E-Paper
Advertisement

BJP : బీజేపీలో కొత్త స్కామ్.. పార్టీకే ఎసరు పెట్టారుగా?

BJP : బీజేపీలో కొత్త స్కామ్.. పార్టీకే ఎసరు పెట్టారుగా?
Advertisement

రాష్ట్రంలో కమలం పార్టీ రూటే సెపరేటు. ఒకసారి అధికార, ప్రతిపక్ష పార్టీకి ఝలక్ ఇస్తుంటుంది. మరోసారి ఆ రెండు పార్టీ మధ్య నలిగిపోతుంటుంది. దీనంతటికీ పార్టీ నాయకత్వమే కారణమని కిందిస్థాయి కేడర్ ఆరోపిస్తున్నది. అయినప్పటికీ నాయకత్వంలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదు. నాయకత్వం తీరుపై నేటికీ బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కేంద్రమంత్రి సన్నిహితుడికే పార్టీ పగ్గాలు అప్పగించడం కొందరికి మింగుడు పడటం లేదు. ఫలితంగా కేడర్, నాయకులు ఒక్కో దారిలో నడుస్తున్నట్టు తెలుస్తున్నది. గతంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇదే వ్యవహారంలో విభేదించి పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసింది. ఆ తర్వాత పార్టీ సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.

స్థానిక ఎన్నికల్లో వెనుకబాటు..

గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు పార్టీకి ఉన్నారు. ప్రస్తుతం వీరంతా క్రియాశీలక రాజకీయాలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం డీలా పడింది. అందుకు రాష్ట్ర నాయకత్వమే కారణమని సీనియర్లు పెదవి విరుస్తున్నారు. నాయకత్వ లేమి, సరైన అభ్యర్థులను ఎంపిక చేయకపోవడం, ప్రచార శైలిపై సమీక్షించకపోవడం, బలమైన వాయిస్ వినిపించకపోవడం వల్లే పార్టీకి నెగెటిల్ ఫలితాలు వచ్చాయన్నదే కాదనలేదని సత్యం.ఇదే విషయాన్ని ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం అంగీకరించినా బయటకు చెప్పుకోవడం లేదని ప్రచారం జరిగింది.

జిల్లా నాయకత్వం స్కామ్..

Advertisement

అయితే, స్థానిక సంస్థలైన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం సమీక్షించింది. దీనంతటికీ జిల్లా నాయకత్వం కారణమని తేల్చింది. ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు కోసం పార్టీ పంపిన నిధులను గుట్టు చప్పుడు కాకుండా మాయం చేసినట్టు తెలిసింది. కిందిస్తాయి నేతలకు డబ్బులు అందకుండా జిల్లా నాయకులే వాటిని స్కామ్ చేసినట్టు నిర్దారణ జరిగింది.దీంతో ప్రచారం నిర్వహించినా ఎన్నికల్లో డబ్బు ఖర్చుచేయకపోవడం పార్టీకి దెబ్బ పడినట్టు తెలిసింది. ఎవరైతే ఇలా ఎన్నికల ఖర్చు కోసం పంపిన డబ్బులు వాడుకున్నారో వారిని గుర్తించి డబ్బుల రికవరీ, వారిని పదవుల నుంచి తప్పించాలని కమలం పార్టీ నాయకత్వం ఆలోచన చేసినట్టు తెలుస్తుంది.

Hollow Fibre: ఈ కేబుల్‌తో మీ ఇంటర్‌నెట్ స్పీడ్ దూసుకుపోతుంది.. భారత్‌లో ఇదే ఫస్ట్..

Advertisement

ఇప్పటికే హై కమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో త్వరలోనే ఈ ప్రక్రియను చేపట్టనున్నట్టు తెలుస్తోంది. గత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ చాలా చోట్ల టఫ్ ఫైట్ ఇచ్చినా చివరిరౌండ్‌లో ఓడిపోయినట్టు తెలిసింది. కేవలం పదులసంఖ్యలో ఓట్ల తేడాను అధికారులు గుర్తించారు. అదే ఎన్నికల్లో నిధులు సవ్యంగా ఖర్చు చేసి అభ్యర్థులకు మరింత పుష్ అప్ ఇస్తే మరిన్ని సీట్లు, ఓటింగ్ శాతం పెరిగేదని బీజేపీ రాష్ట్ర నాయకత్వం అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఇకమీదట ఎన్నికల సమయంలో ఇలాంటి తప్పులు జరగకుండా చేూసుకునేందుకు ఓ కమిటీని సైతం ఏర్పాటు చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీలో క్రమశిక్షణ కలిగిన వారికి, కష్టపడే వారికే ప్రయారిటీ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర నాయకత్వం డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×