E-Paper
Advertisement

Stroke Risk: స్ట్రోక్ లక్షణాలను ముందే గుర్తించడం ఎలా? ఈ చిట్కాలతో ప్రాణాలను కాపాడొచ్చు !

Stroke Risk: స్ట్రోక్ లక్షణాలను ముందే గుర్తించడం ఎలా? ఈ చిట్కాలతో ప్రాణాలను కాపాడొచ్చు !
Advertisement

Stroke Risk: చలికాలంలో కేవలం జలుబు, దగ్గు మాత్రమే కాదు.. ప్రాణాంతకమైన పక్షవాతం (స్ట్రోక్) ముప్పు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల మన శరీరంలోని రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తపోటు ఒక్కసారిగా పెరుగుతుంది. దీని వల్ల మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోవడం లేదా రక్తనాళాలు చిట్లిపోయే అవకాశం ఉంది. చలి కాలంలో పక్షవాతం కేసులు సుమారు 30 శాతం వరకు పెరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ కాలంలో స్ట్రోక్ ప్రమాదం ఎందుకు పెరుగుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

చలికాలంలో పక్షవాతం ముప్పు ఎందుకు పెరుగుతుంది ?

చల్లని వాతావరణం మన రక్త ప్రసరణ వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణాలు చాలానే ఉంటాయి.

Advertisement

1. రక్తనాళాల సంకోచం:

చలి పెరిగినప్పుడు శరీరం తన ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేస్తుంది. దీని వల్ల రక్త ప్రవాహానికి ఆటంకం కలిగి, రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటు అనేది స్ట్రోక్ రావడానికి ప్రాథమిక కారణం.

2. రక్తం చిక్కబడటం:

చలికాలంలో.. మన రక్తంలోని ప్లేట్‌లెట్లు, ఫైబ్రినోజెన్ స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల రక్తం సాధారణం కంటే కొంచెం చిక్కగా మారుతుంది. చిక్కటి రక్తం వల్ల గడ్డలు ఏర్పడే అవకాశం ఎక్కువ. ఇది మెదడులోని రక్త ప్రసరణను అడ్డుకుంటుంది.

3. శారీరక శ్రమ తగ్గడం:

చలి వల్ల చాలామంది బయట వ్యాయామం చేయడం తగ్గిస్తారు. తక్కువ శ్రమ, ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్, బరువు కూడా పెరిగుతుంది. ఇవి పరోక్షంగా పక్షవాతం ముప్పును పెంచుతాయి.

4. డీహైడ్రేషన్ (నీరు తక్కువగా తాగడం):

చలికాలంలో దాహం తక్కువగా ఉండటం వల్ల చాలా మంది నీరు తక్కువగా తాగుతారు. దీని వల్ల రక్తం మరింత చిక్కబడి, రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడతాయి.

Also Read: బరువు పెరగకూడదంటే.. రాత్రిపూట అన్నం మానేయాలా ?

స్ట్రోక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

వెచ్చగా ఉండండి: బయటకు వెళ్ళేటప్పుడు తల, చెవులు, చేతులను కప్పి ఉంచేలా వెచ్చని బట్టలు ధరించండి. ఇది మీ రక్తపోటు హఠాత్తుగా పెరగకుండా చూస్తుంది.

చన్నీటి స్నానం వద్దు: మరీ చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరం ఒక్కసారిగా ‘కోల్డ్ షాక్’కు గురై రక్తపోటు పెరుగుతుంది. గోరు వెచ్చని నీటిని వాడటం మంచిది.

క్రమం తప్పకుండా వ్యాయామం: బయటకు వెళ్లలేకపోతే ఇంట్లోనే యోగా, స్ట్రెచింగ్ లేదా ఇండోర్ వాకింగ్ వంటివి చేయండి.

ఆహార నియమాలు: ఉప్పు తక్కువగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, వేడి ద్రవ పదార్థాలు (సూప్స్ వంటివి) ఎక్కువగా తీసుకోవాలి.

లక్షణాలను గుర్తించండి (FAST): ముఖం ఒకవైపుకు వంగిపోవడం, చేతులు పైకి ఎత్తలేకపోవడం, మాట నత్తిగా రావడం వంటివి కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలి.

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×