Public Toilets: మనం షాపింగ్ మాల్స్‌కో, సినిమా థియేటర్లకో వెళ్లినప్పుడు అక్కడ ఉండే పబ్లిక్ టాయిలెట్లను గమనించే ఉంటాం. మన ఇంట్లో తలుపులు నేల వరకు ఉంటే, అక్కడ మాత్రం బాత్రూమ్ డోర్ కింద కాస్త ఖాళీ ఉంటుంది. ఇది చూసినప్పుడల్లా.. వీళ్లేంటి తలుపులు ఇలా సగం సగమే పెట్టారు? అసలు ప్రైవసీ ఉండదా? అని మనలో చాలా మందికి అనిపించి ఉండొచ్చు. కానీ, ఆ చిన్న గ్యాప్ వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
పబ్లిక్ టాయిలెట్లలో రోజుకు వందల మంది రాకపోకలు సాగిస్తుంటారు. కాబట్టి.. వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం చాలా ముఖ్యం. తలుపు కింద గ్యాప్ ఉండటం వల్ల పారిశుధ్య కార్మికులు ప్రతి గది తలుపు తీయకుండానే మాప్ లేదా వైపర్‌తో నేలను సులభంగా తుడవగలరు. అలాగే నీరు నిల్వ ఉండకుండా బయటకు పంపడానికి ఈ గ్యాప్ ఎంతగానో హెల్ప్ అవుతుంది. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ గదులను నీట్‌గా ఉంచడం సాధ్యమవుతుంది.
Also Read: ఫస్ట్ టైం ఓవెన్ వాడుతున్నారా? ఈ పొరపాట్లు చేస్తే పేలిపోతుంది జాగ్రత్త!
ఒకవేళ టాయిలెట్‌లో ఎవరైనా అనుకోకుండా స్పృహ కోల్పోయినా లేదా గుండెపోటు వంటి అనారోగ్య సమస్యలకు గురైనా, ఆ గ్యాప్ ద్వారా బయట ఉన్నవారు వారిని త్వరగా గుర్తించే అవకాశం ఉంటుంది. అలాగే లోపల లాక్ పడిపోయి ఎవరైనా చిక్కుకుపోతే, చిన్న పిల్లలు ఆ గ్యాప్ ద్వారా సులభంగా బయటకు రావచ్చు. ఇది ఒక రకంగా ప్రాణాపాయం నుంచి రక్షించే ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాంటిదన్నమాట.
సాధారణంగా పబ్లిక్ టాయిలెట్లు ఇరుకైన గదుల్లో ఉంటాయి. గాలి సరిగ్గా ఆడకపోతే అక్కడ ఉండటం కష్టమైపోతుంది. అందుకే ఈ బాత్రూమ్ డోర్స్ కింద ఖాళీ ఉంచుతారు. దీనివల్ల వెంటిలేషన్ బాగుంటుంది. ఫలితంగా లోపల ఉన్న తేమ త్వరగా ఆరిపోవడమే కాకుండా, చెడు వాసనలు కూడా త్వరగా బయటకు వెళ్లిపోతాయి. దీంతో బ్రీతింగ్ ఫ్రీగా ఉంటుంది.
బాత్రూం డోర్స్ కింద గ్యాప్ ఉండటం వల్ల బయటి నుంచి చూసే వారికి లోపల ఎవరైనా ఉన్నారో లేదో ఈజీగా తెలిసిపోతుంది. దీంతో అనవసరంగా ప్రతి తలుపును తట్టాల్సిన అవసరం ఉండదు. ఇలా చేయడం వలన లోపల ఉన్నవారి ప్రైవసీకి కూడా భంగం కలగదు.
Also Read: అరటి పండ్లను ఇలా వదిలేస్తున్నారా? బల్లి ఏం చేసిందో మీరే చూడండి!