మే నెల ప్రారంభం కావడమే కాకుండా ఎండల తీవ్రత కూడా విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమైన బ్యాంకు పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారు ఒకసారి క్యాలెండర్ పరిశీలించడం చాలా అవసరం. భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) మే 2026 నెలకు సంబంధించిన అధికారిక బ్యాంకు సెలవుల జాబితాను ఇప్పటికే ప్రకటించింది. ఆదివారాలు, రెండో మరియు నాలుగో శనివారాలతో పాటుగా వివిధ పండుగలు రావడంతో ఈ నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. వేసవి వేడి నుంచి తప్పించుకోవడానికి పనులను ముందే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం అని అధికారులు సూచిస్తున్నారు.
నెల ప్రారంభంలోనే పండుగలు
మే మొదటి రోజే బుద్ధ పూర్ణిమ రావడంతో పాటు మే డే వేడుకలు ఉన్నాయి. మే 1వ తేదీ శుక్రవారం కావడం వల్ల మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆ తర్వాతి రోజు మే 2న బ్యాంకులు పనిచేస్తాయి. మే 3వ తేదీ ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా సాధారణ సెలవు వర్తిస్తుంది. మే 9న రెండో శనివారంతో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రావడంతో బ్యాంకులు పనిచేయవు. మే 10న ఆదివారం కావడం వల్ల కస్టమర్లకు బ్రాంచ్ సేవలు అందుబాటులో ఉండవు.
నెల మధ్యలో మే 16 శనివారం కొన్ని రాష్ట్రాల్లో ‘రాష్ట్ర దినోత్సవం’ జరుపుకుంటారు. ఆయా ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంచుతారు. మే 17వ తేదీ ఆదివారం కావడంతో యథావిధిగా సెలవు ఉంటుంది. మే 23వ తేదీ నాలుగో శనివారం కాగా మే 24న ఆదివారం సెలవు వస్తుంది. మే 26 మంగళవారం నాడు కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి సందర్భంగా కొన్ని ప్రత్యేక రాష్ట్రాల్లో సెలవు ప్రకటించారు.
మే 1 (శుక్రవారం): బుద్ధ పూర్ణిమ, మే డే
మే 3 : ఆదివారం
మే 9 : రెండో శనివారం, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి
మే 10 : ఆదివారం
మే 16 (శనివారం): కొన్ని రాష్ట్రాలకు ‘స్టేట్ ఫార్మేషన్ డే’
మే 17 : ఆదివారం
మే 23: నాలుగో శనివారం
మే 24 : ఆదివారం
మే 26: మంగళవారం – కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి (కొన్ని రాష్ట్రాలకు హాలీడే)
మే 27: బుధవారం) – బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) (చాలా రాష్ట్రాల్లో హాలీడే)
మే 28 : (గురువారం): బక్రీద్ సందర్భంగా మరికొన్ని రాష్ట్రాల్లో అదనపు సెలవు ఉంటుంది.
మే 31 : ఆదివారం
బక్రీద్ సెలవు
నెల చివరి వారంలో ముస్లిం సోదరుల పండుగ బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) రానుంది. మే 27 బుధవారం నాడు దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది. మే 28 గురువారం నాడు బక్రీద్ ప్రభావంతో మరికొన్ని రాష్ట్రాల్లో అదనంగా సెలవులు ఇచ్చారు. మే 31వ తేదీ ఆదివారం కావడంతో ఈ నెలలో చివరి సెలవు దినం పూర్తవుతుంది.
అందుబాటులో డిజిటల్ సేవలు
బ్యాంకులు మూసివేసినప్పటికీ వినియోగదారులకు డిజిటల్ సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదు. UPI లావాదేవీలు మొబైల్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. నగదు అవసరాల కోసం ఏటీఎంలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయి. కేవలం చెక్ క్లియరెన్స్ పాస్‌బుక్ అప్‌డేట్ వంటి నేరుగా బ్రాంచ్‌కు వెళ్లే పనులు మాత్రమే ఆగిపోతాయి. స్టాక్ మార్కెట్ కూడా మే 1 అలాగే మే 28 తేదీల్లో ట్రేడింగ్‌కు విరామం ప్రకటించింది.
ALSO READ: సింగిల్ ఛార్జ్ తో 700 కి.మీ దూసుకెళ్లే బెంజ్.. ఇండియాలో లాంచింగ్ ఎప్పుడంటే?