E-Paper
Advertisement

Sabarimala Special Trains: శబరిమలకు ప్రత్యేక రైళ్లు, ఎప్పటి నుంచి అంటే

Sabarimala Special Trains: శబరిమలకు ప్రత్యేక రైళ్లు, ఎప్పటి నుంచి అంటే
Advertisement

Indian Railway: ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరగడంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. డిసెంబర్ నుంచి జనవరి వరకు శబరిమల యాత్రికుల కోసం చర్లపల్లి- కొల్లం జంక్షన్ల మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అయ్యప్ప భక్తులు ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

అందుబాటులోకి 4 ప్రత్యేక రైళ్లు

ప్రస్తుతం ఉన్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నాలుగు ప్రత్యేక రైలు సర్వీసులను ప్రటిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు హైదరాబాద్ నుంచి శబరిమలకు వెళ్లి వచ్చే యాత్రికులకు ఎంతగానో ఉపయోగపడుతాయని చెప్పింది. చర్లపల్లి-కొల్లాం జంక్షన్ల మధ్య ఈ సర్వీసుల నడవనున్నట్లు వివరించింది.

ప్రత్యేక సర్వీసులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయంటే?

Advertisement

తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించిన, ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

⦿ డిసెంబర్ 17, 31 తేదీల్లో రైలు నంబర్ 07119 చర్లపల్లి నుంచి కొల్లాం వెళ్లనుంది. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 20న  (రైలు నంబర్ 07121) కొల్లాం నుంచి చర్లపల్లికి బయల్దేరనుంది.

Advertisement

⦿ డిసెంబర్ 15న రైలు నంబర్ 07118  కొల్లాం నుంచి చర్లపల్లికి వెళ్తుంది.

Read Also: సంక్రాంతి స్పెషల్ రైళ్లపై నో అనౌన్స్ మెంట్, ప్రయాణీకుల ఆగ్రహం!

⦿డిసెంబర్ 19, జనవరి 2న రైలు నంబర్ 07120 కొల్లాం నుంచి చర్లపల్లి బయల్దేరుతుంది.

⦿ డిసెంబర్ 22న రైలు నంబర్ 07122  చర్లపల్లి నుంచి కొల్లాంకు వెళ్తుంది. డిసెంబర్ 26న  రైలు నంబర్ 07124 కొల్లాం నుంచి చర్లపల్లికి బయల్దేరుతుంది.

పండుగ సీజన్ లో యాత్రికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రత్యేక సర్వీసులు ఉపయోగపడుతాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అయ్యప్ప భక్తులు, శబరిమల యాత్రికులు ఈ సర్వీసులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ రైళ్లకు ఎక్కువ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిదన్నారు.

Read Also:  ప్రయాణీకులకు గుడ్ న్యూస్, తిరుపతికి అదనపు రైళ్లు!

Related News

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

పాత IRCTC వెబ్ సైట్‌కు.. కొత్తదానికి తేడా ఏమిటీ? ఏం మారాయ్? ఏం చేరాయ్?

అర్ధరాత్రి కూడా భానుడి ప్రతాపమే.. భూమిపై సూర్యుడు అస్తమించని ఆ 5 వింత ప్రదేశాలేవో తెలుసా?

మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 డెస్టినేషన్స్ మిస్ అవొద్దు!

భూమిపై 5 ప్రమాదకర పర్యాటక ప్రాంతాలు.. ఇక్కడికి వెళ్లడం ప్రాణాలతో చెలగాటం.. అయినా వెళుతున్న టూరిస్ట్స్

Big Stories

Advertisement
×