E-Paper
Advertisement

పాకిస్తాన్ ప‌రువు తీసిన శుభ్‌మన్ గిల్…అంద‌రూ క‌లిసి చేసిన ర‌న్స్ ఒక్క‌డే చేశాడుగా!

పాకిస్తాన్ ప‌రువు తీసిన శుభ్‌మన్ గిల్…అంద‌రూ క‌లిసి చేసిన ర‌న్స్ ఒక్క‌డే చేశాడుగా!
Advertisement

Shubman Gill Breaks Pakistan Record :  ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్ పరువు మరోసారి గంగలో కలిసింది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై రెండు టెస్టులు ఓడిపోయిన పాకిస్తాన్ జట్టును.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ( Shubman Gill) చావు దెబ్బ కొట్టాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడకుండా ఆ జట్టు పరువు తీశాడు. ఇంగ్లాండ్ గడ్డపై ఈ ఏడాది గిల్ చేసిన పరుగులు కూడా… పాకిస్తాన్ ఆటగాళ్లు అందరూ కలిసి చేయలేకపోయారు. మూడు టెస్టుల్లో పాకిస్తాన్ ప్లేయ‌ర్లు చేసిన ప‌రుగుల కంటే, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎక్కువే చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.

పాకిస్తాన్ ప‌రువు తీసిన శుభ్‌మన్ గిల్…అంద‌రూ క‌లిసి చేసిన ర‌న్స్ ఒక్క‌డే చేశాడుగా!

ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా (England vs. Team India) మధ్య గత ఏడాది ఐదు టెస్టుల సిరీస్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా కెప్టెన్ గిల్ ఏకంగా 754 పరుగులు సాధించాడు. ఒకే సిరీస్ లో అత్యంత ప్రభావంతమైన ప్రదర్శన చేసిన టాప్ ఆటగాళ్లలో కెప్టెన్ గిల్ నిలిచాడు. అయితే ఈ ఐదు టెస్టుల్లో గిల్ ఒక్కడే చేసిన పరుగులు కూడా పాకిస్తాన్ టెస్ట్ జట్టు చేయలేక పోయింది. ఇటీవల కాలంలోనే ఇంగ్లాండ్ పర్యటనకు పాకిస్తాన్ టెస్ట్ జట్టు వెళ్ళింది.

Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

ఈ టోర్నమెంట్ లో మొత్తం మూడు టెస్టులు ఆడాల్సి ఉండగా… ఇప్పటికే రెండింటిలో ఓడిపోయింది. మూడో టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్ కూడా ఫినిష్ చేసుకుంది. ఇలా మూడు టెస్టులు ఆడిన పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ జట్టు.. ఇప్పటి వరకు కేవలం 743 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఐదు ఇన్నింగ్స్ లు ఆడి గిల్ కంటే తక్కువ పరుగులే పాకిస్తాన్ ప్లేయర్ లందరూ కలిసి చేయగలిగారు. దీంతో మళ్లీ పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడకుండా.. ఆ జట్టును గిల్ దెబ్బ కొట్టాడని సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు.

ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్

Advertisement

ఇంగ్లాండ్ గడ్డపై ఇటీవల పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ జట్టు పర్యటించింది. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు టెస్టుల్లో ఓడిపోయిన పాకిస్తాన్… మూడో టెస్టులో కూడా ఓడిపోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది. ఇందులో కూడా పాకిస్తాన్ ఓడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే వైట్ వాష్ కావడం గ్యారెంటీ. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు ముందుగా చెప్పినట్లుగానే 3-0 తేడాతో పాకిస్తాన్ ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూడో టెస్ట్ ఎడ్జ్ బ‌స్ట‌న్ వేదిక‌గా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే తొలి ఇన్నింగ్స్ లో 133 పరుగుల‌కే పాకిస్తాన్ కుప్ప‌కూలింది.

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

Related News

పాకిస్తాన్ ను నాశ‌నం చేసింది మైక్ హెసనే..వాడు కూడా ఇండియ‌న్ ఏజెంటే !

పీక‌ల‌దాకా తాగుతూ నైట్ క్ల‌బ్ లో దొరికిన 9 మంది పాకిస్తాన్ క్రికెట‌ర్లు

125 స్పీడ్ తో బౌలింగ్ చేస్తే, నా ఆస్తులు రాసిస్తా… బ్రెట్ లీకి షోయ‌బ్ అక్త‌ర్ స‌వాల్

నా చేత‌కాని త‌నం వ‌ల్లే.. ఆ క్యాచ్ నేల పాలైంది – మాలిక్

పాకిస్తాన్ జ‌ట్టు నుంచి పిలుపు..అంత‌లోనే ఫోన్ స్విచ్ ఆఫ్, పాస్ పోర్టు లేదు..కానీ కట్ చేస్తే

శార్దుల్ ఠాకూర్ కు బౌలింగ్ వ‌ద్ద‌ని మొత్తుకున్నా ధోని విన‌లేదు – హ‌ర్భ‌జ‌న్

వైభ‌వ్ సూర్య‌వంశీ మాములోడు కాదు.. లిఫ్ట్ లోనే అమ్మాయితో రొమాన్స్ ?

Big Stories

Advertisement
×