E-Paper
Advertisement

విదేశీయులు ఇష్టపడే ఈ ఇండియన్ డిష్ పుట్టింది బ్రిటన్‌లోనే అని తెలుసా?

విదేశీయులు ఇష్టపడే ఈ ఇండియన్ డిష్ పుట్టింది బ్రిటన్‌లోనే అని తెలుసా?
Advertisement

Chicken Tikka Masala: ఆహారానికి మనుషులను, వేర్వేరు ప్రాంతాలను ఒకే తాటిపైకి తెచ్చే అద్భుతమైన శక్తి ఉంది. మనందరికీ ఎన్నో రకాల వంటకాలు ఇష్టంగా ఉంటాయి. అయితే మనం ఎంతగానో ఇష్టపడే కొన్ని వంటకాల వెనుక చాలా ఆసక్తికరమైన కథలు ఉంటాయి. విదేశీయులు ఎంతో ఇష్టంగా తినే ‘చికెన్ టిక్కా మసాలా’ కూడా అలాంటి ఒక వింతైన చరిత్రను కలిగి ఉంది. చాలామంది ఇది పక్కా మన భారతీయుల వంటకం అని అనుకుంటారు. కానీ దీని అసలు మూలాలు బ్రిటన్‌లో ఉన్నాయి అంటే మీరు నమ్ముతారా?

అసలు కథ ఏంటంటే?

సోషల్ మీడియాలో ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా ఈ డిష్ గురించిన అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చాలామంది విదేశీయులు తమకు అత్యంత ఇష్టమైన భారతీయ ఆహారం చికెన్ టిక్కా మసాలా అని చెబుతుంటారు. అయితే బ్రిటన్‌లో జాతీయ వంటకంగా పేరుగాంచిన ఈ వంటకాన్ని అక్కడ పనిచేసే ఒక బంగ్లాదేశీ చెఫ్ సృష్టించినట్లు తెలుస్తోంది. మన ఊరి రుచులను బ్రిటన్ ప్రజలకు నచ్చేలా మార్చడంలో భాగంగా ఈ వంటకం పుట్టుకొచ్చింది.

Advertisement

Also Read: నిద్రలో కాలి కండరాలు పట్టేయడానికి కారణమేంటి? ఎప్పుడు ప్రమాదకరమంటే..

స్కాట్లాండ్‌లో పుట్టిన రుచి..

ఈ వంటకం ఎలా మొదలైందనే దానికి రకరకాల కథలు ఉన్నాయి. అందులో బాగా ప్రాచుర్యంలో ఉన్న కథ స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరానికి చెందినది. 1970లలో అలీ అహ్మద్ అస్లామ్ అనే చెఫ్ వద్దకు వచ్చిన ఒక కస్టమర్, చికెన్ టిక్కా చాలా పొడిగా ఉందని చెప్పారట. దాంతో ఆ చెఫ్ చికెన్ ముక్కలకు టొమాటో సూప్, కొన్ని మసాలాలు కలిపి గ్రేవీలా తయారు చేసి ఇచ్చారు. అదే తర్వాత కాలంలో ప్రసిద్ధ చికెన్ టిక్కా మసాలాగా మారింది.

Advertisement

మరికొన్ని అభిప్రాయాలు..

ఈ కథ మాత్రమే కాకుండా దీని వెనుక మరికొన్ని వాదనలు కూడా ప్రచారంలో ఉన్నాయి. 1950లలో ఢిల్లీలో బటర్ చికెన్‌ను కనుగొన్న కుందన్ లాల్ జగ్గీ, కుందన్ లాల్ గుజ్రాల్‌లకు కూడా ఈ వంటకం తయారీతో సంబంధం ఉందనే అభిప్రాయం ఉంది. అలాగే 1960లలో బ్రిటన్‌కు వెళ్లిన బంగ్లాదేశ్ వంటగాళ్లు అక్కడ స్థానిక ప్రజల అభిరుచికి తగ్గట్టుగా తయారు చేసిన కొత్త రకం వంటకమే ఇదని మరికొందరు చెబుతుంటారు.

ప్రపంచ వేదికపై కొత్త వివాదం..

టేస్ట్ అట్లాస్ సంస్థ 2024లో ప్రపంచంలోనే అత్యుత్తమ చికెన్ వంటకాల జాబితాను విడుదల చేసింది. అందులో చికెన్ టిక్కా మసాలాకు బ్రిటన్ జెండాను కేటాయించారు. ఇది భారతీయ డిష్ అనుకున్న చాలామందికి పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే అదే జాబితాలో మన భారతదేశానికి చెందిన బటర్ చికెన్ నాల్గో స్థానంలో, చికెన్ టిక్కా ఆరో స్థానంలో, చికెన్ 65 పదో స్థానంలో నిలిచి మన దేశ రుచుల గొప్పదనాన్ని చాటిచెప్పాయి.

Also Read: పప్పుచారులో నంజుకోవడానికి బాప్‌లాంటి ‘కరివేపాకు రొయ్యల వేపుడు’.. తింటే ఫిదా అయిపోతారు!

Tags

Related News

నచ్చిన ఆహారం తింటూ.. కిలో బరువు తగ్గాలంటే.. రోజుకు ఎన్ని అడుగులు నడవాలి?

గుంటూరు స్పెషల్ కోవా పూరీ..ఇంట్లోనే ఇలా చేస్తే స్వీట్ షాప్ టేస్ట్!

వంకాయ నువ్వుల రోటి పచ్చడి..ఈ స్టైల్‌లో చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ!

పర్ఫెక్ట్ రాయలసీమ స్టైల్ ఉగ్గాని..ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!

రొమ్ము క్యాన్సర్ ఈ దశకు చేరితే ఏం జరుగుతుంది? ప్రతి మహిళ తెలుసుకోవాల్సిందే!

నోటికి కారంగా, సూపర్ టేస్టీగా ఆలూ పచ్చి కారం ఫ్రై!

నెల రోజులపాటు నిల్వ ఉండే రవ్వ లడ్డు..క్షణాల్లోనే చేయండిలా!

Big Stories

Advertisement
×