపు  లేదంటే బూడిద రంగులో కనిపిస్తుంది. ఇది ద్రవంగా ఉన్నప్పుడు కొంచెం పాల రంగులా కనిపిస్తుంది.  వీర్యకణాలు, ఇతర ద్రవాలు కలిసిన కారణంగా బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి జెల్ లాగా గడ్డ కట్టి తర్వాత మళ్లీ ద్రవంగా మారుతుంది. అయితే, ఈ రోజుల్లో చాలా మంది వీర్యం సమస్య ఎదుర్కొంటున్నారు. రోజువారీ అలవాట్లు, కాలుష్యం కారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గుతోంది. ఫలితంగా పిల్లలు కలిగే సామర్థ్యం తగ్గిపోతుంది. కొన్నిసార్లు అనారోగ్య కారణాలతో వీర్యం రంగు మారే అవకాశం ఉంటుంది. ఇంతకీ వీర్యం రంగు చెప్పే ఆరోగ్య సమస్యలు ఏంటి?

వీర్యం రంగుతో తెలుసుకునే ఆరోగ్య సమస్యలు

⦿ ఎరుపు/గోధుమ/ గులాబీ: వీర్యం ఈ రంగుల్లో కనిపిస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలుసుకోవాలి. వీర్యంలో రక్తం కలవడం, ప్రొస్టేట్ గాయం, వృషణాల సమస్య, ప్రొస్టేట్ క్యాన్సర్, రక్తం గట్టకట్టే సమస్యలు ఉంటే వీర్యం ఎరుపు, గోధుమ, గులాబీ రంగులోకి మారుతుంది. అంతేకాదు, మూత్రంలో రక్తం, వీపులో నొప్పి ఏర్పడుతుంది. వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచింది.

⦿ పసుపు: వీర్యంలో మూత్రం కలవడం,  ప్రోస్టేట్ వాపు, వృషణాల పైభాగంలో వాపు, కాలేయ సమస్యల కారణంగా వీర్యం పసుపు రంగులోకి మారుతుంది. మూత్రంలో మంట, జ్వరం వస్తుంది. నీరు ఎక్కువగా తాగాలి. రెండు, మూడు రోజుల్లో తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్లడం మంచిది.

⦿ ఆకుపచ్చ: లైంగిక సంబంధం కారణంగా సంక్రమించిన ఇన్ఫెక్షన్, గనేరియా, క్లమీడియా, ప్రోస్టేట్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కారణంగా వీర్యం గ్రీన్ కలర్ లోకి మారుతుంది. మూత్రంలో వాసన, మంట వచ్చే అవకాశం ఉంటుంది. వెంటనే యూరాలజిస్ట్ ను కలిసి SIT టెస్ట్ చేసుకోవడం ఉత్తమం. యాంటీ బయాటిక్స్ కూడా తీసుకోవాలి.

⦿ తెలుపు/బూడిద: తెలుపు లేదంటే బూడిద రంగులో వీర్యం వస్తే ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించాలి. ఎలాంటి సమస్య లేని వీర్యంగా భావించాలి. వారిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తెలుసుకోవచ్చు.

Read Also:నన్ను తల్లిని చేస్తే రూ.25 లక్షలిస్తా.. యువతి బంపర్ ఆఫర్, కక్కుర్తి పడి వెళ్లినోడు ఏమయ్యాడంటే?

డాక్టర్ ను ఎప్పుడు కలవాలంటే?

సాధారణంగా వీర్యంలో తెలుపు, బూడిద రంగులో కాకుండా ఇతర రంగుల్లోకి మారినప్పుడు అలర్ట్ కావాలి. రంగు మారినా, దుర్వాసన, నొప్పి, మంట లాంటి లక్షణాలు ఉంటే యూరాలజిస్ట్ ను సంప్రదించాలి. రంగు మారడానికి కారణం ఆహారం, నీరసం, ఔషధాలు కూడా కావచ్చు. ఏదైనా అబ్ నార్మల్ గా అనిపిస్తే డాక్టర్ ను కలవడం మంచిది.  సమస్య తీవ్రం అయ్యాక ఇబ్బంది పడటం కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

Read Also: ఫుడ్ ప్యాకెట్స్ మీద ఉండే గుర్తులకు అర్థం ఇదా? ఇన్నాళ్లు ఈ విషయం తెలియక..

Related News

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

Big Stories

×