E-Paper
Advertisement

మంగు మచ్చలతో ముఖం పేలవంగా మారిందా? ఇంట్లోనే సులభంగా ఇలా తొలగించండి

మంగు మచ్చలతో ముఖం పేలవంగా మారిందా? ఇంట్లోనే సులభంగా ఇలా తొలగించండి
Advertisement

Melasma Home Remedy| మెలాస్మా అనేది చాలా సాధారణ చర్మ సమస్య. అయితే దీని వల్ల ముఖంపై నల్లని ముదురు మచ్చలు ఏర్పడతాయి. సాధారణంగా బుగ్గలు, నుదురు, ముక్కు, పై పెదవి వంటి ప్రాంతాల్లో ఈ మచ్చలు కనిపిస్తాయి. ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చర్మ రంగు ముఖంపై అసమానంగా ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అయితే సరైన సంరక్షణతో మెలాస్మాను కంట్రోల్ చేయవచ్చు.

మెలాస్మా అంటే ఏమిటి?

మెలాస్మా అంటే చర్మంపై పెద్ద పెద్ద మచ్చలు రావడం. వీటినే మంగు మచ్చలు అంటారు.  దీని వల్ల గోధుమ, బ్రౌన్ లేదా బూడిద రంగు మచ్చలు ముఖంపై ఏర్పడుతాయి. ఎండకు ఎక్కువగా గురయ్యే ప్రాంతాల్లో ఈ మచ్చలు ఎక్కువగా కనిపిస్తాయి. చర్మంలో మెలనిన్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల ఈ సమస్య వస్తుంది. మెలాస్మా ఆరోగ్యానికి హాని చేయదు కానీ అందాన్ని ప్రభావితం చేస్తుంది.

మెలాస్మాకు ప్రధాన కారణాలు

Advertisement

మెలాస్మా అంతర్గత, బాహ్య కారణాల వల్ల వస్తుంది.

సూర్యకాంతి

ఎండలోని యువి కిరణాలు చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఎండ కారణంగా అధిక మెలనిన్ వల్లే చర్మం ఎండలో ఎక్స్‌పోజర్ కూడా మచ్చలను మరింత ఎక్కువ చేస్తుంది.

హార్మోన్ల మార్పులు

Advertisement

గర్భం లేదా బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది చర్మంలో రంగు ఉత్పత్తి చేసే కణాలను ఉత్తేజపరుస్తుంది.

జన్యు కారణాలు

తల్లిదండ్రులు లేదా కుటుంబంలోని రక్త సంబంధాల్లో ఎవరికైనా మెలాస్మా ఉంటే ఇతరులకు కూడా వచ్చే అవకాశం ఎక్కువ.

స్ట్రెస్, జీవనశైలి

స్ట్రెస్ హార్మోన్లను దెబ్బతీసి మెలాస్మాను పెంచుతుంది.

కొన్ని మందులు లేదా కాస్మెటిక్ ఉత్పత్తులు

కొన్ని మందులు, సౌందర్య ఉత్పత్తులు చర్మంపై చికాకు కలిగించి మచ్చలను పెంచుతాయి.

మెలాస్మాను తగ్గించడానికి ఇంటి నివారణలు

సహజ నివారణ పద్ధతులు.. మంగు మచ్చలను నెమ్మదిగా తగ్గించగలవు. ఇవి క్రమం తప్పకుండా వాడాలి.

అలోవెరా జెల్

అలోవెరాలో సహజ కాంపౌండ్స్ ఉంటాయి. తాజా జెల్‌ను ప్రభావిత ప్రాంతాలపై రోజూ అప్లై చేయండి. ఇది చర్మ టెక్స్చర్, రంగును మెరుగుపరుస్తుంది.

పసుపు పేస్ట్

పసుపులో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, బ్రైటెనింగ్ గుణాలు ఉన్నాయి. పసుపును పాలతో కలిపి మచ్చలపై పూయండి. క్రమం తప్పకుండా వాడితే మంచి మార్పు కనిపిస్తుంది.

నిమ్మకాయ, తేనె

నిమ్మకాయ సహజ బ్లీచింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది. తేనె చర్మాన్ని మెత్తగా ఉంచుతుంది. మిశ్రమాన్ని కొన్ని నిమిషాలు పూసి కడగండి.

బంగాళదుంప రసం

బంగాళదుంప రసం సహజంగా మచ్చలను తగ్గిస్తుంది. ప్రభావిత ప్రాంతాలపై పూసి కొంతసేపు ఉంచండి. ఇది చర్మాన్ని నెమ్మదిగా కాంతివంతం చేస్తుంది.

రోజూ సన్‌స్క్రీన్ వాడండి

మెలాస్మా నియంత్రణకు సన్‌స్క్రీన్ చాలా ముఖ్యం. SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను రోజూ వాడండి. ఇది చర్మాన్ని హానికర UV కిరణాల నుంచి రక్షిస్తుంది.

Also Read: మచ్చలు లేని మెరిసే చర్మం కావాలా? ఇంట్లోనే బాడీ స్క్రబ్ ఇలా చేయండి

మెలాస్మాను నియంత్రించడానికి జీవనశైలి చిట్కాలు

తగినంత నీరు తాగి చర్మాన్ని తేమగా ఉంచండి. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోండి. యోగా లేదా ధ్యానం ద్వారా స్ట్రెస్‌ను నియంత్రించండి. మధ్యాహ్నం ఎండలో బయటకు వెళ్లకండి. మంచి అలవాట్లు మెలాస్మాను సమర్థవంతంగా నియంత్రిస్తాయి.

మంగు మచ్చలు ప్రధానంగా ఎండ, హార్మోన్ల మార్పుల వల్ల వస్తుంది. ఇది పూర్తిగా తొలగకపోయినా నియంత్రించవచ్చు. ఇంటి చిట్కాలు, సరైన సంరక్షణతో మంగు మచ్చలను తగ్గించవచ్చు.

Related News

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

Big Stories

Advertisement
×