E-Paper
Advertisement

Lemon and Salt: రాత్రిపూట మంచం పక్కన నిమ్మకాయ,ఉప్పు పెట్టుకుంటే ఏమవుతుంది?

Lemon and Salt: రాత్రిపూట మంచం పక్కన  నిమ్మకాయ,ఉప్పు పెట్టుకుంటే ఏమవుతుంది?
Advertisement

చలికాలం వచ్చిందంటే చాలామందికి నిద్ర సమస్యలు మొదలవుతాయి. రాత్రి ముక్కు దిబ్బడ, గొంతు పొడిబారడం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి కారణాలతో నిద్ర సరిగా పట్టదు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చాలామంది ఇంట్లో దొరికే చిట్కాలను ఆశ్రయిస్తారు. అలాంటి వాటిలో ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పద్ధతి ఏమిటంటే… మంచం పక్కన నిమ్మకాయను కోసి దానిపై ఉప్పు చల్లి పెట్టడం. ఇది నిజంగా పనిచేస్తుందా లేక కేవలం ఒక అపోహ అనేది తెలుసుకోవాలి. కానీ ఈ చిట్కా మాత్రం వాట్సాప్ గ్రూపుల్లో తెగ షేర్ అవుతోంది.

ఇలా ఎందుకు చేస్తారు?
ఈ పద్ధతి చాలా కాలంగా కొన్ని కుటుంబాలు ఫాలో అవుతున్నాయి. పడుకునే ముందు ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి, దానిపై కొద్దిగా ఉప్పు చల్లి ఒక ప్లేట్‌లో పెట్టి మంచం పక్కన ఉంచుతారు. ఇలా చేస్తే గదిలోని గాలి శుభ్రపడుతుందని, చెడు వాసనలు తగ్గుతాయని కొందరి నమ్మకం. నిమ్మకాయ నుంచి వచ్చే సిట్రస్ వాసన వల్ల శ్వాస తీసుకోవడం సులభమవుతుందని, ముక్కు దిబ్బడ తగ్గినట్టు అనిపిస్తుందని అంటారు. ముఖ్యంగా చలికాలంలో గాలి పొడిగా మారినప్పుడు ఈ వాసన మనసుకు ప్రశాంతతనిచ్చి నిద్ర బాగా పడుతుందని చాలామంది చెబుతున్నారు.

Advertisement

Also read: Milk and Acne: పాలు తాగితే మొటిమలు వస్తాయా? ఈ రెండింటికీ మధ్య సంబంధం ఏమిటి?

సైన్సు ఏం చెబుతోంది?
నిపుణుల మాటల్లో చెప్పాలంటే, నిమ్మకాయ–ఉప్పు పెట్టడం వల్ల నిద్ర నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుందన్న బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. నిమ్మకాయ వాసన వల్ల కొంతమందికి తాజాదనం, రిలాక్సేషన్ అనిపించవచ్చు. అది మనసుకు సాంత్వన కలిగించి నిద్ర పట్టేలా చేయవచ్చు. కానీ ఇది ఎక్కువగా మానసిక ప్రభావం అని వైద్యులు చెబుతున్నారు. ఉప్పుకు తేమను ఆకర్షించే గుణం ఉన్నప్పటికీ, ఒక చిన్న నిమ్మకాయ, ఉప్పు గదిలోని గాలి నాణ్యతను మార్చేంత ప్రభావం చూపదని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి దీన్ని వైద్య పరిష్కారంగా భావించడం సరైంది కాదని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Also read: Carrot Bobbatlu: క్యారెట్ హల్వా స్టఫ్ చేసిన బొబ్బట్లు రెసిపీ.. చూస్తేనే నోరూరిపోతుంది

సాధారణంగా తేలికపాటి నిద్రలేమి లేదా ముక్కు దిబ్బడ ఉన్నవారికి ఈ వాసన కొంత ఉపశమనం ఇచ్చినట్టు అనిపించవచ్చు. కానీ దీర్ఘకాల నిద్ర సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు ఈ చిట్కాపై మాత్రమే ఆధారపడకూడదు. నిద్ర బాగా రావాలంటే గదిలో సరైన గాలి ప్రసరణ ఉండాలి, చాలా పొడి గాలి ఉంటే హ్యూమిడిఫైయర్ ఉపయోగించాలి. పడుకునే ముందు మొబైల్, టీవీ వినియోగాన్ని తగ్గించాలి. కాఫీ, టీ వంటి పానీయాలను రాత్రివేళల్లో తాగకూడదు. మంచం పక్కన నిమ్మకాయ–ఉప్పు పెట్టడం వల్ల పెద్ద హాని ఏమీ లేదు. కానీ ఇది ఒక సాధారణ ఇంటి చిట్కా మాత్రమే. వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×