E-Paper
Advertisement

Unique Holi Tradition: హోలీ వేళ విచిత్ర ఆచారం.. పొట్టుపొట్టు కొట్టుకున్న గ్రామస్థులు.. లేదంటే అరిష్టమట!

Unique Holi Tradition: హోలీ వేళ విచిత్ర ఆచారం.. పొట్టుపొట్టు కొట్టుకున్న గ్రామస్థులు.. లేదంటే అరిష్టమట!
Advertisement

Unique Holi Tradition: హోళీ పండగ అంటే ఎక్కడ చూసినా రంగులు చల్లుకుంటూ సరదగా గడపటం చూస్తుంటాం. కానీ, నిజామాబాద్ జిల్లాలోని ఆ ఊర్లో మాత్రం ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. 20 నిమిషాల పాటు ఒళ్లు హూనం అయ్యే విధంగా కొట్టుకున్నారు. అయితే ఇదంతా ఆనవాయితీ వస్తుండటం గమనార్హం. దశాబ్దాల కాలంగా హోలీ రోజున ఈ సంప్రదాయన్ని గ్రామస్థులు పాటిస్తూ వస్తున్నారు. పోలీసులు హెచ్చరించినా వెనక్కి తగ్గడం లేదు.

వివరాల్లోకి వెళ్తే..

నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హూస్సా గ్రామస్థులు హోళీ రోజున వింత ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.హోళీ రోజు గ్రామస్థులు ఒకరిపై ఒకరు విరుచుకుపడి పిడిగుద్దులు కురిపించుకోవటం ఇక్కడి ఆనవాయితీ. పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయ క్రీడను హోళీ రోజున నిర్వహించకుంటే గ్రామానికి అరిష్టం జరుగుతదని వీరి విశ్వాసం. అందుకే ఎవరెంత వారించినా వీరు పట్టించుకోరు. చివరికి ఈ ఆటపై పోలీసులు ఆంక్షలు విధించినా డోంట్ కేర్ అంటారు.

కొట్లాడకపోతే విషజ్వరాలు..!

Advertisement

గతంలో ఇలాగే ఒకసారి పోలీసుల ఆంక్షల వల్ల హోలీ రోజు పిడిగుద్దులు కురిపించుకోలేదట. దీంతో గ్రామంలో విషజ్వరాలు విజృంభించాయని అరిష్టాలు జరిగాయని గ్రామస్థులు చెబుతున్నారు. అప్పటి నుంచి పోలీసుల ఆంక్షల్ని పట్టించుకోకుండా హోలీ రోజున ఈ కొట్లాటను కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారి కూడా ఎప్పటిలాగానే పిడిగుద్దులు నిర్వహించారు గ్రామస్తులు.

Also Read: V C Sajjanar Orders: విధుల్లో నిర్లక్ష్యం.. ఎస్​ఐపై సజ్జనార్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ

కొట్టుకోవడం.. గర్వంగా ఉందట

Advertisement

మొదట గ్రామ పెద్దలు ఊర్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి డప్పు వాయిద్యాలతో గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. అనంతరం గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయారు. తాడును ఏర్పాటు చేసి రెండు వైపులా రెండు వర్గాల ప్రజలు నిల్చొని 15 నిమిషాల పాటు ఒకరిపై ఒకరి పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ క్రీడలో చాలా మందికి గాయాలు అయినా వాటిని పట్టించుకోలేదు. పైగా గ్రామం మేలు కోసం ఇలా ఏటా కొట్లాటలో పాల్గొనడం తమకు గర్వంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

Also Read: Real Estate Fraud: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ స్కామ్.. త్రిపుర కన్‌‌స్ట్రక్షన్స్ ఎండీ అరెస్టు

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×