E-Paper
Advertisement

CM Revanth Reddy: మేడారం జాతరపై సీఎం సమీక్ష.. నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులకు ఆదేశం

CM Revanth Reddy: మేడారం జాతరపై సీఎం సమీక్ష.. నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులకు ఆదేశం
Advertisement

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు చేపట్టిన అభివృద్ధి, నిర్మాణ పనులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, ఉన్నతాధికారులు పాల్గోన్నారు.

ఈ సమావేశంలో రోడ్లు, విద్యుద్దీకరణ, తాగునీరు, భక్తుల సౌకర్యాలు, గద్దెల చుట్టూ అభివృద్ధి పనులపై అధికారులు సీఎంకు వివరణాత్మక పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అనేక కీలక సూచనలు చేశారు.

Advertisement

ముఖ్యంగా సమ్మక్క, సారలమ్మ, గోవింద రాజుల గద్దెల వద్ద ఉన్న చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించవద్దని సీఎం స్పష్టంగా ఆదేశించారు. “ఈ చెట్లు గిరిజనుల ఆరాధ్య దైవాలతో ముడిపడి ఉన్నవి, ఇవి జాతర సాంప్రదాయ గౌరవానికి ప్రతీకలు. వాటిని కత్తిరించడం లేదా తొలగించడం అంటే గిరిజన సంస్కృతిని అవమానించినట్లే” అని ఆయన హెచ్చరించారు. అందుకోసం నిర్మాణ పనులను చెట్లకు హాని కలగకుండా జాగ్రత్తగా చేపట్టాలని, అవసరమైతే డిజైన్‌లను సవరించాలని సూచించారు.

నిర్మాణ పనుల నాణ్యతపై సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ఖరాఖండిగా వ్యవహరించారు. “ఒక్క రూపాయి అయినా దుర్వినియోగం జరగకూడదు, నాణ్యతలో రాజీ పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదు” అని హెచ్చరించారు. గతంలో కొన్ని ప్రాజెక్టుల్లో నాణ్యత లోపాలు, ఆలస్యాలు జరిగిన నేపథ్యంలో ఈసారి ఎటువంటి విమర్శలకు తావు లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ప్రతి దశలోనూ మూడు స్థాయిల్లో నాణ్యత తనిఖీలు జరపాలని, థర్డ్ పార్టీ ఆడిట్ తప్పనిసరి చేయాలని సూచించారు.

Advertisement

గద్దెల సమీపంలో వర్షపు నీరు నిలిచి ఉండే సమస్యను పూర్తిగా నివారించాలని సీఎం ఆదేశించారు. “భక్తులు గద్దెల వద్ద నిలబడి పూజలు చేసేటప్పుడు కాలి దాకా బురద నీరు ఉంటే ఎలా? ఇది జాతర గౌరవానికి భంగం కలిగిస్తుంది” అని అన్నారు. అందుకోసం శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, ప్లాట్‌ఫారమ్‌లు ఎత్తుగా ఉండేలా డిజైన్ చేయాలని, వర్షపు నీరు త్వరగా పారుదల అయ్యేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

గద్దెలకు గ్రాండ్ లుక్ రావాలన్న సీఎం ఆలోచన ప్రకారం, మూడు గద్దెల చుట్టూరా అందమైన ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాత్రిపూట గద్దెలు దివ్యకాంతులతో మెరిసేలా, దూరంగా ఉన్న భక్తులకు కూడా దర్శనం అందేలా లైటింగ్ డిజైన్ చేయాలని సూచించారు. ఇందుకోసం ఆధునిక ఎల్‌ఈడీ లైట్లు, రంగురంగుల ఇల్యూమినేషన్ వినియోగించాలని, ఇది జాతరకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Also Read: కర్చీఫ్ వేసిన సీట్లో కూర్చుంటావా వెధవ.. వ్యక్తి జుట్టు పట్టుకుని మహిళలు దాడి.. 

మొత్తంమీద ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మేడారం జాతరను ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఆధ్యాత్మిక ఉత్సవంగా మరింత ఘనంగా నిర్వహించాలన్న దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణ, సాంప్రదాయ గౌరవం, భక్తుల సౌలభ్యం, నాణ్యత ప్రమాణాలు – ఈ నాలుగూ దృష్టిలో పెట్టుకుని పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు స్పష్టంగా తెలియజేశారు.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×