Bellamkonda Suresh: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాతలలో బెల్లంకొండ సురేష్ ఒకరు. ప్రస్తుతం సినిమాలు చేయటం తగ్గించారు కానీ ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు చేసే వాళ్ళు. అయితే బెల్లంకొండ సురేష్ ఇద్దరు కుమారులు కూడా ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు. రీసెంట్ గా కిస్కింద పూరి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇక తన రెండవ కుమారుడు గణేష్ కూడా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు. గణేష్ నటించిన స్వాతిముత్యం సినిమా కొంతమేరకు మంచి టాక్స్ సాధించుకుంది.
సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ పై ఫిల్మ్ నగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. తన ఇల్లు కబ్జా చేసాడంటూ శివ (అలంకార్ )ప్రసాద్ అనే వ్యక్తి ఫిర్యాదు. ఫిల్మ్ నగర్ రోడ్ నెంబర్ 7 లో ఉన్న తన తాలం వేసిన ఇల్లు సురేష్ కబ్జా చేశాడని బాధితుడి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
కొద్ది కాలంగా ఇంటికి తాళం వేసి ఉంచామని, మొన్న సురేష్ ఆయన మనుషులు వచ్చి తాళం పగలకొట్టి నిర్మాణాన్ని ధ్వంసం చేసారని ఫిర్యాదు లో పేర్కొన్నారు ప్రసాద్. ఆడిగేందుకు వెళ్లిన తన సిబ్బందిపై దుర్భాశలాడి పంపించాడని ఫిర్యాదు చేశారు.
శివ ప్రసాద్ ఫిర్యాదు తో బెల్లంకొండ సురేష్ తో పాటు రమన అనే మరో వ్యక్తి పై బి.ఎన్. ఎస్ 329(4),324(5),351(2) ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
అయితే ఈ విషయం గురించి ఇంకా పెద్దగా బయటికి రాలేదు. దీని గురించి బెల్లంకొండ సురేష్ బయటకు వచ్చి ఎలా స్పందిస్తారో చూడాలి. ఒక వ్యక్తి వర్షం మాత్రమే ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది రెండో వ్యక్తి మాట్లాడినప్పుడే ఆ సమస్య పైన అసలైన క్లారిటీ వస్తుంది ఇక ఈ విషయంలో ఏం జరిగింది అనేది త్వరలో తెలుస్తుంది.
Also Read: Ram Charan: నా కల నిజం అయిపోయింది, కన్సర్ట్ లో రామ్ చరణ్ అదిరిపోయే ఎంట్రీ