E-Paper
Advertisement

ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!

ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!
Advertisement

Indian Passport Ranking 2026: విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న భారతీయులకు పా స్‌పోర్ట్ ర్యాంకింగ్ అనేది అత్యంత కీలకమైన అంశం. తాజాగా విడుదలైన హెన్లీ పాస్‌ పోర్ట్ ఇండెక్స్ అక్టోబర్ 2026 ర్యాంకింగ్స్‌ లో భారత్ మరో స్థానాన్ని  మెరుగుపరుచుకుంది. గత ఏడాది 85వ స్థానంలో ఉన్న భారత పాస్‌పోర్ట్.. ఇప్పుడు 84వ ర్యాంకుకు చేరుకుంది. అయితే, ర్యాంకింగ్ మెరుగుపడినప్పటికీ, వీసా ఫ్రీ దేశాల సంఖ్య తగ్గాయి.

84వ స్థానానికి చేరిన భారత పాస్‌పోర్ట్!

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ తాజా వివరాల ప్రకారం, భారత్ 84వ స్థానాన్ని అల్జీరియా, మౌరిటానియా దేశాలతో పంచుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో భారత పాస్‌ పోర్ట్ ద్వారా 57 గమ్యస్థానాలకు వీసా లేకుండా లేదంటే ముందస్తు వీసా తీసుకోకుండానే ప్రయాణించే అవకాశం ఉండేది. తాజా జాబితాలో ఈ సంఖ్య 55కు తగ్గింది. 2026 జనవరిలో భారత్ 80వ స్థానంలో ఉండగా, ఫిబ్రవరిలో 75వ ర్యాంకుకు చేరుకుంది. అయితే, ఆ తర్వాత ర్యాంకింగ్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. జూలైలో 81వ స్థానానికి పడిపోయిన భారత్.. అక్టోబర్‌లో 84వ స్థానంలో నిలిచింది.

భారతీయులు వీసా లేకుండా వెళ్లే దేశాలివే!

Advertisement

తాజా లిస్టులో భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ముందుగా వీసా లేదకుండా ప్రయాణించే దేశాల్లో ఆసియా, ఆఫ్రికా, యూరప్‌కు సమీప ప్రాంతాలు, కరేబియన్ దీవులకు చెందిన దేశాలు ఉన్నాయి. వీటిలో భూటాన్, నేపాల్, మలేషియా, మాల్దీవులు, మారిషస్, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, కజకిస్తాన్, ఖతార్, జమైకా, బార్బడోస్, ఫిజీ, సీషెల్స్, శ్రీలంక, టాంజానియా, వనౌటు, జింబాబ్వే ఉన్నాయి. అలాగే కంబోడియా, లావోస్, మడగాస్కర్, మొజాంబిక్, రువాండా, సమోవా, సెనెగల్, సియెర్రా లియోన్, టిమోర్-లెస్టే, తువాలు, అంగోలా, డొమినికా, గ్రెనడా, హైతీ, కిరిబాటి, మైక్రోనేషియా, మంగోలియా, పలావు దీవులు కూడా లిస్టులో స్థానం సంపాదించుకున్నాయి. ఈ జాబితాలో 55 గమ్యస్థానాలు ఉన్నట్లు హెన్లీ ఇండెక్స్ వెల్లడించింది. అయితే, కొన్ని దేశాల్లో వీసా ఆన్ అరైవల్ లేదంటే ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ లాంటి నిబంధనలు వర్తించే అవకాశం ఉంది. ప్రయాణానికి ముందు సంబంధిత దేశ అధికారిక వెబ్‌సైట్‌లో తాజా నిబంధనలు తెలుసుకోవడం మంచిది.

ప్రపంచంలో పవర్ ఫుల్ పాస్‌పోర్ట్ ఏది?

తాజా ర్యాంకింగ్స్‌ లో సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆ దేశ పాస్‌పోర్ట్‌ తో 193 దేశాలకు ఎంట్రీ ఉంటుంది. జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 188 డెస్టినేషన్స్ తో రెండో స్థానాన్ని పంచుకున్నాయి. మరోవైపు, ఆఫ్ఘనిస్తాన్ పాస్‌పోర్ట్ 106వ స్థానంలో నిలిచి అత్యంత బలహీనమైన పాస్‌ పోర్ట్‌ గా కొనసాగుతోంది. ఆ పాస్‌పోర్ట్ ద్వారా కేవలం 22 గమ్యస్థానాలకు మాత్రమే ప్రవేశం లభిస్తోంది.

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ గురించి..   

Advertisement

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా 199 పాస్‌పోర్ట్‌ లను ర్యాంక్ చేస్తుంది. ముందస్తు వీసా పొందాల్సిన అవసరం లేకుండా ఎన్ని దేశాలకు వెళ్లవచ్చనే అంశాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది.  ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) అందించే డేటాను ఉపయోగించి ఈ ఇండెక్స్ ను రూపొందిస్తుంది.

Read Also: IRCTC టికెట్ బుకింగ్.. సీనియర్ సిటిజన్లకు ఉపయోగపడే సూపర్ టిప్స్!

Tags

Related News

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లకూ ఇన్సూరెన్స్.. రూ. 10 లక్షల బీమా కవరేజ్!

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

మొబైల్ కొట్టేయబోతే.. ప్రాణాల మీదికి వచ్చింది.. రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన!

రైలు ప్రయాణంలో నవరాత్రి జోష్.. లోకల్ ట్రైన్‌లో మహిళల ‘గర్భా’ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా!

సినిమా చూస్తూ ఆటో డ్రైవింగ్.. డ్రైవర్‌పై సీపీ సజ్జనార్ సీరియస్!

భక్తుల కోసం టీటీడీ కొత్త యాప్.. ‘వేంకటాద్రి’ ప్రత్యేకతలు ఇవే!

బీహార్ యువకుడితో రష్యా యువతి ప్రేమ.. గుడిసెలోనే ఉంటానంటూ ఇండియాకు వచ్చేసి..

Big Stories

Advertisement
×