Dark Spots: ప్రస్తుతం చాలా మంది చర్మంపై మచ్చలతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి ముఖం యొక్క అందాన్ని పూర్తిగా పాడు చేస్తాయి. వయస్సు పెరిగే కొద్దీ ఇలాంటి సమస్యలు చాలా సాధారణం కానీ చిన్న వయస్సులోనే ముఖంపై మొటిమలు వస్తే.. తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల హోం రెమెడీస్ కూడా వాడాలి. మరి ఎలాంటి హోం రెమెడీస్ ముఖంపై మచ్చలు రాకుండా చేస్తాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శనగపిండి:
శనగపిండి ముఖంపై ఉన్న నల్ల మచ్చలను తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ ను మీ సొంతం అయ్యేలా చేస్తుంది. మచ్చ లేని చర్మం కోసం మీరు తరచుగా శనగపిండిని ముఖానికి వాడటం అలవాటు చేసుకోవాలి. శనగపిండితో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని కూడా మీరు ముఖానికి వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శనగపిండిలో 1 టీ స్పూన్ తేనె, కాస్త పసుపు కలిపి మిక్స్ చేయాలి. తర్వాత దీనిని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తక్కువ రోజుల్లోనే ముఖంపై ఉన్న నల్ల మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి. అంతే కాకుండా ముఖం కూడా కాంతివంతంగా మారుతుంది.
బంగాళదుంప:
బంగాళదుంపలో బ్లీచింగ్ ఏజెంట్లు ఉంటాయి. కాబట్టి మీరు గ్లోయింగ్ స్కిన్ కోసం బంగాళదుంప రసాన్ని ముఖానికి వాడటం మంచిది. బంగాళదుంప రసం స్కిన్ ట్యాన్ తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా నల్ల మచ్చలను కూడా త్వరగా తగ్గిస్తుంది. బంగాళదుంప రసంతో తయారు చేసిన ఫేస్ మాస్క్ ముఖ సౌందర్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ ఫేస్ మాస్క్ తయారు చేయడానికి బంగాళదుంప రసంలో పెరుగును సమాన పరిమాణంలో కలిపి దానికి నిమ్మరసం కాస్త యాడ్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా 20 నిమిషాలు ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.
మజ్జిగ క్లెన్సర్:
చర్మ కణాల నుండి మృత కణాలను తొలగించడానికి మజ్జిగ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇది ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. మజ్జిగలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి చర్మంపై నుండి మచ్చలను తక్కువ సమయంలోనే తొలగిస్తాయి. ఒక చెంచా మజ్జిగలో.. కాస్త నిమ్మరసం వేసి మిక్స్ చేసి కాన్ సహాయంలో ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Also Read: ఫేస్ క్రీములు అవసరమే లేదు, వీటితో.. గ్లోయింగ్ స్కిన్
టమాటో, నిమ్మకాయ:
వయస్సు పెరిగే కొద్దీ మీ ముఖం మీద నల్లటి మచ్చలు కనిపించడం ప్రారంభిస్తే, టమాటో, నిమ్మరసం కలిపిన ఫేస్ మాస్క్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక గిన్నెలో 2 చెంచాల టమాటో ,1 చెంచా నిమ్మరసం వేసి కలపండి. ఈ మాస్క్ ని ముఖం మీద 25 నిమిషాలు అలాగే ఉంచండి. ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల్లో నే మచ్చలు పూర్తిగా తగ్గుతాయి.