E-Paper
Advertisement

AV Ranganath: కాముని చెరువును సంద‌ర్శించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగనాధ్

AV Ranganath: కాముని చెరువును సంద‌ర్శించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగనాధ్
Advertisement

AV Ranganath:  మూసాపేట‌లోని కాముని చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ (AV Ranganath) సోమ‌వారం సంద‌ర్శించారు. హైడ్రా రెండో విడ‌త చేప‌డుతున్న 14 చెరువుల్లో కాముని చెరువు కూడా ఉన్న సంగతి తెల్సిందే. ఈ చెరువు పున‌రుద్ధ‌ర‌ణ‌ను వెంట‌నే చేప‌ట్టాల‌ని అక్క‌డి స్థానికులు క‌మిష‌న‌ర్‌ను క‌లిసి విన్న‌వించారు. కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువులా దీనిని కూడా అభివృద్ధి చేస్తే, దోమ‌ల ఇబ్బందులు త‌గ్గుతాయ‌ని, దుర్గంధం దూర‌మవుతుంద‌ని ప‌లువురు పేర్కొన్నారు.

Also  Read: Actor Vishwa: కొత్త బిజినెస్ ప్రారంభించిన బుల్లితెర నటుడు విశ్వ.. కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్!

ప‌నుల‌ను స్పీడ‌ప్ చేస్తాం 

Advertisement

దోమ‌ల వ‌ల్ల ప్ర‌స్తుతం నివాసాల త‌లుపులు తీయ‌లేక‌పోతున్నామ‌ని వాపోయారు. అయితే ఈ చెరువు పున‌రుద్ధ‌ర‌ణ‌కు సంబంధించి హెచ్ఎండీఏ నుంచి సాంకేతిక అనుమ‌తులు రావాల్సి ఉంద‌ని, అవి రాగానే ప‌నుల‌ను స్పీడ‌ప్ చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా హైడ్రా క‌మిష‌న‌ర్‌కు అక్క‌డ ప‌నులు ప‌ర్య‌వేక్షిస్తున్న అధికారులు వివ‌రించారు. ఈ లోగా దోమ‌ల ఇబ్బంది త‌లెత్త‌కుండా గుర్ర‌పు డెక్క‌ను తొల‌గించాల‌ని, చెరువులోని మురుగు నీటిని బ‌య‌ట‌కు పంపాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.

నిర్మాణ ప‌నుల‌ను పూర్తి చేయాలి 

కాముని చెరువు నుంచి మూసాయి కుంట‌కు వెళ్లే వ‌ర‌ద కాలువ ప‌నుల‌ను కూడా హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు. కాలువ నిర్మాణాల్లో సాంకేతిక లోపాల‌ను ప‌రిశీలించి నిర్మాణ ద‌శ‌లోనే వాటిని ప‌రిష్క‌రించాల‌ని ఇరిగేష‌న్ అధికారుల‌కు సూచించారు. వ‌ర‌ద ప్ర‌వాహానికి ఆటంకం లేకుండా కాలువ నిర్మాణ ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని వాస‌వి నిర్మాణ సంస్థ ప్ర‌తినిధుల‌కు హైడ్రా క‌మిష‌న‌ర్ సూచించారు. ఈ వ‌ర్షాకాలానికి చెరువును పున‌రుద్ధ‌రించి, ఫ్రెష్ వాట‌ర్ చేరేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Advertisement

Also  Read: Oppo Find X9 Ultra: ఒప్పో నుంచి రెండు ఫ్లాగ్‌షిప్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. లాంచ్ డేట్, స్పెసిఫికేషన్స్ లీక్!

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×