OTT Movie : హారర్ సిరీస్ లను ఇప్పుడు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. అందులోనూ ఈ కొరియన్ సిరీస్ లను వదలకుండా చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ సస్పెన్స్ తో చివరి వరకూ పిచ్చెక్కిస్తుంది. ఈ స్టోరీ చీకట్లో నడిచే ఒక లైట్ షాప్ చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
డిస్నీ+ హాట్ స్టార్ (Disney + hotstar) లో
ఈ కొరియన్ మిస్టరీ హారర్ టెలివిజన్ సిరీస్ పేరు ‘లైట్ షాప్’ (Light Shop). 2024 లో విడుదలైన ఈ కొరియన్ సిరీస్ కాంగ్ ఫుల్ రచించిన ‘Shop of the Lamp’ ఆధారంగా రూపొందించబడింది. ఇది డిస్నీ+ హాట్ స్టార్ (Disney + hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌లో జు జి-హూన్, పార్క్ బో-యంగ్ వంటి ప్రముఖ నటులు నటించారు. ఇందులో జీవించి ఉన్నవారు, చనిపోయినవారు ఒక వింతైన లైట్ షాప్ ద్వారా సంబంధం కలిగి ఉంటారు. ఆ షాప్ కి వచ్చే వాళ్ళతో ఈ స్టోరీ నడుస్తుంది.
స్టోరీలోకి వెళితే
ఒక చీకటి సందులో ఉన్న ఒక చిన్న లైట్ షాప్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ దుకాణం సాధారణంగా కనిపించినప్పటికీ, దీనికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇది జీవించి ఉన్నవారు, చనిపోయినవారి మధ్య సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ షాప్‌ను జంగ్ వోన్-యంగ్ అనే ఒక వింత మనిషి నడుపుతాడు. అతను ఎల్లప్పుడూ నల్లటి కళ్లద్దాలు పెట్టుకుని, ఆ షాప్‌లోకి వచ్చే వారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. ఈ స్టోరీ లో చాలా పాత్రలు ఉంటాయి. వీళ్లందరికీ గతంలో కొన్ని బాధాకరమైన సంఘటనలు జరుగుతాయి. వీరు సాధారణ జీవితాలను గడుపుతుండగా, ఏదో ఒక విచిత్రమైన శక్తి వారిని ఈ లైట్ షాప్ వైపు నడిపిస్తుంది. క్వాన్ యంగ్-జి ఒక నర్సు, ఆమె ICUలో పనిచేస్తూ రోగులకు సహాయం చేస్తుంది. ఆమెకు అతీంద్రియ సంఘటనలతో సంబంధం ఉంటుంది. రాత్రిపూట ఆమె చేసే విన్యాసాలు మామూలుగా ఉండవు.
హ్యూన్-మిన్ ఒక సాధారణ ఉద్యోగి, అతను రాత్రి బస్సులో ప్రయాణిస్తూ ఒక మహిళను కలుస్తాడు, ఆమెతో అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. మరోవైపు డిటెక్టివ్ యాంగ్ సంగ్-సిక్ ఒక పోలీసు అధికారి, అతను ఒక కేసును విచారిస్తూ ఈ షాప్‌తో సంబంధం కలిగి ఉంటాడు. ఇలా ఈ షాప్‌లోకి వచ్చే వాళ్ళు కొందరు చనిపోయిన ఆత్మలు గా ఉంటే, మరికొందరు జీవన్మరణాల మధ్య ఉన్నవారు కూడా ఉంటారు. వీరి కథలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. లైట్ షాప్ అనేది వీళ్లందరి మధ్య ఒక కేంద్రం గా పనిచేస్తుంది. ఇక్కడ గతం, వర్తమానం, భవిష్యత్తు కలుస్తాయి. ఈ సిరీస్ భావోద్వేగాలు, ప్రేమ, పశ్చాత్తాపం వంటి అంశాలను లోతుగా పరిశీలిస్తుంది. ఈ షాప్ ద్వారా చనిపోయినవారు తిరిగి జీవించే అవకాశం పొందుతారు. మీరు కూడా ఈ సిరీస్ ను చూసి ఎంటర్టైన్ అవ్వండి.
Read Also : కళ్ళు తెరిచి చూసేసరికి కాళ్ళు కాస్తా మాయమైతే… దిమ్మతిరిగే ట్విస్ట్ లున్న సై-ఫై మూవీ