E-Paper
Advertisement

Vitamin D Deficiency: విటమిన్ డి లోపం.. ప్రారంభంలో కనిపించే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు !

Vitamin D Deficiency: విటమిన్ డి లోపం.. ప్రారంభంలో కనిపించే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు !
Advertisement

Vitamin D Deficiency: విటమిన్ డి అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. దీనిని సాధారణంగా ‘సన్ షైన్ విటమిన్’ అని పిలుస్తారు. ఎందుకంటే సూర్యరశ్మి నుంచి మన చర్మం దీనిని ఉత్పత్తి చేస్తుంది. విటమిన్ డి ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం, కాల్షియం శోషణకు దోహదపడుతుంది. అయితే.. ఈ విటమిన్ లోపం కేవలం బలహీనమైన ఎముకలకే కాకుండా.. చాలా మందికి తెలియని అనేక అసాధారణ లక్షణాలకు కూడా దారితీస్తుంది. ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. నిరంతర అలసట,బలహీనత:

విటమిన్ డి లోపం యొక్క అత్యంత సాధారణ,తరచుగా నిర్లక్ష్యం చేసే లక్షణాలలో ఒకటి నిరంతర అలసట. శరీరానికి అవసరమైనంత విశ్రాంతి తీసుకున్నా కూడా.. రోజంతా శక్తి లేనట్లు, నిస్సత్తువగా అనిపిస్తే దానికి విటమిన్ డి లోపం ఒక కారణం కావచ్చు. విటమిన్ డి శరీరంలోని కణాల శక్తి ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది లోపించినప్పుడు మాత్రం శక్తి స్థాయిలు గణనీయంగా తగ్గిపోతాయి.

Advertisement

చాలా మంది ఈ అలసటను ఒత్తిడి లేదా శారీరక శ్రమ పెరగడం వల్ల అని అనుకుంటారు. కానీ ఇలాంటి సమయంలో రక్త పరీక్ష చేయించుకుని విటమిన్ డి స్థాయిలను చెక్ చేసుకోవడం ముఖ్యం.

2. తరచుగా అనారోగ్యం, ఇన్ఫెక్షన్లు :

మీరు తరచుగా జలుబు, ఫ్లూ లేదా ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నట్లయితే.. మీ విటమిన్ డి స్థాయిలను చెక్ చేయించుకోవడం చాలా ముఖ్యం. విటమిన్ డి రోగనిరోధక వ్యవస్థ పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రోగ నిరోధక కణాలను నియంత్రిస్తుంది. అంతే కాకుండా అంటువ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. విటమిన్ డి లోపం ఉన్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి, శరీరానికి అనారోగ్యాలతో పోరాడే సామర్థ్యం తగ్గుతుంది.

3. మానసిక కల్లోలం లేదా నిరాశ:

శారీరక లక్షణాలతో పాటు.. విటమిన్ డి లోపం మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. విటమిన్ డి మెదడులోని సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. సెరోటోనిన్ మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడే హార్మోన్. ఈ విటమిన్ లోపం ఉన్నవారిలో నిరాశ, ఆందోళన లేదా తరచుగా మూడ్ స్వింగ్స్ మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనినే ‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్అని కూడా అంటారు.

4. నెమ్మదిగా గాయాలు మానడం :

మీ చర్మానికి అయిన చిన్న గాయాలు మానడానికి చాలా సమయం తీసుకుంటున్నట్లయితే.. అది విటమిన్ డి లోపం కావచ్చు. విటమిన్ డి, కొత్త చర్మాన్ని ఏర్పరచడానికి , మంట తగ్గించడానికి కీలకమైన భాగాలను ఉత్పత్తి చేయడంలో సహాయ పడుతుంది. దీని లోపం ఉన్నప్పుడు, శరీరం యొక్క సహజ పునరుద్ధరణ ప్రక్రియ నెమ్మదిస్తుంది.

Also Read: బరువు పెరగాలనుకుంటున్నారా ? అయితే ఇవి తినండి !

5. జుట్టు రాలడం:

సాధారణ జుట్టు రాలడం కాకుండా.. అధికంగా జుట్టు రాలడం లేదా గుండ్రటి మచ్చల రూపంలో జుట్టు రాలడం వంటి అసాధారణ జుట్టు సమస్యలు విటమిన్ డి లోపాన్ని సూచిస్తాయి. విటమిన్ డి కొత్త జుట్టు కుదుళ్లనుసృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు.. జుట్టు పెరుగుదల ఆగిపోతుంది లేదా నెమ్మదిస్తుంది.

పైన పేర్కొన్న లక్షణాలు ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా కూడా ఉంటాయి. కాబట్టి.. ఈ అసాధారణ సంకేతాలలో ఏవైనా మీకు నిరంతరంగా కనిపిస్తే.. వెంటనే డాక్టర్ ని సంప్రదించి బ్లడ్ టెస్ట్ విటమిన్ డి స్థాయిలను చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. సూర్యరశ్మి, ఆహారం ద్వారా విటమిన్ డి లభించకపోతే డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్లు తీసుకోవడం ఉత్తమం.

Related News

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

Big Stories

Advertisement
×