E-Paper
Advertisement

విటమిన్ C లోపంతో బాధపడుతున్నారా? ఈ పండ్లు, కూరగాయలతో ఈజీగా చెక్ పెట్టండి!

విటమిన్ C లోపంతో బాధపడుతున్నారా? ఈ పండ్లు, కూరగాయలతో ఈజీగా చెక్ పెట్టండి!
Advertisement

Vitamin C Benefits: మనిషి శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్ సి పాత్ర చాలా కీలకం. దీనిని ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. మన రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ, చర్మాన్ని మెరిపించడంలోనూ ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా వాతావరణం మారినప్పుడు, తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరానికి ఈ విటమిన్ చాలా అవసరం. ఈ క్రమంలో విటమిన్ సి లోపం ఏర్పడితే మన శరీరంలో జరిగే మార్పులేంటి? పెంచుకోవడానికి ఏయే ఆహారం తీసుకోవాలి.. వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది శరీరానికి చేసే మేలేంటి?

విటమిన్ సి మన శరీరంలో కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మం, ఎముకలు, కండరాల దృఢత్వానికి పునాది వంటిది. అంతేకాకుండా.. ఈ విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తూ కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే.. క్రమం తప్పకుండా విటమిన్ సి తీసుకోవడం వల్ల సీజసన్‌గా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల తీవ్రత తగ్గి, ఆరోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడొచ్చు.

Advertisement

Also Read: జుట్టు ఒత్తుగా పెరగాలంటే నూనె ఎప్పుడు పెట్టుకోవాలి? ఉదయమా లేక రాత్రుళ్లా?

ఏయే ఆహారం తీసుకోవాలి?

విటమిన్ సి కోసం మనం ఖరీదైన మందుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నారింజ, నిమ్మ, బత్తాయి వంటి సిట్రస్ జాతి పండ్లలో ఇది పుష్కలంగా ఉంటుంది. వీటితో పాటు కివీ, స్ట్రాబెర్రీ, జామ పండ్లు, కూరగాయలైన క్యాప్సికమ్, బ్రోకలీ, పాలకూరలో కూడా ఈ విటమిన్ అధికంగా దొరుకుతుంది. రోజూ మనం తినే ఆహారంలో వీటిని భాగంగా చేసుకుంటే సహజంగానే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

సప్లిమెంట్లు వాడొచ్చా?

Advertisement

తాజా పండ్లు, కూరగాయలు అందుబాటులో లేనప్పుడు, పోషకాహార లోపం ఉన్నవాళ్లు డాక్టర్ల సలహా మేరకు టాబ్లెట్లు తీసుకోవచ్చు. అయితే, ఏదీ అతిగా వాడటం మంచిది కాదు. ఎక్కువ మొత్తంలో విటమిన్ సి సప్లిమెంట్లు తీసుకుంటే జీర్ణక్రియ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తుంటారు.

ఇతర ప్రయోజనాలు..

కేవలం రోగనిరోధక శక్తి మాత్రమే కాకుండా, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ, గాయాలు త్వరగా మానడంలోనూ విటమిన్ సి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మనం తినే ఆహారంలోని ఐరన్‌ను శరీరం గ్రహించేలా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి.. సప్లిమెంట్ల కంటే పండ్లు, సలాడ్లు, స్మూతీల రూపంలో ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది.

Also Read: చుక్క నూనె కూడా వద్దు.. ఆ ఒక్కటి ఉంటే చాలు, ఇంట్లోనే క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ!

Related News

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

ఈ 3 అలవాట్లే మంచి మనుషుల బలహీనతలు.. మీరూ ఇవే తప్పులు చేస్తున్నారా?

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

Big Stories

Advertisement
×