ఈ రోజుల్లో పొద్దున్నే లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో బయటి ఫుడ్స్ తింటున్నాం. వాటిలో ఎక్కువగా ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉంటున్నాయి. చిన్న పిల్లలు తినే చిప్స్ నుంచి పెద్దలు తినే జావిక్ భారత్ ప్రొడక్ట్స్ వరకు అన్నీ ప్యాకెట్ల రూపంలోనే లభిస్తున్నాయి. అయితే, ప్యాకెట్ లోని ఫుడ్ వెరైటీని చూపించేలా సదరు ప్యాకెట్ మీద ఓ సింబల్ ప్రింట్ చేస్తారు. ఈ సింబల్ ప్రతి ప్యాకెట్ మీద ఉంటుంది. అయితే, చాలా మంది వీటిని పట్టించుకోరు. ఆసలు ఆ సింబల్ ఎందుకు వేశారు? ఆ ఫుడ్ ఏరకమైనది? అని తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఇప్పుడు మనం ఫుడ్ ప్యాకెట్ల మీద ఎన్నిరకాల సింబల్స్ ఉంటాయి. ఒక్కో సింబల్ ఏం చెప్తుంది? అనే వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ ఎల్లో సింబర్: ఫుడ్ ప్యాకెట్ మీద పసుపు రంగు సింబల్ ను ప్రింట్ చేసినట్లైతే ఫుడ్ లో ఎగ్ కలిపినట్లు అర్థం. అంటే అందులోని ఫుడ్ లో ఎగ్ కలిపి చేశారని భావించాలి.
⦿ బ్లూ సింబల్: ఒకవేళ ఫుడ్ ప్యాకెట్ మీద బ్లూ సింబల్ కనిపిస్తే, అందులోని పదార్థాన్ని డయాబెటిస్ ఉన్న వాళ్లు కూడా తినవచ్చు అర్థం.
⦿ గ్రీన్ సిగ్నల్: ఇక ఫుడ్ ప్యాకెట్ మీద గ్రీన్ కలర్ సింబల్ ఉంటే ప్యూర్ వెజ్ తో పాటు పాలు కలిసి ఉన్నాయని అర్థం చేసుకోవాలి.
⦿ రాంగ్ సింబల్: కొన్ని ఫుడ్ ప్యాకెట్ల మీద రాంగ్ సిగ్నల్ ఉంటుంది. అంటే దీని అర్థం అసలు మనుషులు తినడానికి పనికి రాదు అని అర్థం చేసుకోవాలి. వాటిలోని పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు.
Read Also:నన్ను తల్లిని చేస్తే రూ.25 లక్షలిస్తా.. యువతి బంపర్ ఆఫర్, కక్కుర్తి పడి వెళ్లినోడు ఏమయ్యాడంటే?
⦿ వీగన్ సింబల్: కొన్ని ఫుడ్ ప్యాకెట్స్ మీద వీగన్ అనే సింబల్ కనిపిస్తుంది. దీని అర్థం ఆ ప్యాకెట్ లోని పదార్థం పూర్తిగా వెజిటేరియన్ అని అర్థం చేసుకోవాలి.
⦿ +F: కొన్ని ప్యాకెట్ల మీద +F అనే సింబల్ కనిపిస్తుంది. దీని అర్థం.. ఆ ప్యాకెట్ లోని ఫుడ్ ఐటెమ్స్ లో విటమిన్లు, మినరల్స్ యాడ్ చేశారని అర్థం చేసుకోవాలి.
⦿ జావిక్ భారత్: కొన్ని ఫుడ్ ప్యాకెట్ల మీద జావిక్ భారత్ అని రాసి ఉంటుంది. దీని అర్థం ఫుడ్ ప్యాకెట్ లోని పదార్థాలు 100 శాతం ప్యూర్ ఆర్గానిక్ అని తెలుసుకోవచ్చు.
సో, ఇకపై మీరు ఫుడ్ ప్యాకెట్స్ కొనే సమయంలో ఈ సింబల్స్ ను పరిశీలించండి. మీ ఆరోగ్యానికి ఏది మంచిది అని భావిస్తారో.. వాటినే కొనుగోలు చేయడం మంచిది.
Read Also: రీల్స్ చేసేవారికి చైనా కొత్త రూల్.. ఇవన్నీ ఉంటేనే అందుకు అనుమతి, లేకుంటే?