E-Paper
Advertisement

Okra Water: బెండకాయ నీరు పరగడపున తాగితే వచ్చే ప్రయోజనాలు మీరు ఊహించలేరు

Okra Water: బెండకాయ నీరు పరగడపున తాగితే వచ్చే ప్రయోజనాలు మీరు ఊహించలేరు
Advertisement

ఆరోగ్యంపై ఈ మధ్యకాలంలో ప్రజలకు శ్రద్ధ పెరుగుతోంది. ఎంతో మంది సెలెబ్రిటీలు కూడా బెండకాయ నీళ్లు ఆరోగ్యమని తాగడం ప్రారంభించారు. ఎన్నో ఇంటర్య్వూలలో కూడా వీరు ఆ విషయాన్ని చెప్పారు. ముఖ్యంగా ఈ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెండకాయలో ఫైబర్, విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయని భావిస్తున్నారు. అందుకే బెండకాయను నీటిలో నానబెట్టి, ఆ నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చాలామంది నమ్ముతున్నారు.

మధుమేహం ఉన్నవారికి మంచిది
బెండకాయ నీళ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని ఎంతో మంది నమ్మకం. ఇందులో ఉండే ఫైబర్ వల్ల గ్లూకోజ్ శరీరంలో నెమ్మదిగా శోషించబడుతుంది. దీనివల్ల డయాబెటిస్ ఉన్నవారికి కొంతవరకు ఉపయోగం ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక జీర్ణక్రియ విషయానికి వస్తే, బెండకాయలో ఉండే జిగురు లక్షణం వల్ల జీర్ణవ్యవస్థ సాఫీగా పనిచేయడంలో సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది కొంత ఉపశమనం కలిగించవచ్చని అంటున్నారు. అలాగే ఇది పొట్టను శుభ్రంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

Advertisement

Also read: Motichoor Laddu: మోతీచూర్ లడ్డూ నోరూరేలా ఇలా ఇంట్లో సులువుగా చేసేయండి, రెసిపీ ఇదిగో

గుండె ఆరోగ్యానికి
గుండె ఆరోగ్యానికి కూడా బెండకాయ నీళ్లు ఉపయోగకరంగా ఉంటాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇందులో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఎంపికగా భావిస్తున్నారు. తక్కువ కాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండటానికి సహాయపడుతుంది. దీనివల్ల ఆహారం తీసుకునే పరిమాణం తగ్గి, బరువు తగ్గే ప్రక్రియకు తోడ్పడవచ్చు. ఇమ్యూనిటీ పెంచడంలో కూడా బెండకాయ నీళ్లు ఉపయోగపడవచ్చు. విటమిన్ C మరియు యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని వైరస్లు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. అందుకే దీన్ని ప్రతిరోజూ తీసుకోవాలని కొందరు సూచిస్తున్నారు.

Advertisement

Also read: Vastu tips: నీటితో నిండిన మట్టి కుండను ఇంట్లో ఈ దిశలో ఉంచితే డబ్బే డబ్బు

అలాగని బెండకాయ నీళ్లు అన్ని రోగాలకు పరిష్కారం కావు. ఇవి ఆరోగ్యానికి సహాయపడే ఒక సహజ పానీయం మాత్రమే. దీనిపై పూర్తి స్థాయి శాస్త్రీయ ఆధారాలు ఇంకా లేవు. ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. డయాబెటిస్ లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ పానీయాన్ని తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే సమతుల్య ఆహారం, వ్యాయామం కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఖాళీ కడుపుతో బెండకాయ నీళ్లు తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉండవచ్చు.

Related News

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×