Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మోంథా తుపాను బీభత్సం సృష్టించింది. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల కారణంగా జనజీవనం స్థంభించిపోయింది. అయితే దీని నుంచి పలు జిల్లాలు ఇంకా కోలుకోలేదు. కానీ, మళ్ళీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో షాక్ తగిలింది. అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
తెలంగాణలో మరో నాలుగు రోజులు కుండపోత వర్షాలు..
అయితే.. తెలంగాణలో ముంచు కోస్తున్న అల్పపీడనం కారణంగా మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయిన చెప్పారు. తెలంగాణలోని యాదాద్రి, నిజామాబాద్, నిర్మల్, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, భువనగిరి, నల్గొండ, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయాని వాతావరణ శాఖ తెలిపింది.
నేడు తెలంగాణ పశ్చిమ, హైదరాబాద్ ఈస్ట్, సిద్దిపేట, నల్లొండ, వికారాబాద్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, మంచిర్యాల వంటి పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతాయని చెబుతున్నారు.
ఏపీలో మరో అల్పపీడనం.. 4 రోజుల్లో తుఫాన్!
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని ఆయన స్పష్టం చేశారు.
Also Read: ఆధార్ వెరిఫికేషన్ పేరుతో మోసం.. 51.90 లక్షలు స్వాహా చేసిన కేటుగాళ్లు
మరోవైపు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ఉద్ధృతిలో రానున్న కొన్ని రోజులు హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందన్నారు. నిన్న సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీ వద్ద లక్షా 67 వేల 175 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో నమోదైంది. ఈ నేపథ్యంలో కృష్ణా నది పరీవాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలను దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు.