E-Paper
Advertisement

Sweet After Meal: భోజనం తర్వాత స్వీటు తినాలనిపిస్తుందా? అయితే మీరు తినే తిండి మార్చాలి

Sweet After Meal: భోజనం తర్వాత స్వీటు తినాలనిపిస్తుందా? అయితే మీరు తినే తిండి మార్చాలి
Advertisement

చాలామందికి భోజనం చేసిన వెంటనే తీపి తినాలని అనిపిస్తుంది. పొట్ట నిండిపోయినా కూడా ఏదైనా స్వీట్ ఉంటే బాగుంటుంది అనే భావన కలుగుతుంది. ఇది కేవలం అలవాటు మాత్రమే అనుకుంటాం. కానీ ఈ కోరిక వెనుక ప్రత్యేకమైన కారణం కూడ ఉంది. ముఖ్యంగా శరీరంలో ఒక పోషక లోపం కూడా ఇందుకు కారణం కావచ్చని వారు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు (హెల్తీ ఫ్యాట్స్) సరిపడా లేకపోతే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ప్రోటీన్, ఫ్యాట్స్ మనకు ఎక్కువసేపు తృప్తి ఇచ్చే పోషకాలు. ఇవి జీర్ణక్రియను నెమ్మదిగా చేసి పొట్ట నిండిన భావనను ఎక్కువసేపు నిలుపుతాయి. అయితే భోజనంలో ఇవి తక్కువగా ఉంటే, మన శరీరం వెంటనే శక్తి కోసం చక్కెర వైపు మళ్లుతుంది. అందుకే భోజనం అయ్యాక కూడా తీపి తినాలని అనిపిస్తుంది.

చక్కెర స్థాయిలు పడిపోవడం వల్లే
బ్లడ్ షుగర్ స్థాయిల మార్పులు కూడా దీనికి కారణమే. మనం ఎక్కువగా అన్నం, బిర్యానీ, రొట్టెలు వంటి కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది. తర్వాత అది త్వరగా పడిపోతుంది. ఈ మార్పుల వల్ల శరీరం మళ్లీ చక్కెర కోసం సంకేతాలు ఇస్తుంది. అప్పుడు మనకు తీపి తినాలని కోరిక వస్తుంది. ఇది ఒక చక్రంలా మారి అలవాటుగా మారిపోతుంది. మన పొట్టలో ఉండే గుడ్ బ్యాక్టీరియా కూడా ఇందుకు కారణమే.గట్ హెల్త్ సరిగా లేకపోతే, శరీరం ఎక్కువగా చక్కెర కోరుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల ఈ గుడ్ బ్యాక్టీరియా అసమతుల్యం అవుతుంది. దాంతో తీపి తినాలనే కోరిక మరింత పెరుగుతుంది.

Advertisement

Also read: Okra Water: బెండకాయ నీరు పరగడపున తాగితే వచ్చే ప్రయోజనాలు మీరు ఊహించలేరు

ఇది కేవలం శరీరానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. మనసు కూడా దీనిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చిన్నప్పటి నుంచి భోజనం తర్వాత స్వీట్ తినడం అలవాటు అయితే, అది మెదడులో ఒక రివార్డ్ సిస్టమ్‌లా మారుతుంది. చక్కెర తింటే డోపమిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది మనకు సంతోషంగా అనిపిస్తుంది. అందుకే స్ట్రెస్ ఉన్నప్పుడు, అలసటగా ఉన్నప్పుడు లేదా బోర్‌గా ఉన్నప్పుడు తీపి తినాలని అనిపిస్తుంది. అప్పుడప్పుడు తీపి తినడం పెద్ద సమస్య కాదు. కానీ ప్రతి భోజనం తర్వాత ఇదే అలవాటు కొనసాగితే ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల బరువు పెరగడం, డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఈ అలవాటును నియంత్రించడం అవసరం.

Advertisement

ఇలా తింటే సమస్యే రాదు
భోజనంలో ప్రోటీన్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ ఉండేలా చూసుకోవాలి. పప్పులు, గుడ్లు, నట్స్ వంటి ఆహారాలను చేర్చాలి. అలాగే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ మాత్రమే తినకుండా సమతుల్య ఆహారం తీసుకోవాలి. రోజంతా తగినంత నీళ్లు తాగడం కూడా చాలా ముఖ్యం. కొన్నిసార్లు దాహం కూడా తీపి కోరికలా అనిపిస్తుంది. సరైన నిద్ర తీసుకోవడం, స్ట్రెస్ తగ్గించడం కూడా ఈ కోరికను తగ్గించడంలో సహాయపడుతుంది. జనం తర్వాత తీపి తినాలని అనిపించడం చిన్న విషయం అనిపించినా, అది మన శరీరం ఇచ్చే ఒక సంకేతం కావచ్చు. ఈ సంకేతాన్ని అర్థం చేసుకుని ఆహారపు అలవాట్లలో మార్పులు చేస్తే, ఈ కోరికను సులభంగా తగ్గించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×