E-Paper
Advertisement

Pressure Cookers: ప్రెజర్ కుక్కర్ పేలడానికి కారణాలేమిటీ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Pressure Cookers: ప్రెజర్ కుక్కర్ పేలడానికి కారణాలేమిటీ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Advertisement

Pressure Cookers: ఉదయం లేచింది మొదలు.. పిల్లలు త్వరగా స్కూలుకు వెళ్లాలన్నా, ఉద్యోగులు టైంకి ఆఫీసుకు బయల్దేరాలన్నా మన అమ్మలు గడియారంతో పోటీ పడాల్సిందే. ఆ సమయంలో వారికి సమయం వృధా కాకుండా ఆపద్బాంధవుడిలా సహాయపడేది ప్రెజర్ కుక్కర్లే. గంటల తరబడి సాగే వంట ప్రక్రియను నిమిషాల్లో ముగించే ఈ కుక్కర్ ఇప్పుడు ప్రతి వంటింట్లోనూ భాగమైపోయింది.

అయితే, అప్పుడప్పుడు మనం వార్తల్లో కుక్కర్ పేలిన ప్రమాదాల గురించి చూస్తుంటాం. ఆ సమయంలో మనుసులో ఎక్కడో భయం మొదలవుతుంది. నిజానికి, కుక్కర్లు చాలా సురక్షితమైనవే. కానీ వంట త్వరగా అవ్వాలనే కంగారులో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే వాటిని బాంబుల్లా పేలనిస్తున్నాయి. అసలు కుక్కర్లు ఎందుకు పేలుతాయి? అలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఆవిరే అసలు సమస్య:

Advertisement

ప్రెజర్ కుక్కర్ పని చేసే తీరు చాలా సింపుల్. లోపల తయారయ్యే ఆవిరి వల్ల కలిగే ప్రెజర్‌తోనే అన్నం త్వరగా ఉడుకుతుంది. ఈ ఆవిరి ఎప్పటికప్పుడు విజిల్ ద్వారా బయటకు వచ్చేయాలి. కానీ, విజిల్ రంధ్రంలో గానీ, ఆ వెంట్ పైపులో గానీ పప్పు మెతుకులు లేదా అన్నం లాంటివి ఇరుక్కుపోతే.. ఆవిరి బయటకు పోలేక లోపలే ఉండిపోతుంది. అలా ప్రెజర్ విపరీతంగా పెరిగిపోయినప్పుడు, ఆ భారాన్ని తట్టుకోలేక కుక్కర్ ఒక్కసారిగా పేలిపోతుంది. అందుకే వంట మొదలుపెట్టే ముందే విజిల్ రంధ్రం క్లియర్‌గా ఉందో లేదో ఓసారి చెక్ చేసుకోవాలి.

Also Read: బరువు తగ్గాలా? గుండె హెల్దీగా ఉండాలా? అయితే రోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేయండి చాలు!

ఓవర్ లోడ్ చేయొద్దు:

Advertisement

త్వరగా పని అయిపోవాలని చాలామంది కుక్కర్ నిండా బియ్యం/పప్పును కుక్కేస్తుంటారు. సాధారణంగా ఇవి ఉడికేటప్పుడు పైకి పొంగుతాయి. కుక్కర్‌లో గాలి ఆడటానికి తగినంత ఖాళీ లేకపోతే.. ఆ పొంగు కాస్తా విజిల్ రంధ్రాన్ని మూసేస్తుంది. అందుకే కుక్కర్‌ను ఎప్పుడూ సగానికి లేదా రెండు వంతుల వరకు మాత్రమే నింపాలి. అలాగే నీళ్లు కూడా లెక్క ప్రకారం పోయాలి. నీళ్లు తక్కువైతే అడుగు మాడిపోవడమే కాదు.. లోపల వేడి పెరిగి కుక్కర్ బాడీ కూడా బలహీనపడిపోతుంది.

 సేఫ్టీవాల్ మారుస్తుండాలి:

కుక్కర్ మూతకు ఉండే రబ్బరు పాతబడే కొద్దీ గట్టిపడిపోతుంది లేదా లూజ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఆవిరి పక్కల నుండి లీక్ అవుతుంటే.. మనం ఏదోలా అడ్జస్ట్ చేసి వంట కానిచ్చేస్తుంటాం. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. అలాగే మూతపై ఉండే సేఫ్టీ వాల్వ్ మనకు ఓ రక్షణ కవచం లాంటిది. విజిల్ పని చేయనప్పుడు ఈ వాల్వ్ కరిగి ఆవిరిని బయటకు పంపిస్తుంది. ఒకవేళ అది తుప్పు పట్టినా లేదా పాడైపోయినా, ప్రమాదం జరిగినప్పుడు అది పని చేయదు. అందుకే ఏడాదికోసారి రబ్బరును, వీలైతే సేఫ్టీ వాల్వ్‌ను మార్చుకోవడం సురక్షితం.

పాటించాల్సిన రూల్స్:

వంట అయిపోగానే ఆవిరిని బలవంతంగా తీసేయడం లేదా మూతను గట్టిగా లాగడం లాంటివి అస్సలు చేయొద్దు. ఆవిరి పూర్తిగా తగ్గి, విజిల్ దానంతట అదే కిందకు పడే వరకు ఆగాల్సిందే. ఒకవేళ తప్పదు అనుకుంటే.. కుక్కర్‌ను టాప్ వాటర్ కింద ఉంచి చల్లబరచవచ్చు. అంతేగానీ ఆవిరి ఉండగా మాత్రం మూతను అస్సలు కదిలించకూడదు. అలాగే పదేళ్లు దాటిన పాత కుక్కర్లను వాడటం కంటే, నాణ్యమైన ISI మార్క్ ఉన్న కొత్త కుక్కర్లను వాడటమే మనకు, మన కుటుంబానికి భద్రత.

Also Read: ఈ దుస్తులను పొరపాటున కూడా వాషింగ్ మెషీన్‌లో వేయకండి, ఎందుకంటే?

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×