E-Paper
Advertisement

World Water Day 2026: అలర్ట్ అవ్వకపోతే అల్లాడిపోవాల్సిందే ! ఇప్పుడే మేల్కొందాం..

World Water Day 2026: అలర్ట్ అవ్వకపోతే అల్లాడిపోవాల్సిందే ! ఇప్పుడే మేల్కొందాం..
Advertisement

World Water Day 2026: నీరు లేనిదే జీవం లేదు. భూమిపై ఉన్న వనరుల్లో అత్యంత విలువైంది నీరు. కానీ.. నేడు మనం గమనిస్తే అభివృద్ధి పేరుతో మనం చేస్తున్న పర్యావరణ విధ్వంసం వల్ల మంచినీటి వనరులు అడుగంటిపోతున్నాయి. 2026 ప్రపంచ నీటి దినోత్సవం మన బాధ్యతను గుర్తు చేస్తూ.. రాబోయే తరాలకు గుక్కెడు నీటిని అందించడం ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది. ప్రతి చుక్కను పొదుపు చేయడం ద్వారా మాత్రమే మనం గ్లోబల్ వాటర్ క్రైసిస్‌ను ఎదుర్కోగలం. ఈ సందర్భంగా నీటి పొదుపుపై అవగాహన పెంచుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక కర్తవ్యం.

ఈ ఏడాది థీమ్:
2026 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ప్రధాన థీమ్.. “నీరు, లింగ సమానత్వం” (Water and Gender: Where water flows, equality grows).

Advertisement

ఈ ఏడాది థీమ్ మహిళల పాత్ర,లింగ సమానత్వాన్ని నొక్కి చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నీటిని సేకరించడం కోసం మహిళలు, బాలికలు గంటల తరబడి సమయాన్ని వెచ్చిస్తున్నారు. దీని వల్ల వారి విద్య, ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. నీటి వనరుల నిర్వహణలో మహిళలకు సమాన భాగస్వామ్యం కల్పించడం ద్వారా సుస్థిర అభివృద్ధి సాధ్యమని ఈ థీమ్ వివరిస్తోంది.

నీటి సంక్షోభం-ప్రస్తుత పరిస్థితి:
ప్రస్తుతం ప్రపంచం “వాటర్ బ్యాంక్రప్సీ” (నీటి దివాలా) దిశగా పయనిస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Advertisement

అడుగంటుతున్న భూగర్భ జలాలు: విపరీతమైన వాడకం వల్ల భూగర్భ జలమట్టం వేగంగా పడిపోతోంది.

కాలుష్యం: పారిశ్రామిక వ్యర్థాలు, ప్లాస్టిక్ వల్ల ఉన్న మంచి నీటి వనరులు కూడా విషతుల్యమవుతున్నాయి.

శీతోష్ణస్థితి మార్పులు: అకాల వర్షాలు, తీవ్రమైన కరువుల వల్ల నీటి లభ్యత అస్థిరంగా మారుతోంది.

గణాంకాలు: దాదాపు 200 కోట్లకు పైగా ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే 2030 నాటికి నీటి కొరత ఇంకా తీవ్రతరమయ్యే అవకాశం ఉంది.

నీటిని పొదుపు చేసే మార్గాలు:
నీటి సంక్షోభాన్ని నివారించడం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. ప్రతి వ్యక్తి తన వంతు కృషి చేయాలి.

1. ఇంటి దగ్గర జాగ్రత్తలు:
బ్రెష్ చేసేటప్పుడుట ట్యాప్ వృథాగా వదలకుండా ఆపి ఉంచాలి.

స్నానం కోసం షవర్ కంటే బకెట్ వాడటం బెస్ట్. దీనివల్ల దాదాపు 50% నీటిని ఆదా చేయవచ్చు.

లీక్ అవుతున్న పైపులను, టాప్లను వెంటనే మరమ్మతు చేయించాలి.

2. నీటి పునర్వినియోగం:
కూరగాయలు కడిగిన నీటిని మొక్కలకు పోయవచ్చు.

RO ఫిల్టర్ల నుంచి బయటకు వచ్చే వ్యర్థ నీటిని ఇల్లు శుభ్రం చేయడానికి లేదా మొక్కలకు వాడవచ్చు.

3. వర్షపు నీటి నిల్వ:
ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. వర్షపు నీటిని భూమిలోకి పంపడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి.

Also Read: డైలీ మార్నింగ్ ఈ డ్రింక్స్ తాగితే.. వద్దన్నా బరువు తగ్గుతారు తెలుసా ?

4. వ్యవసాయం, పరిశ్రమలు:
వ్యవసాయంలో ‘బిందు సేద్యం’వంటి పద్ధతులు పాటించాలి.

పరిశ్రమలు నీటిని శుద్ధి చేసి తిరిగి వాడేలా చర్యలు తీసుకోవాలి.

“నీటిని ఆదా చేయండి – భవిష్యత్తును కాపాడండి” అనేది కేవలం నినాదం మాత్రమే కాదు.. అది ఒక జీవన విధానం కావాలి. నీటి పొదుపు మన ఇంటి నుంచే మొదలవ్వాలి. 2026 ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా.. నీటిని వృథా చేయమని, ప్రతి చుక్కను సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం

Related News

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

Big Stories

Advertisement
×