E-Paper
Advertisement

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!
Advertisement

Tummala Journey: స్వేచ్ఛ బ్యూరో: సత్తుపల్లి పురిటిగడ్డ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 40 వసంతాలైన సందర్భంగా సత్తుపల్లిలో శుక్రవారం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, తుమ్మల అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాజకీయంగా 40 సంవత్సరాలు నుండి తుమ్మలతో నడిచిన తెలుగుదేశం, బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, తుమ్మల తో గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సత్తుపల్లి నియోజకవర్గంలో ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా 40 ఏళ్ళై న సందర్భంగా ఆయన రాజకీయ పుట్టిల్లు సత్తుపల్లిలో 40 వసంతాల వేడుక చేశారు.

AI తో..

సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలో స్థానిక శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాగమయితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ పాల్గొన్నారు. డాక్టర్ తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ, ఏ శాఖలో ఉన్న, ఏ నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం ఉన్న మంత్రి తుమ్మల శ్వాస ఆయన ధ్యాస సత్తుపల్లి నియోజకవర్గం మీద ఉంటుందని సత్తుపల్లి ప్రజల రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన అభివృద్ధి పనులను ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్సీ ఆధారంగా స్ర్కీన్ పై ప్రదర్శించగా తుమ్మల అభిమానులు కార్యకర్తలు ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

Advertisement

Also read: భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి సెలీనా జైట్లీ.. నష్టపరిహారం ఎంతంటే?

ప్రత్యేక ఆకర్షణగా తుమ్మల తనయ..

సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడైన డాక్టర్ తుమ్మల యుగంధర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. “సత్తుపల్లి ప్రజల ప్రేమా భిమానాలే తుమ్మల కుటుంబానికి అతి పెద్ద బలం” అని భావోద్వేగంతో మాట్లాడిన ఆయన, తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం వెనుక కార్యకర్తల త్యాగం, ప్రజల ఆశీస్సులు ఉన్నాయని గుర్తు చేశారు. యుగంధర్ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే నాయకుడని కాంగ్రెస్ కార్యకర్తలు విశ్వాసం వ్యక్తం చేయడం, యుగంధర్ ను సభావేదిక వద్దే పలువురు కొనియాడటం విశేషం గా చెప్పు కోవచ్చు. యుగంధర్ పాల్గొన్న ఈ సభలో పలుమార్లు చప్పట్లతో హర్ష ధ్వానాలు మార్మోగాయి. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

Advertisement

Also read; చిక్కుల్లో విజయ్.. టీవీకే పార్టీపై ఫోర్జరీ ఆరోపణలు.. గవర్నర్‌కు AMMK ఫిర్యాదు

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×