E-Paper
Advertisement

అరగంటలో ఛార్జింగ్, 200 కి.మీ రేంజ్.. విన్‌ఫాస్ట్ నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ SUV!

అరగంటలో ఛార్జింగ్, 200 కి.మీ రేంజ్.. విన్‌ఫాస్ట్ నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ SUV!
Advertisement

Affordable Micro SUV VinFast VF 3: విన్‌ ఫాస్ట్ VF 3 పేరుతో సరికొత్త ఈవీని తీసుకొచ్చింది. పట్టణ ప్రయాణాలను మరింత సులభతరం చేసేలా దీనిని మైక్రో-SUVగా రూపొందించింది. ఇది రెండు డోర్లతో సబ్ కాంపాక్ట్ మోడల్ గా వస్తుంది.  భారత మార్కెట్‌ లో ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో బెస్ట్ ఆప్షన్ కాబోతోంది. ఈ కారు ధర సుమారు రూ. 7.5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. 2026 నవంబర్ లో ఈ కారును మార్కెట్ లోకి విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది.

 VF 3 డిజైన్ గురించి..

VF 3 వెహికల్ ముఖ్యంగా నగరాల్లో తక్కువ దూర ప్రయాణాలకు అనుకూలంగా డిజైన్ చేయబడింది. దీని పరిమాణం చిన్నగా ఉండటం వల్ల ట్రాఫిక్‌ లో ఈజీగా నడిపే అవకాశం ఉంటుంది. సుమారు 3 మీటర్ల పొడవుతో కాంపాక్ట్‌ గా ఉండి, పార్కింగ్ ఈజీగా అవుతుంది. 191 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల చిన్న గుంతలు, రోడ్డు మీద ఇబ్బందులను ఈజీగా దాటి ముందుకు వెళ్తుంది.

బ్యాటరీ, రేంజ్ గురించి..

Advertisement

ఈ కారు బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 18.64 kWh సామర్థ్యం కలిగిన లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది.  ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 210 నుంచి 215 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇది రోజువారీ ఆఫీస్, షాపింగ్ లాంటి  పనుల కోసం వెళ్లేవారికి  అనుకూలంగా ఉంటుంది. అలాగే వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల కేవలం 36 నిమిషాల్లో 10 శాతం నుంచి 70 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కారు పనితీరు పరంగా బాగుంటుంది. ఇందులో వెనుక భాగంలో ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. సుమారు 40 నుంచి 43.5 హార్స్‌ పవర్  శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 110 Nm టార్క్‌ తో  నగర రోడ్లపై స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. రియర్ వీల్ డ్రైవ్ వ్యవస్థ ఉండటం వల్ల డ్రైవింగ్ మరింత స్టేబుల్ గా  ఉంటుంది.

ఇంటీరియర్ గురించి..

ఇంటీరియర్ పరంగా చూస్తే, VF 3లో నలుగురు చక్కగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇందులో 10 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంటుంది. డ్రైవర్‌ కు అవసరమైన సమాచారం, వినోదాన్ని ఒకే చోట అందిస్తుంది.

Advertisement

Read Also: 3 నిమిషాల్లో ఆటో స్కూటర్‌ అవుతుంది, ఇదేం టెక్నాలజీ భయ్యా!

ఏ కార్లతో పోటీ పడుతుందంటే?

ఈ వెహికల్ మార్కెట్‌ లో MG కామెట్ EVకి పోటీగా వస్తోంది. VF 3 కొంచెం SUV లుక్‌ తో, బలమైన బాడీ క్లాడింగ్, 16 అంగుళాల చక్రాలతో  రగ్డ్ డిజైన్‌ను అందిస్తుంది.  అందుకే ఇది స్టైలిష్‌గా కనిపించడంతో పాటు ఉపయోగకరంగా ఉంటుంది.

Read Also: ఈవీ కార్లకూ యుద్ధం దెబ్బ.. ఆగిన ఉత్పత్తి, ఇప్పట్లో కొనలేమట.. ఎందుకంటే?

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×