E-Paper
Advertisement

షుగర్, కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్లు నేరేడు పండ్లు తినొచ్చా? మెడికల్ రీసెర్చ్ ఏం చెబుతోందంటే?

షుగర్, కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్లు నేరేడు పండ్లు తినొచ్చా? మెడికల్ రీసెర్చ్ ఏం చెబుతోందంటే?
Advertisement

Jamun fruit: నల్లగా, మెరుస్తూ కనిపించే నేరేడు పండ్లలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు, జీర్ణక్రియను మెరుగు పరిచే ఫైబర్ కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి ఇదొక సంజీవని లాంటిదని పెద్దవాళ్లు చెబుతుంటారు. అయితే.. నాణేనికి రెండు ముఖాలు ఉన్నట్టే.. నేరేడు పండ్ల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. తాజా మెడికల్ రీసెర్చ్ ప్రకారం.. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పండ్లను అస్సలు తినకూడదు, ఒకవేళ తిన్నా మోతాదు మించకూడదు. ఎవరు, ఎందుకు నేరేడు పండ్లకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నేరేడు పండ్లను అస్సలు తినకూడని వ్యక్తులు:

Advertisement

1. షుగర్ టాబ్లెట్లు వాడుతున్న వారు:
నేరేడు పండ్లలో ఉండే జంబోలిన్, జంబోసిన్ అనే కాంపౌండ్స్ బాడీలో స్టార్చ్‌ను షుగర్‌గా మారకుండా స్లో చేస్తాయి. ఇది షుగర్ లెవెల్స్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. మీరు ఆల్రెడీ డయాబెటిస్ కోసం మెడిసిన్ వాడుతుంటే.. వాటితో పాటు ఈ పండ్లను కూడా తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతాయి. దీనిని మెడికల్ భాషలో ‘హైపోగ్లైసీమియా’ అంటారు. దీని వల్ల కళ్ళు తిరగడం, విపరీతంగా చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం మరియు స్పృహ తప్పడం లాంటివి జరగొచ్చు.

2. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు :
నేరేడు పండ్లలో ‘ఆక్సలేట్లు’సహజంగానే ఎక్కువగా ఉంటాయి. ఈ ఆక్సలేట్లు మన శరీరంలోని కాల్షియంతో కలిసి కిడ్నీలలో రాళ్లుగా మారతాయి.ఎవరికైతే ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ సమస్య ఉందో లేదా త్వరగా స్టోన్స్ ఫామ్ అయ్యే తత్వం ఉందో.. వారు నేరేడు పండ్లను ఎక్కువగా తింటే రిస్క్ డబుల్ అవుతుంది. యూరిన్‌లో రక్తం రావడం, నడుము నొప్పి లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు.

Advertisement

3. జీర్ణ సమస్యలు ఉన్నవారు :
నేరేడు పండ్లలో డైటరీ ఫైబర్ (పీచుపదార్థం) చాలా ఎక్కువ. ఇది మలబద్ధకానికి మంచిదే అయినప్పటికీ.. అతిగా తింటే రివర్స్ అవుతుంది.ఒకేసారి కుప్పలు కుప్పలుగా నేరేడు పండ్లను తినేస్తే కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపునొప్పి లేదా విరేచనాలు అయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఐబీఎస్ (IBS – ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్) ఉన్నవారు వీటికి దూరంగా ఉండటం సేఫ్.

4. గర్భిణీలు:
గర్భధారణ సమయంలో మహిళలు ఏది తిన్నా చాలా ఆలోచించి తినాలి. నేరేడు పండ్లలో విటమిన్లు ఉన్నప్పటికీ, ప్రెగ్నెన్సీ టైమ్‌లో దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేదానిపై పెద్దగా శాస్త్రీయ పరిశోధనలు లేవు. ఇది సడన్‌గా బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను మార్చేయగలదు కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ గైనకాలజిస్ట్‌ను సంప్రదించిన తర్వాతే దీనిని డైట్‌లో చేర్చుకోవాలి.

Also Read: ఉప్పు ఎక్కువ తింటున్నారా? అయితే త్వరగా ముసలివాళ్లు అయిపోవడం ఖాయం

5. అలర్జీలు ఉన్నవారు:
చాలా అరుదుగా అయినప్పటికీ, కొంతమందికి కొన్ని రకాల పండ్లు తింటే బాడీ రియాక్ట్ అవుతుంది. మీకు ఫుడ్ అలర్జీల హిస్టరీ ఉంటే.. నేరేడు పండ్లు తిన్నప్పుడు చర్మంపై దద్దుర్లు, దురద, గొంతు పట్టేయడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిలాంటి అలర్జీ సింప్టమ్స్ కనిపించవచ్చు.

నేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు, కానీ అది కేవలం హెల్తీగా ఉన్నవారికి మాత్రమే. పైన చెప్పుకున్న హెల్త్ కండిషన్స్ ఉన్నవారు మాత్రం రుచి కోసం ఆశపడి ఎక్కువ తినేయకుండా.. మీ డాక్టర్‌ను కన్సల్ట్ అయి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

Related News

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

Big Stories

Advertisement
×