Ajwain Seed Water: వాము ప్రయోజనాల గురించి తెలియని వారుండరు. వాము ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది కేవలం ఆహారానికి రుచిని పెంచడానికే కాకుండా.. అద్భుతమైన ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది. వాము గింజలను నీటిలో నానబెట్టి లేదా మరిగించి తాగడం వల్ల మన ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా.. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తీసుకోవడం వల్ల మరింత మేలు కలుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వాము నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. మెరుగైన జీర్ణక్రియ:
గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి వాటికి ఉపశమనం కలిగించడానికి వాము ఎంతగానో ఉపయోగపడుతుంది వాములో థైమోల్ అనే క్రియాశీలక ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను విడుదల చేయడంలో సహాయ పడుతుంది తద్వారా జీర్ణక్రియ మెరుగు పడుతుంది. కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
మలబద్ధకం నివారణ: జీర్ణవ్యవస్థను శుభ్రపరిచి, ప్రేగు కదలికలను మెరుగుప రుస్తుంది. దీని వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
2. బరువు తగ్గడంలో సహాయం:
మెటబాలిజం పెరుగుదల: వాము నీరు జీవ క్రియ రేటును పెంచుతుంది. మెరుగైన మెటబాలిజం వల్ల శరీరంలో పేరుకు పోయిన కొవ్వు త్వరగా కరుగుతుంది.
టాక్సిన్స్ తొలగింపు: ఇది శరీరంలోని విష పదార్థాలు, వ్యర్థాలను మూత్ర విసర్జన ద్వారా బయటకు పంపుతుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.
3. శ్వాసకోశ ఆరోగ్యం:
దగ్గు, జలుబు ఉపశమనం: వాముకు సహజసిద్ధమైన డీకంజస్టెంట్ గుణాలు ఉన్నాయి. ఇది గొంతు, ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫం ను తొలగించి, జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ, ఛాతీ రద్దీ నుంచి ఉపశమనం ఇస్తుంది. ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి వాము నీరు చాలా మంచిది.
4. స్త్రీల ఆరోగ్యం:
రుతుక్రమ సమస్యలకు: నెలసరి సమయంలో.. వచ్చే కడుపు నొప్పి, తిమ్మిరిని తగ్గించడంలో వాము నీరు సహాయ పడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.
పీరియడ్స్ క్రమబద్ధీకరణ: కొందరు స్త్రీలకు రుతు చక్రం సరిగా లేక ఇబ్బంది పడుతుంటారు. వాము నీటిని తీసుకోవడం వల్ల పీరియడ్స్ సైకిల్ సరై, సమయానికి పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
Also Read: మడమల పగుళ్లకు అసలు కారణాలు తెలిస్తే.. షాక్ అవుతారు
5. ఇతర ప్రయోజనాలు:
రక్తపోటు నియంత్రణ: వాము రక్త నాళాలను వెడల్పు చేసి, రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. దీని వల్ల అధిక రక్తపోటు స్థాయిలు అదుపులోకి రావడానికి దోహద పడుతుంది.
రోగనిరోధక శక్తి: వాము గింజల్లో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, అంటు వ్యాధులు దరి చేరకుండా కాపాడుతుంది.
కీళ్ల నొప్పులు: వాములో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో తోడ్పడతాయి.
వాము నీటిని ఎలా తయారు చేయాలి?
వాము నీటిని రెండు విధాలుగా తయారు చేయవచ్చు.
మరిగించి: ఒక గ్లాసు నీటిలో 1-2 టీస్పూన్ల వాము గింజలు వేసి, నీరు సగం అయ్యేవరకు మరిగించాలి. తర్వాత వడపోసి, గోరువెచ్చగా తాగాలి.
నానబెట్టి: ఒక టీస్పూన్ వాము గింజలను రాత్రంతా ఒక గ్లాసు నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని వడపోసి ఖాళీ కడుపుతో తాగాలి.