మోతీచూర్ లడ్డూలను నోట్లో పెడితే చాలు కరిగిపోతాయి. చిన్న చిన్న బూందీలతో తయారయ్యే ఈ లడ్డూలు నోట్లో వేసుకుంటే చాలు మృదువుగా ఉంటాయి. ఇది భారతీయ ప్రసిద్ధ స్వీట్. పండుగలు, శుభకార్యాలు, దేవుడి నైవేద్యాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని ఇంట్లోనే చాలా సులువుగా వండుకోవచ్చు. దీన్ని చాలా సులభంగా, తక్కువ పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. రెసిపీ తెలుసుకోండి.
మోతీచూర్ లడ్డూ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
శెనగపిండి – ఒక కప్పు
పంచదార – ఒక కప్పు
నీరు – అవసరమైనంత
బేకింగ్ సోడా – చిటికెడు
యాలకుల పొడి – అర టీ స్పూన్
ఫుడ్ కలర్ (ఆరెంజ్) – చిటికెడు
నూనె లేదా నెయ్యి – వేయించడానికి
బాదం, పిస్తా – గార్నిష్ కోసం
Also read: Vastu tips: ఉదయం నిద్రలేచిన వెంటనే చేయకూడని పనులు ఇవే
మోతీచూర్ లడ్డూ రెసిపీ
1. ముందుగా ఒక బౌల్‌లో శెనగపిండి తీసుకుని అందులో కొద్దిగా నీరు వేసి పలుచగా కాకుండా, అలాని మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఇందులో గడ్డలు లేకుండా చూసుకోవాలి. తర్వాత చిటికెడు బేకింగ్ సోడా, ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె కొంచెం వేడిగా మారిన తరువాత జల్లెడ సుకుని దానిపై ఈ మిశ్రమాన్ని పోసి నూనెలో చిన్న చిన్న బూందీలా పడేలా చేయాలి.
3. బూందీ చాలా చిన్నగా రావడం మోతిచూర్ లడ్డూకి ప్రత్యేకం. వీటిని తక్కువ మంటపై తేలికగా వేయించాలి. గోధుమ రంగు కాకుండా కాస్త మృదువుగా ఉండేలా తీసేయాలి. తర్వాత అదనపు నూనె వడకట్టి పక్కన పెట్టాలి.
4. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో చక్కెర, నీరు వేసి మరిగించాలి. ఇది కొద్దిగా చిక్కగా అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసి కలపాలి.
5. ఇప్పుడు వేయించిన బూందీని వేడి పాకంలో వేసి బాగా కలపాలి. బూందీ పాకాన్ని పూర్తిగా పీల్చుకునేలా 5–10 నిమిషాలు ఉంచాలి.
6. చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న గుండ్రని లడ్డూలుగా చేసుకోవాలి.
7. లడ్డూ చుట్టేటప్పుడు బూందీ ఇంకా కొద్దిగా వేడిగా ఉంటే సులభంగా గుండ్రంగా చుట్టువచ్చు. చివరగా బాదం, పిస్తా ముక్కలతో గార్నిష్ చేయాలి.
8. మిశ్రమం చాలా గట్టిగా ఉంటే బూందీ పెద్దగా వస్తుంది, కాబట్టి పలుచగా ఉండాలి.
9. లడ్డూలు మృదువుగా రావాలంటే బూందీని ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే పాకంలో కలపాలి.
Also read: Hair Fall: మీకు ఈ 5 విటమిన్లు లోపం ఉంటే జుట్టు రాలిపోతుంది జాగ్రత్త
ఇంట్లో వేడుకలు, పండుగల అయినప్పుడు ఈ మోతీచూర్ లడ్డూలను వండి చూడండి. నోరూరిపోవడం ఖాయం. దీన్ని తిన్నారంటే ఎవరైనా మైమరచిపోవాల్సిందే.