E-Paper
Advertisement

ఏసీ కొనడానికి ఇదే రైట్ టైమ్.. చలికాలంలో కొంటే ఎన్ని లాభాలో తెలుసా?

ఏసీ కొనడానికి ఇదే రైట్ టైమ్.. చలికాలంలో కొంటే ఎన్ని లాభాలో తెలుసా?
Advertisement

AC Buying Guide: ఎండలు మండిపోయే మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే ఎక్కువమంది ఏసీలు (AC) కొనడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే ఆ సమయంలో అందరూ ఒకేసారి షోరూమ్‌లకు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లకు క్యూ కట్టడం వల్ల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల ఇన్స్టాలేషన్ సర్వీస్ దొరకడం ఆలస్యం కావడం, టెక్నీషియన్లు బిజీగా ఉండటం, డిమాండ్ కు అనుగుణంగా ధరలు అమాంతం పెరగడం వంటి జరుగుతుంటాయి. కానీ తెలివైన వ్యక్తులు మాత్రం ఇందుకు భిన్నంగా చలికాలంలోనే ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. అసలు వింటర్ సీజన్ ఏసీల కొనుగోలుకు ఎలా సరైన సమయంగా మారుతోందో ఈ కథనంలో చూద్దాం.

డిమాండ్ తక్కువ..

వేసవి కాలంలో ఏసీ కొనుగోలు చేసినప్పుడు సర్వీస్ పొందడమే పెద్ద సవాలుగా మారుతుంది. కానీ శీతాకాలంలో డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల ఇన్స్టాలేషన్ టెక్నీషియన్లు సులువుగా అందుబాటులో ఉంటారు. ఎలాంటి హడావిడీ లేకపోవడం వల్ల ఏసీ ఇన్స్టాలేషన్‌ను చాలా జాగ్రత్తగా, సమర్థవంతంగా ఫినిష్ చేస్తారు. అంతేకాకుండా ఏసీ షాపుల్లో పెద్దగా క్రౌడ్ లేకపోవడం వల్ల రకరకాల మోడళ్లను తీరిగ్గా పరిశీలించి, అవసరాలకు తగ్గట్టుగా ఉన్న బెస్ట్ మోడల్ ను వింటర్ లో కొనుగోలు చేసేందుకు వీలు కలుగుతుంది.

పండుగ ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు

Advertisement

అక్టోబర్, నవంబర్ నెలలు పండుగల సీజన్ కావడంతో ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, రిటైల్ స్టోర్లు ఏసీలపై విపరీతమైన ఆఫర్లను ప్రకటిస్తాయి. స్టాక్ క్లియరెన్స్ తో పాటు ఫెస్టివ్ సేల్స్ కారణంగా ఎంఆర్‌పీ ధరలపై భారీగా తగ్గింపు లభిస్తుంది. వేసవిలో డిమాండ్ కారణంగా లభించని డిస్కౌంట్లు, బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌లు, నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాలు ఈ సమయంలో సులువుగా లభిస్తాయి. దీనివల్ల వేసవిలో ఎక్కువ ధరకు కొనే మోడళ్లను శీతాకాలంలో చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Also Read: జియో vs ఎయిర్‌టెల్.. రూ.500 లోపు ప్లాన్లలో ఏది బెటర్? పూర్తి వివరాలు!

బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు

Advertisement

సీజన్ లేని సమయంలో ఏసీలు కొనడం వల్ల తక్కువ బడ్జెట్‌లోనే అధునాతన ఫీచర్లు ఉన్న ఏసీలు అందుబాటులోకి వస్తాయి. ఉదాహరణకు సాధారణంగా ధర ఎక్కువ ఉండే 5-స్టార్ రేటింగ్ ఏసీలు, వైఫై (Wi-Fi) స్మార్ట్ కనెక్టివిటీ, ఏఐ ఎనర్జీ మోడ్స్, విండ్-ఫ్రీ (WindFree) కూలింగ్ టెక్నాలజీ కలిగిన ఏసీలు వింటర్ డిస్కౌంట్లలో మీ బడ్జెట్‌లోకి వచ్చేస్తాయి. ఇవి వేసవిలో విద్యుత్ బిల్లులను తగ్గించడమే కాకుండా మెయింటెనెన్స్ కూడా ఎంతో సులభతరం చేస్తాయి.

Also Read: నిమ్మకాయను మైక్రోవేవ్‌లో ఉంచితే ఏమవుతుందో తెలుసా? మైండ్ బ్లోయింగ్ ట్రిక్!

Tags

Related News

నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో కొత్త ఇయర్ బడ్స్..ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు

47% డిస్కౌంట్‌తో స్మార్ట్ టీవీ..ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!

ఇంటి పైకప్పుపై నీళ్ల బాటిల్.. 30కి పైగా దేశాలు ఫాలో అవుతున్న పవర్ సేవింగ్ ట్రిక్ ఇదే!

రూ.1,299ధరలో బెస్ట్ ఫీచర్స్..తక్కువ ధరలో ప్రీమియం లుక్

జియో vs ఎయిర్‌టెల్.. రూ.500 లోపు ప్లాన్లలో ఏది బెటర్? పూర్తి వివరాలు!

iPhone Duoపై 25% డిస్కౌంట్ అంటూ వల.. సైబర్ నేరగాళ్ల కొత్త ట్రిక్ ఇదే!

నిమ్మకాయను మైక్రోవేవ్‌లో ఉంచితే ఏమవుతుందో తెలుసా? మైండ్ బ్లోయింగ్ ట్రిక్!

Big Stories

Advertisement
×