White Spots On Nails: ఏవైనా వ్యాధులు మన శరీరాన్ని ఎటాక్ చేసినప్పుడు.. వాటి తాలూకు లక్షణాలు ముందుగా బయటపడతాయి. దీంతో ఆయా వ్యాధుల లక్షణాలను ముందుగా గుర్తిస్తే, వ్యాధి తీవ్రత పెరగకుండా, ప్రాణాంతకం కాకుండా చికిత్స తీసుకోవచ్చు. ఇకపోతో మన శరీరంలో పలురకాల పోషకాల లోపం ఉన్నా కూడా శరీరం లక్షణాలను తెలియజేస్తుంది. ఈ క్రమంలో కొందరికి చేతివేళ్ల గోర్లపై తెల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇలాంటి లక్షణాలు పోషకాల లోపంతోపాటు పలు వ్యాధులు ఉండటం కూడా కారణాలు కావొచ్చు అంటున్నారు వైద్యులు. మరి చేతివేళ్ల గోర్లపై తెల్లటి మచ్చలు ఎందుకొస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా..
చాలామందిలో అప్పుడప్పుడూ చేతివేళ్ల గోర్లపై తెల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. కొందిరికి ఇవి మచ్చల్లా ఏర్పడితే.. ఇంకొందరికి తెల్లని గీతల్లా ఏర్పడుతాయి. అయితే, ఇలాంటి తెల్లటి మచ్చలు కనిపిస్తే మాత్రం అసలు నిర్లక్ష్యం చేయకూడదు. చేతివేళ్ల గోర్లపై ఇలా తెల్లటి మచ్చలు లేదా గీతలు ఏర్పడటాన్ని ‘లుకోనైకియా’ అంటారు. ఇది వాస్తవానికి అత్యంత సహజసిద్ధమైందిగా చెబుతారు. దీని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు.
Also Read: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా?.. సులభమైన చిట్కాలతో నివారించండిలా!
చేతివేళ్ల గోర్లపై తెల్లటి మచ్చలు ఏర్పడేందుకు అనేక కారణాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. కొందరు మహిళలు నెయిల్ పెయింట్‌లను అధికంగా వాడుతుంటారు. లేదా బ్యూటీ పార్లర్లలో గోర్లకు చికిత్స తీసుకుంటారు. కాబట్టి స్త్రీల గోర్లపై ఇలా తెల్లని మచ్చలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం వారు పాటించే బ్యూటీ టిప్స్‌లో ఉపయోగించే రసాయనాలు పడకపోవడమే.
చేతివేళ్లకు దెబ్బలు తగిలినా, ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు ఏర్పడినా అలా గోర్లపై తెల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. కాబట్టి.. ఏవైనా దెబ్బలు తగిలినా లేదా ఇన్‌ఫెక్షన్లు సోకినా దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. దీంతో గోర్లపై ఉండే తెల్లని మచ్చలు సైతం వాటంతట అవే తొలగిపోతాయి. ఇక కొందరు అమ్మాయిలకి నెయిల్ పాలిష్‌లు పడవు. అలాంటి వారికి అలర్జీలు వస్తాయి. కాబట్టి.. వారి గోర్లపై కూడా అప్పుడప్పుడు ఇలా తెల్లని మచ్చలు వస్తాయి. దీంతోపాటు గుండె జబ్బులు ఉన్నవారికి, నోటి దుర్వాసన వస్తున్నవారికి, కిడ్నీ సమస్యలున్న వారికి, సోరియాసిస్, ఎగ్జిమా, న్యుమోనియా వంటి వ్యాధులు ఉన్నవారికి కూడా చేతివేళ్ల గోర్లపై తెల్లటి మచ్చలు వస్తుంటాయి.
మన శరీరానికి కావాల్సిన జింక్ అందనప్పుడు కూడా ఇలాంటి తెల్లటి మచ్చలు వస్తాయి. జింక్ మన శరీరానికి కావల్సిన మినరల్స్‌లో ఒకటి. మన శరీరంలో జింక్ లోపం ఉన్నా లేదా జింక్‌ను తగినంత తీసుకోకపోయినా.. ఇలా కొందరికి అప్పుడప్పుడు చేతివేళ్ల గోర్లపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. అందుకే పైన చెప్పిన వ్యాధుల కారణాలు కాకపోతే.. అలాంటి వారు కచ్చితంగా జింక్ లోపం ఉందని గ్రహించాలి. వెంటనే జింక్ ఉండే ఆహారాలను తినాలి.
గోర్లపై తెల్లటి మచ్చలు ఉన్నాయంటే.. మన శరీరానికి జింక్ అవసరం అని అర్థం. కాబట్టి.. జింక్ ఎక్కువగా ఉండే చేపలు, రొయ్యలు, మటన్, కోడిగుడ్లు, గుమ్మడి విత్తనాలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, అవిసె గింజలు, చియా సీడ్స్, బాదంపప్పు, వాల్‌నట్స్ వంటి వాటిని మీ రోజూవారి ఆహారంలో భాగం చేసుకోవాలి. అప్పుడు గోర్లపై ఉండే తెల్లటి మచ్చలు సైతం తొలగిపోతాయి.
Also Read: నల్లటి మచ్చలున్న ఉల్లిపాయల్ని వాడేస్తున్నారా?.. అత్యంత ప్రమాదకరమంటున్న వైద్యులు!