BigTV English

Wheat Flour: గోధుమ పిండిలో ఈ 2 కలిపి వాడితే.. చందమామ లాంటి ముఖం

Wheat Flour: గోధుమ పిండిలో ఈ 2 కలిపి వాడితే.. చందమామ లాంటి ముఖం

Wheat Flour: చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా మార్చుకోవడానికి చాలా మంది వివిధ రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ వీటిని వాడటం వల్ల ప్రయోజనాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే హోం రెమెడీస్ వాడటం మంచిది. ఇదిలా ఉంటే.. మీరు మీ అందాన్ని మెరుగుపరచుకోవడానికి గోధుమ పిండిని కూడా ఉపయోగించవచ్చు.


అవును మనం గోధుమ పిండిని సాధారణంగా రోటీలు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తాము. కానీ మెరిసే, ప్రకాశవంతమైన చర్మం కోసం మీరు గోధుమ పిండిని కూడా ముఖానికి కూడా ఉపయోగించవచ్చు. ఇది చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా మచ్చలను పోగొట్టడం ద్వారా చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

జిడ్డుగల చర్మానికి గోధుమ పిండి, పాలు:
మీ చర్మం జిడ్డుగా ఉంటే.. గోధుమ పిండి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం.. మీరు 2 టేబుల్ స్పూన్ల పిండిలో 2 టేబుల్ స్పూన్ల పాలు కలిపి పేస్ట్ తయారు చేయాలి. ఇప్పుడు ఈ తయారుచేసిన పేస్ట్‌ని ముఖం, మెడపై రెగ్యులర్ ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేయండి. తర్వాత మళ్ళీ 15 నిమిషాలు ఆరనివ్వండి. తరువాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా తరచుగా చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ముఖం తక్కువ సమయంలోనే మెరిసిపోతుంది.


నిస్తేజమైన చర్మానికి పిండి,రోజ్ వాటర్, పాలు:
రోజువారీ హడావిడి , పని కారణంగా.. శరీరం మాత్రమే కాకుండా తరచుగా చర్మం కూడా అలసిపోతుంది. దీని కారణంగా చర్మం నిస్తేజంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు గోధుమ పిండి సహాయంతో మీ చర్మాన్ని రిఫ్రెష్ చేసుకోవచ్చు. దీని కోసం.. 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండితో పాలు, రోజ్ వాటర్ కలిపి మృదువైన పేస్ట్ సిద్ధం చేయండి. తర్వాత దాన్ని మీ ముఖం, మెడపై అప్లై చేసి కొంత సమయం అలాగే ఉంచండి. ఈ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల టానింగ్ తొలగిపోతుంది. అంతే కాకుండా మిల్క్-రోజ్ వాటర్ చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది.

Also Read: ముఖంపై నల్ల మచ్చలా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్

హైడ్రేషన్ కోసం పిండి, తేనె, పెరుగు:
మీ చర్మాన్ని హైడ్రేటింగ్ చేయాలనుకుంటే.. మీరు గోధుమ పిండిని కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం.. 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు , ఒక చెంచా తేనె కలిపి పేస్ట్ తయారు చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ తో ఫేస్ మాస్క్ తయారు చేసుకుని ముఖం, మెడ మీద బాగా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత.. 20 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రం చేసుకోండి. పెరుగులో ఉండే లక్షణాలు చర్మానికి చాలా మేలు చేస్తాయి. అంతే కాకుండా ఇవి గ్లోయింగ్ స్కిన్ కోసం ఉపయోగపడతాయి.  తరచుగా పెరుగు ముఖానికి వాడటం వల్ల అద్భతమైన లాభాలు ఉంటాయి. తేనె, పెరుగుతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ కాంతివంతమైన ముఖాన్ని మీకు అందిస్తాయి.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×