BigTV English

OTT Movie : సూపర్ నేచురల్ పవర్స్ ఉండే పిల్ల… ఆమె టార్చర్ కంటే నరకమే బెటర్

OTT Movie : సూపర్ నేచురల్ పవర్స్ ఉండే పిల్ల… ఆమె టార్చర్ కంటే నరకమే బెటర్

OTT Movie : హారర్ సినిమాలకు పెట్టింది పేరు హాలీవుడ్. ఎన్నో సినిమాలు ప్రేక్షకులకు వణుకు తెప్పించాయి. అప్పట్లో వీటిని థియేటర్లలో ఎవరైనా సింగల్ గా చూస్తే నగదు బహుమతులు కూడా ఇచ్చేవాళ్ళు. అంతలా కొన్ని హారర్ సినిమాలు పాపులర్ అయ్యాయి కూడా. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా భయంకారంగానే ఉంటుంది. ఇందులో కొన్ని సీన్స్ కు గుండె ఆగినంత పని అవుతుంది. ఈ హారర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ సూపర్‌నేచురల్ హారర్ మూవీ పేరు ‘ఓయిజా’ (Ouija). 2014 లో విడుదలైన ఈ మూవీకి స్టైల్స్ వైట్ తొలి దర్శకుడిగా దీనికి దర్శకత్వం వహించాడు. జాసన్ బ్లమ్, మైఖేల్ బే, ఆండ్రూ ఫారం, బ్రాడ్లీ ఫుల్లర్ దీనిని నిర్మించారు. ఇందులో ఒలివియా కుక్, డారెన్ కగాసోఫ్, డగ్లస్ స్మిత్, బియాంకా ఎ. శాంటాస్‌లు నటించారు. యూనివర్సల్ పిక్చర్స్ అక్టోబర్ 24, 2014 న ‘Ouija’ ని విడుదల చేసింది. ఇది 5 మిలియన్ల బడ్జెట్‌తో ప్రపంచవ్యాప్తంగా 103 మిలియన్లను వసూలు చేసింది. మైక్ ఫ్లానాగన్ దర్శకత్వం వహించిన ప్రీక్వెల్, ఓయిజా: ఆరిజిన్ ఆఫ్ ఈవిల్, 2016లో విడుదలై మరింత వండర్ ని క్రియేట్ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

లైనీ మోరిస్ అనే యువతి, ఆమె తన చిన్ననాటి స్నేహితురాలు డెబ్బీ ఆత్మహత్య చేసుకున్న తర్వాత, ఆమె మరణానికి కారణం తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. డెబ్బీ మరణానికి ముందు ఒక ఓయిజా బోర్డ్‌తో గేమ్ ఆడినట్లు లైనీ గుర్తిస్తుంది. ఈ బోర్డు ద్వారా ఆత్మలతో మాట్లాడవచ్చని డెబ్బీ ఆ గేమ్ ఆడి ఉంటుంది. అయితే ఇప్పుడు చనిపోయిన డెబ్బీ ఆత్మతో లైనీ మాట్లాడి, ఆమె మరణానికి కారణం తెలుసుకోవాలనుకుంటుంది. లైనీ తన స్నేహితులతో కలసి డెబ్బీ ఆత్మతో మాట్లాడటానికి ఓవిజా బోర్డ్‌ను ఉపయోగిస్తుంది. అయితే డెబ్బీ ఆత్మకు బదులు అక్కడికి వేరే ఆత్మ వస్తుంది. వాస్తవానికి వారు డెబ్బీ అనుకుని ఆ దెయ్యంతో మాటలు కలుపుతారు. ఈ దెయ్యం ఒక చిన్న అమ్మాయి ఆత్మగా కనిపిస్తుంది. ఆ తర్వాత అది డెబ్బీ ఆత్మ కాదని, అది చాలా ప్రమాదకరమైనదని తెలుస్తుంది.

ఈ ఘటన తర్వాత, ఆమె స్నేహితులు ఒక్కొక్కరూ వింత అనుభవాలు, భయానక దృశ్యాలతో దాడులకు గురవుతారు. లైనీ ఈ రహస్యాన్ని ఛేదించేందుకు డెబ్బీ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆమె అసలు రహస్యాలను తెలుసుకంటుంది. గతంలో ఆ ఇంట్లో నివసించిన ఒక కుటుంబం ఓవిజా బోర్డ్ ద్వారా ఆత్మలతో ప్రయోగాలు చేసిందని, దాని ఫలితంగా ఒక దుష్ట శక్తి అక్కడ చిక్కుకుందని తెలుస్తుంది. చివరికి, ఈ దుష్ట శక్తిని ఆపడానికి లైనీ, ఆమె స్నేహితులు చనిపోయిన ఒక శరీరాన్ని కనిపెట్టి, దాని ద్వారా ఆత్మను విడుదల చేయాలని నిర్ణయిస్తారు. చివరికి ఆ దుష్ట శక్తిని లైనీ అడ్డుకుంటుందా ? అనేది తెలుసుకోవాలి అంటే ఈ సూపర్‌నేచురల్ హారర్ మూవీని చూడండి.

Read Also : ఆంటీలనే టార్గెట్ చేసి చంపే కిల్లర్… క్లైమాక్స్ ట్విస్ట్ కు బుర్ర బద్దలే

Related News

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×