E-Paper
Advertisement

Saffron water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో కుంకుమపువ్వు నీళ్లు తాగితే ఏమవుతుంది?

Saffron water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో కుంకుమపువ్వు నీళ్లు తాగితే ఏమవుతుంది?
Advertisement

కుంకుమ పువ్వుకు హిందూ సాంప్రదాయ ఆహారంలో ప్రత్యేక స్థానం ఉంది. కుంకుమపువ్వు నీళ్లు తాగడం ఒక ట్రెండ్‌గా మారింది. కుంకుమపువ్వు చాలా ఖరీదైనదైనా.. ఇందులో ఉన్న పోషకాలు శరీరానికి ఎంతో ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే, శరీరం ఈ పోషకాలను త్వరగా గ్రహిస్తుంది. అందుకే చాలా మంది దీన్ని తమ డైలీ రొటీన్‌లో భాగంగా చేసుకుంటున్నారు. కుంకుమపువ్వులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా, లోపల జరిగే అనేక ప్రక్రియలను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా ఉదయం తాగితే మెటబాలిజం వేగంగా పనిచేయడం ప్రారంభమవుతుంది. అంటే మనం తినే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది, కేలరీలు సులభంగా ఖర్చవుతాయి. దీని వల్ల బరువు నియంత్రణలో కూడా కొంతవరకు సహాయం అందుతుంది.

కుంకుమ పువ్వు నీళ్లు తాగడం వల్ల శరీరం డిటాక్సిఫికేషన్ అవుతుంది. మనం రోజూ తీసుకునే ఆహారం, కాలుష్యం వల్ల శరీరంలో కొన్ని హానికర పదార్థాలు పేరుకుపోతాయి. కుంకుమపువ్వు నీళ్లు తాగడం వల్ల ఇవి బయటకు వెళ్లడానికి సహాయం చేస్తాయి. దీంతో శరీరం తేలికగా అనిపిస్తుంది, అలసట తగ్గుతుంది. అలాగే ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల కడుపు సమస్యలు తగ్గే అవకాశం ఉంది.

Advertisement

Also read: Weight loss tips: పది రోజుల్లో 5 కిలోలు తగ్గాలంటే రోజూ ఎంతసేపు నడవాలి?

ముఖం మెరిసిపోతుంది
చర్మ ఆరోగ్యానికి కూడా కుంకుమపువ్వు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీన్ని రెగ్యులర్‌గా తాగితే ముఖానికి సహజ కాంతి వస్తుంది. మొటిమలు, మచ్చలు తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్ లక్షణాల వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బయట క్రీములు వాడటంతో పాటు లోపల నుంచి కూడా శరీరాన్ని శుభ్రంగా ఉంచితేనే నిజమైన అందం వస్తుంది. మహిళల ఆరోగ్యానికి కూడా కుంకుమపువ్వు నీళ్లు ఉపయోగపడతాయి. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు తగ్గడంలో, హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. అలాగే ఇది మూడ్‌ను కూడా మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో కూడా కొంతవరకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం తాగితే రోజంతా ఎనర్జీగా ఉండేందుకు సహాయం చేస్తుంది.

Advertisement

Also read: Smart Nails: ఈ స్మార్ట్ గోళ్లు అతికించుకుంటే మీకు నచ్చిన గోళ్ల రంగును సెకన్లలో మార్చేసుకోవచ్చు

ఎన్నో రేకలు నీళ్లలో నానబెట్టాలి
కుంకుమపువ్వు నీళ్లు తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం. ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. సాధారణంగా 4 నుంచి 5 రేకలు సరిపోతాయి. వాటిని రాత్రి ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి, ఉదయాన్నే తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఎక్కువ మోతాదులో తీసుకుంటే దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గర్భిణీలు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ముందుగా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కుంకుమపువ్వు నీళ్లు తాగడం వల్ల శరీరానికి కొన్ని మంచి ప్రయోజనాలు ఉన్నాయి. మెటబాలిజం మెరుగుపడటం, చర్మం కాంతివంతంగా మారటం, శరీరం డిటాక్స్ అవడం వంటి లాభాలు పొందవచ్చు.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×