E-Paper
Advertisement

Crying: మూవీలో ఆ సీన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారా? అయితే, మీరు ఆ టైపే!

Crying: మూవీలో ఆ సీన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారా? అయితే, మీరు ఆ టైపే!
Advertisement

Crying: సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోవడం అంటే బలహీనత అనుకుంటారు చాలామంది. కానీ.. అది నిజం కాదు. మీలో ఉన్న అసాధారణమైన బలానికి, సున్నితత్వానికి అది ఒక నిదర్శనం. సినిమా చూసి ఏడ్చేవారు ఇతరులకన్నా ఎక్కువ శక్తిమంతులు, దయగలవారు, అంతే కాకుండా తెలివైనవారు అని పరిశోధనలు కూడా చెప్తున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. సినిమాలో లీనం అవడం:

చాలా మంది కేవలం హీరో హీరోయిన్ల నటనను మాత్రమే చూస్తారు. కానీ.. కొంతమంది సినిమాలోని పాత్రలతో పూర్తిగా కలిసిపోతాడు. వారి నిజమైన బాధను, నిజమైన ఆనందాన్ని, నిజమైన ప్రేమను హృదయంతో అనుభూతి చెందుతారు. ఇది “ఎక్కువ సున్నితత్వం” కాదు. ఒక ప్రత్యేకమైన ప్రతిభ. మీరు కథలోని లోతును అర్థం చేసుకుంటున్నారు అనడానికి ఇదే రుజువు.

Advertisement

2. సున్నితమైన హృదయం:

జీవితం మనల్ని కఠినంగా మారుస్తుంది. కొన్ని బాధ కలిగించే ఘటనలు, ఒత్తిడి, చెడు అనుభవాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి చాలామంది తమ మనసు తలుపులను మూసేసుకుంటారు. కానీ.. కొందరు అలా చేయలేరు. సున్నితమైన హృదయం ఉన్న వారు సందర్భాన్ని అర్థం చేసుకుని స్పందిస్తారు.

3. భావోద్వేగం ఎక్కువ:

పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే.. సినిమా చూసి ఏడ్చేవారికి.. తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇతరుల మనోభావాలను.. వారి మాటల్లోని భావాన్ని, ముఖంలో కదలికలను ఇతరులకన్నా వేగంగా, చక్కగా అర్థం చేసుకోగలరు. ఇలాంటి వారు కేవలం కథను వినడం లేదు, పాత్రల మనసులోకి తొంగి చూస్తున్నారు అని అర్థం చేసుకోవాలి.

4. చాలా దయగల వారు:

పరిశోధనల ప్రకారం.. సినిమా చూసి ఏడ్చే వ్యక్తులు ఇతరులకు మరింత ఎక్కువగా సహాయం చేస్తారు. త్వరగా క్షమిస్తారు. అంతే కాకుండా ఇతరుల పట్ల ఎక్కువ ప్రేమగా ఉంటారు. మీ కన్నీళ్లు మీరు ఎంత గొప్ప హృదయం కలవారో చెప్పేందుకు నిదర్శనం. ఒక తెరపై ఉన్న పాత్ర కోసం మీరు ఏడుస్తున్నారు అంటే.. నిజ జీవితంలో ఒక స్నేహితుడి బాధను మీరు ఎంతగా అర్థం చేసుకోగలరో ఊహించండి.

5. ఏడుపుతో ఆరోగ్యం:

ఏడవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. కన్నీళ్లు మీ శరీరం నుంచి ఒత్తిడి కలిగించే రసాయనాలను తొలగిస్తాయి. ఏడ్చిన తరువాత మీకు చాలా తేలికగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. కన్నీళ్లను ఆపుకోకుండా బయటకు రానిచ్చేవారు లోపల కోపాన్ని, బాధను నింపుకోకుండా ఆరోగ్యంగా ఉంటారు.

6. అందరితో కనెక్ట్ అవడం:

సినిమా పాత్రల బాధను అనుభూతి చెందారు కాబట్టి.. నిజ జీవితంలో స్నేహితుల బాధను కూడా నిజంగా అనుభవించగలుగుతారు. అందుకే ఇలాంటి వారు మంచి శ్రోతలుగా ఉంటారు. మీరు ఇచ్చే చూపించే ప్రేమ ఇతరులకన్నా మరింత నిజాయితీగా, మరింత ఓదార్పునిచ్చేలా ఉంటుంది.

7. సహజంగానే నాయకత్వ లక్షణాలు:

ఎక్కువ భావోద్వేగం, తెలివితేటలు ఉన్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బాస్‌లు తమ పనిని చాలా బాగా చేస్తారు. కోపంగా ఉన్న వారిని ప్రశాంతంగా మార్చగలరు. అంతే కాకుండా సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. ఎవ్వరైనా ఇలాంటి వారి దగ్గర సురక్షితంగా ఉన్నారని భావించేలా చేయగలుగుతారు. మీరు ఈ రోజు కార్చే కన్నీళ్లు, రేపు మీరు ప్రదర్శించే గొప్ప నాయకత్వ నైపుణ్యంగా మారుతాయి.

Also Read: చలికాలంలోనూ అందమైన చర్మం కోసం.. సింపుల్ టిప్స్

8. మీరు ఇతరులకు స్ఫూర్తినిస్తారు:

సినిమా చూసి కన్నీరు పెట్టుకొని, “ఈ సినిమా నా హృదయాన్ని తాకింది” అని చెప్పినప్పుడు.. అది ఇతరులకు కూడా తమ భావోద్వేగాలను బయటపెట్టడానికి ధైర్యం ఇస్తుంది.

9. ఎలాంటి వారు ఏడుస్తారు:

సైనికులు, పెద్ద పెద్ద కంపెనీల CEOs, క్రీడాకారులు వీరంతా కూడా బాధాకరమైన సినిమాలు చూసి కన్నీళ్లు పెడతారు. ఏడవడం వారిని బలహీనపరచదు. అది వారిలోని మానవత్వాన్ని నిలబెడుతుంది.

కొంతమంది ప్రతి సినిమాకు ఏడుస్తారు, మరికొంతమంది చాలా బాధాకరమైన వాటికే ఏడుస్తారు. ఏమైనా సరే.. రెండూ అద్భుతమే, రెండూ అందమైన లక్షణాలే. అందుకే, ఇకపై మీరు సినిమా చూసి ఏడిస్తే సిగ్గుపడకండి. అది మీ సూపర్‌పవర్‌ అని నమ్మండి.

Related News

ముఖంపై నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? క్లియర్ స్కిన్ కోసం డాక్టర్ ఏం చెప్పారంటే

చూపు దెబ్బతినకముందే అప్రమత్తం కండి.. కళ్లు చెప్పే ఆ రహస్య సంకేతాలు ఇవే!

చాణక్య నీతి.. భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టే స్నేహితులు వీరే.. ఇలా గుర్తించండి

ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చొని మెడనొప్పిగా ఉందా? ఈ సింపుల్ వ్యాయామాలు చేస్తే సరి

రాత్రి చక్కగా నిద్రపోయినా ఉదయం లేవగానే నీరసంగా ఉంటుందా? అయితే మీ బాడీలో ఈ 5 లోపాలున్నట్టే!

ఇంజెక్షన్ వేయించుకోవాలంటే భయపడుతున్నారా? ఇలా చేస్తే నొప్పి అసలు తెలియదు

పనీర్ తయారు చేశాక మిగిలిన నీటిని పారేస్తున్నారా? ఇలా చేస్తే టేస్టీ సూప్ రెడీ

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

Big Stories

Advertisement
×