E-Paper
Advertisement

నీళ్లు తాగకుండానే.. జీవితాంతం బతికేసే 6 వింత జంతువులు.. ఇదేం విచిత్రం సామీ!

నీళ్లు తాగకుండానే.. జీవితాంతం బతికేసే 6 వింత జంతువులు.. ఇదేం విచిత్రం సామీ!
Advertisement

Waterless Animals: సాధారణంగా నీటిని జీవకోటికి ప్రాణాధారంగా అభివర్ణిస్తుంటారు. నీరు లేకుండా జీవులు ఎక్కువ రోజులు మనుగడ సాగించలేవని చాలా మంది నమ్మకం. అయితే కొన్ని వింత జీవులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. అసలు నీటిని ముట్టుకోకుండానే జీవితాంతం జీవించేస్తాయి. ఇవి తాగునీటి కొలనుల వైపు వెళ్లకుండానే తాము తినే ఆహారం, శరీరంలో జరిగే జీవక్రియలు, వినూత్నమైన శారీరక నిర్మాణం ద్వారా తేమను పొందుతుంటాయి. ఎడారులు, పొడి వాతావరణంలో నీటి బొట్టు లేకుండానే హాయిగా బతికేసే 6 విచిత్రమైన జంతువుల గురించి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఫెన్నెక్ ఫాక్స్ (Fennec Fox)

సహారా ఎడారి ప్రాంతాల్లో కనిపించే ఈ బుల్లి నక్కలు.. నీటిని నేరుగా తాగవు. ఇవి తినే ఆకులు, క్రిమి కీటకాలు, చిన్న చిన్న జీవుల నుంచే శరీరానికి కావలసిన తేమను గ్రహిస్తాయి. దీనివల్ల నీటి వనరుల వద్దకు వెళ్లే అవసరం వీటికీ అసలు ఉండదు.

జెర్బోవా (Jerboa)

Advertisement

ఎడారి తీవ్రతను తట్టుకునే జెర్బోవాలు కూడా నీటి జోలికి వెళ్లవు. ఇవి తీసుకునే ఆహారంతో పాటు శరీరంలో జరిగే జీవక్రియల ద్వారానే నీటి అవసరాలను తీర్చుకుంటాయి. దీంతో ఇవి ఎప్పుడూ నీటిని ముట్టుకోవాల్సిన పరిస్థితి ఉండదు.

కంగారూ ఎలుక (Kangaroo Rat)

ఈ బుల్లి ఎడారి ఎలుక తన జీవితంలో ఒక్కసారి కూడా నీటిని తాగకుండానే బతికేయగలదు. గింజలు, విత్తనాలు తినడం ద్వారానే ఇది తేమను పొందుతుంది. పైగా శరీరం నుంచి నీరు వృథా కాకుండా ఉండటానికి అత్యంత గాఢత కలిగిన మూత్రాన్ని విసర్జిస్తుంది.

కోలా (Koala)

Advertisement

చెట్లపై కాలం గడిపే కోలాలు అడవుల్లో నీటిని తాగడం చాలా అరుదు. ఇవి ఎక్కువగా తినే యుకలిప్టస్ ఆకుల్లోనే అధిక మొత్తంలో నీరు ఉంటుంది. ఆ ఆకులను నమలడం ద్వారానే ఇవి తమ దాహాన్ని తీర్చుకుంటాయి.

బోడి ఎలుక (Naked Mole-Rat)

భూగర్భంలో నివసించే ఈ వింత ఎలుకలు నేల పైకి వచ్చి నీటిని తాగడం చాలా అరుదు. ఇవి నేల లోపల దొరికే దుంపలు, ఆహారం ద్వారానే శరీరానికి కావలసిన నీటిని గ్రహిస్తాయి.

Also Read: రైలులో చైన్ ఎప్పుడు లాగాలి? చట్టం ఏం చెబుతోంది? దుర్వినియోగం చేస్తే పరిస్థితేంటి!

ముళ్ల దెయ్యం (Thorny Devil)

ఈ విచిత్రమైన కొండచిలువ తరహా ఉండే ఈ బల్లి జీవి.. మిగతా జీవుల్లా నోటి ద్వారా నీటిని తీసుకోదు. దీని చర్మంపై ఉండే ప్రత్యేకమైన గీతల ద్వారా నీటి బిందువులను, తడి ఇసుకలోని తేమను శరీరం లోపలికి పీల్చుకుంటుంది. దీనివల్ల ఇది ఎక్కడా నీటి కోసం వెతకాల్సిన పని ఉండదు.

Also Read: ట్రైన్ కాదు.. నడిచే 5-స్టార్ హోటల్.. ఈ రష్యా రైలును చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Tags

Related News

రైలులో చైన్ ఎప్పుడు లాగాలి? చట్టం ఏం చెబుతోంది? దుర్వినియోగం చేస్తే పరిస్థితేంటి!

ట్రైన్ కాదు.. నడిచే 5-స్టార్ హోటల్.. ఈ రష్యా రైలును చూస్తే షాక్ అవ్వాల్సిందే!

టోకెన్ ఉన్నా లేకపోయినా రూ. 10 లక్షల ఇన్సూరెన్స్.. టీటీడీ సంచలన నిర్ణయం!

మళ్లీ పట్టాలెక్కనున్న భారత్-బంగ్లాదేశ్ రైళ్లు.. 2 ఏళ్ల తర్వాత ఇరు దేశాల కీలక నిర్ణయం!

నల్లగొండలో హైటెక్ బస్టాండ్.. ఏకంగా రూ. 54 కోట్లతో నిర్మాణం!

హోస్టెస్, వైఫై, టాయిలెట్.. ఈ ఆర్టీసీ బస్సును చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

బెంగళూరు–విజయవాడ ప్రయాణానికి కొత్త దారి.. ఏకంగా 110 కి.మీ తగ్గనున్న దూరం!

Big Stories

Advertisement
×