Tollywood: కొన్ని కాంబినేషన్లు అనుకోకుండా సెట్ అయినా సరే బాక్సాఫీస్ వద్ద ఏదో తెలియని మ్యాజిక్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. అయితే మళ్లీ ఆ కాంబోలో సినిమా రావాలి అంటే ఒక్కొక్కసారి అన్నీ కుదిరితే వెంటనే ఆ జంట మళ్ళీ సెట్ పై కనిపిస్తుంది. లేదంటే దశాబ్దాలు సమయం పట్టొచ్చు. అలా ఒకప్పుడు నువ్వు వస్తానంటే నేనొద్దంటానా అనే సినిమాతో మ్యాజిక్ చేసి.. ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కి అందరి హృదయాలను దోచుకున్న జంట సిద్ధార్థ్ (Siddharth)- త్రిష(Trisha ). తెరపై వీరు పండించిన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అందరి దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ కాంబినేషన్లో మళ్లీ సినిమా రావాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూడగా.. ఇన్నాళ్ల ఎదురుచూపుకు తెరపడింది. నిర్మాత దిల్ రాజు(Dilraju ) ఈ కాంబోని మళ్లీ తెరపైకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయినట్లు సమాచారం.
ప్రభుదేవా (Prabhudeva) దర్శకత్వంలో సిద్ధార్థ్ -త్రిష జంటగా ఎమ్మెస్ రాజు నిర్మించిన చిత్రం ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’. 2005 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 21 ఏళ్ల తర్వాత ఈ సినిమా కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతోంది అనేదే ఆ వార్తల సారాంశం. సిద్ధార్థ్ – త్రిష హీరో హీరోయిన్లుగా ఒక నూతన దర్శకుడితో ఈ కొత్త సినిమా రూపొందించనున్నారట. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తారని సమాచారం. అయితే ఇప్పుడు రాబోతున్న ఈ కొత్త సినిమా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా చిత్రానికి సీక్వెల్ గా రూపొందిస్తున్నారా? లేక ఇదే కాంబినేషన్లో మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారా? అన్నది త్వరలోనే తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ విషయంపై దిల్ రాజు సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. మరికొంతమంది ఆల్మోస్ట్ కథ చర్చలు కూడా ముగిసాయి.. ఒక కొత్త దర్శకుడుని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను చేస్తున్నారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
also read:సలార్ 2 పై ప్రభాస్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే క్రేజీ అప్డేట్!
నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో లవ్ స్టోరీ మాత్రమే కాదు ఎమోషనల్ బాండింగ్ కూడా అందర్నీ కట్టిపడేసింది. పైగా ఈ సినిమాలోని డైలాగ్స్ ఎప్పటికీ కల్ట్ క్లాసిక్ అనే చెప్పాలి. ఇందులో త్రిష తన స్నేహితురాలి పెళ్లికి వస్తుంది. స్నేహితురాలి బావ అయిన సిద్ధార్థ్ ఆయన స్నేహితుడు సునీల్ కూడా పెళ్లికి హాజరవుతారు. పెళ్లికి ముందు జరిగే కార్యక్రమంలో భాగంగా పెళ్లికూతురు ఫ్రెండ్స్ అంతా చేరి ఒకే చోట నైట్ ముచ్చట్లు పెట్టుకుంటారు. ఆ సమయంలో ఒక్కొక్కరు తమ ఆస్తుల వివరాలు చెబుతుంటే.. హీరోయిన్ మాత్రం..” మా ఊళ్లో ఒక చిన్న ఇల్లు.. పది ఎకరాల పొలం.. నాలుగు ఎద్దులు..పాతిక కోళ్లు.. వీటిని మించి నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే మా అన్నయ్య ఉన్నాడు.. ఇదే నాకు కోట్ల ఆస్తి” అంటూ చెప్పి హీరోని ఆకట్టుకుంటుంది. అలా ఆ తర్వాత నెమ్మదిగా హీరో హీరోయిన్ నీ ఇష్టపడతారు.. ఇక తర్వాత పెద్దలను వ్యతిరేకించి హీరోయిన్ ఇంటికి వెళ్లడం.. అక్కడ హీరోయిన్ అన్నయ్య పెట్టే కష్టాలు అటు వినూత్నంగా కామెడీగా చూపిస్తూ డైరెక్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. మొత్తానికైతే ఈ సినిమా మంచి హిట్ అయింది.. అలాంటి ఈ సినిమాకి ఇప్పుడు కొనసాగింపుగా వస్తుందా లేక కొత్త కథనా అన్నది తెలియాల్సి ఉంది.