E-Paper
Advertisement

మీ టూత్‌బ్రష్‌ను బాత్రూమ్‌లో అలా వదిలేస్తున్నారా? అయితే ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి!

మీ టూత్‌బ్రష్‌ను బాత్రూమ్‌లో అలా వదిలేస్తున్నారా? అయితే ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి!
Advertisement

Toothbrush Hygiene : మనం ఉదయాన్నే లేవగానే చేసే మొదటి పని టూత్‌బ్రష్ చేయడం. కానీ, అదే బ్రష్‌ను వాడిన తర్వాత మనం చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాలు మనల్ని రోగాల బారిన పడేస్తాయని ఎంతమందికి తెలుసు? నోటిని శుభ్రం చేసుకునే క్రమంలో మనకు తెలియకుండానే మనం ఒక బ్యాక్టీరియాని మన బాత్రూమ్‌లోనే పెంచి పోషిస్తున్నాం.

బ్యాక్టీరియా  కడుపులోకి వెళ్లే ప్రమాదం

Advertisement

చాలామంది బ్రష్ చేయగానే ఏదో డ్యూటీ అయిపోయిందన్నట్టు రెండు సెకన్లు నీళ్లలో ముంచి తీసేస్తుంటారు. ఇలా చేయడం వల్ల బ్రష్ బ్రిజిల్స్ అంటే ఆ వెంట్రుకల మధ్యలో మనం వాడిన టూత్‌పేస్ట్ అవశేషాలు, నోట్లోని లాలాజలం, ఆహార కణాలు అలాగే ఉండిపోతాయి. కొన్నాళ్లకి బ్రష్ మొదట్లో తెల్లటి పొరలా పేరుకుపోవడానికి అసలు కారణం ఇదే. ఇదంతా ఒకెత్తయితే, బ్రష్ హ్యాండిల్‌ను అస్సలు పట్టించుకోకపోవడం మరో పెద్ద తప్పు. మన చేతికి ఉండే మురికి, బ్రష్ చేస్తున్నప్పుడు నోటి నుంచి కారే నురుగు అంతా ఆ హ్యాండిల్‌కే అంటుకుంటుంది. మనం దాన్ని సరిగ్గా కడగకుండా మళ్లీ మళ్లీ పట్టుకోవడం వల్ల ఆ బ్యాక్టీరియా మన చేతుల ద్వారా కడుపులోకి వెళ్లే ప్రమాదం ఉంది.

నోట్లో పెట్టుకుంటే రోగాలు ఖాయం 

Advertisement

ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం.. బ్రష్‌ను వాష్ బేసిన్ మీదో లేదా బాత్రూమ్ కిటికీల్లోనో ఓపెన్‌గా వదిలేయడం. బాత్రూమ్ అనేది ఎప్పుడూ తడిగా ఉండే ప్రదేశం కాబట్టి అక్కడ బ్యాక్టీరియా బాగా  పెరుగుతుంది. పైగా ఇంట్లో ఎవరో ఒకరు వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుగుతున్నప్పుడు లేదా ఉమ్మేస్తున్నప్పుడు ఆ నీటి తుంపర్లు, క్రిములు నేరుగా పక్కనే ఉన్న మీ టూత్‌బ్రష్‌పై వచ్చి వాలుతాయి. ఇది వినడానికి కాస్త చేదుగా ఉన్నా ఇదే అసలు నిజం .ఇలాంటి బ్రష్‌ను మరుసటి రోజు మళ్లీ నోట్లో పెట్టుకుంటే రోగాలు రాకుండా ఎలా ఉంటాయి?

ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు కదూ !

అందుకే ఈ కంటికి కనిపించని ఈ  బ్యాక్టీరియా నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని అలవాటు చేసుకోవాలి. బ్రష్ చేయడం పూర్తి కాగానే, కేవలం నీళ్లలో ముంచడం కాకుండా,మంచిగా వాటర్ కింద పెట్టి చేతితో శుభ్రం చేయాలి. టూత్‌పేస్ట్ మార్క్ ఏమాత్రం మిగలకుండా చూడాలి. అలాగే హ్యాండిల్‌ను కూడా సబ్బుతోనో లేదా నీళ్లతోనో రుద్ది కడగాలి. కడిగిన తర్వాత బ్రష్‌ను గట్టిగా విదిల్చి, దానికి ఉన్న నీటి చుక్కలన్నీ పోయేలా చేయాలి.

ఆ తర్వాత దాన్ని ఎక్కడపడితే అక్కడ పడేయకుండా, గాలి ఆడేలా, కాస్త పొడిగా ఉండే ప్రదేశంలో నిలువుగా స్టాండ్‌లో పెట్టాలి. బ్రష్‌లు ఒకదానికొకటి తగలకుండా చూసుకోవడం ఇంకా మంచిది. చాలామంది బ్రష్ తేమగా ఉన్నప్పుడే ప్లాస్టిక్ క్యాప్స్ పెట్టేస్తుంటారు, కానీ అది మరింత ప్రమాదకరం. బ్రష్ పూర్తిగా ఆరిపోయిన తర్వాతే క్యాప్స్ ఉపయోగించాలి.

సో ..  ఇకనుంచైనా మీ టూత్ బ్రష్ ని నీట్ గా పెట్టుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు కదూ !

Also read :అరడజను సినిమాలు.. అంతంతమాత్రం బజ్.. ఆ సినిమా అయినా వర్కవుట్ అవుతుందా?

Related News

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య పని ఒత్తిడి.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?

టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

ప్రతిరోజూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈ 10 అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు

చిన్న కిచెన్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. టాప్ 5 స్పేస్-సేవింగ్ ఫ్రిజ్‌లు బడ్జెట్ ధరలోనే

ఇంట్లో కత్తి మొద్దుబారిపోయిందా? పదును పెంచడానికి న్యూస్‌పేపర్‌ ఉంటే చాలు.. ఎలాగంటే

Big Stories

Advertisement
×