E-Paper
Advertisement

చుక్క నూనె కూడా వద్దు.. ఆ ఒక్కటి ఉంటే చాలు, ఇంట్లోనే క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ!

చుక్క నూనె కూడా వద్దు.. ఆ ఒక్కటి ఉంటే చాలు, ఇంట్లోనే క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ!
Advertisement

French Fries in Air Fryer: బయట దొరికే ఆయిల్ ఎక్కువగా వాడిన ఫ్రెంచ్ ఫ్రైస్ తిని ఆరోగ్యాన్ని చేతులారా నాశనం చేసుకోవడం కంటే.. ఇంట్లోనే హెల్దీగా చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. అది కూడా ఒక చుక్క ఆయిల్ లేకుండానే చేసుకుని తినొచ్చు. అవును.. ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఇది సాధ్యమే. మరి తక్కువ టైంలో, తక్కువ కేలరీలతో కరకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా..

కావాల్సిన పదార్థాలు:

ఈ రెసిపీ కోసం పెద్ద సైజు బంగాళదుంపలు, తగినంత ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి లేదంటే కారం. ఇంకా రుచి కోసం ఒరెగానో లేదా చాట్ మసాలా సిద్ధం చేసుకోవాలి. మీకు నచ్చితే కేవలం ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వాడుకోవచ్చు. లేదంటే అసలు నూనె లేకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: సమ్మర్‌లో బాడీ సూపర్ కూల్‌గా ఉండాలా? అయితే ఇంట్లోనే ఈ హెల్దీ డ్రింక్స్‌ను ట్రై చేయండి!

తయారీ విధానం ఇలా:

ముందుగా బంగాళదుంపల పొట్టు తీసి వాటిని పొడవుగా, సమానమైన ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలను చల్లని నీటిలో కనీసం అరగంట సేపు నానబెట్టడం వల్ల వాటిలోని అదనపు పిండి పదార్థం పోయి ఫ్రైస్ క్రిస్పీగా వస్తాయి. తర్వాత నీటిని వడకట్టి, ముక్కలను ఒక పొడి బట్టపై వేసి తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ ముక్కలను తీసుకుని ఉప్పు, కారం, మసాలాలు వేసి బాగా కలపాలి.

Advertisement

ఎయిర్ ఫ్రైయర్‌ను 200°C వద్ద ఐదు నిమిషాల పాటు ప్రీ హీట్ చేయాలి. తర్వాత ఫ్రైయర్ బాస్కెట్‌లో ఈ ముక్కలను పేర్చి, సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. మధ్యలో ఒకసారి బాస్కెట్‌ను బయటకు తీసి ముక్కలను అటు ఇటు కలిపితే అన్ని వైపులా సమానంగా వేగుతాయి. ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి రాగానే బయటకు తీసి సర్వ్ చేసుకోవడమే.

ఆరోగ్యానికి మంచిదేనా?

సాధారణంగా నూనెలో డీప్ ఫ్రై చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్‌తో పోలిస్తే.. ఎయిర్ ఫ్రైయర్‌లో చేసినవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో వాడే నూనె శాతం 80 నుంచి 90 శాతం వరకు తగ్గుతుంది కాబట్టి.. కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు, గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారు కూడా ఎలాంటి భయం లేకుండా వీటిని ఆస్వాదించవచ్చు.

Also Read: గ్యాస్ వద్దు.. ఇండక్షన్ అక్కర్లేదు.. కేవలం 10 నిమిషాల్లో హై-ప్రొటీన్ బ్రేక్‌ఫాస్ట్ రెడీ!

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×