E-Paper
Advertisement

God’s Lamp: ఇంట్లో దేవుడి ముందు వెలిగించిన దీపం ఎక్కువ సేపు వెలిగితే ఏమవుతుందో తెలుసా..?

God’s Lamp: ఇంట్లో దేవుడి ముందు వెలిగించిన దీపం ఎక్కువ సేపు వెలిగితే ఏమవుతుందో తెలుసా..?
Advertisement

God’s Lamp: ఇంట్లో దేవుడి ముందు వెలిగించిన దీపం ఎక్కువ సేపు వెలిగితే ఏమవుతుందో తెలుసా..? దేవుడి ముందు ఆరిపోకుండా నిరంతరాయంగా వెలుగుతుందంటే దాని అర్థం ఏంటో తెలుసా..? ఆధ్యాత్మికంగా అలా వెలగడాన్ని ఏమంటారో తెలుసా..?

ఇంట్లో దేవుడి ముందు వెలిగించిన దీపం ఎక్కువ సేపు నిలకడగా వెలిగితే, అది ఆధ్యాత్మికంగా చాలా మంచి సంకేతంగా పరిగణించబడుతుందని పండితులు చెప్తున్నారు. ఇలా దీపం ఎక్కువ సేపు వెలగడం వెనక కొన్ని ముఖ్యమైన అర్థాలు మరియు నమ్మకాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సానుకూల శక్తి (Positive Energy): దీపం ఎక్కువ సేపు వెలగడం అనేది ఆ ఇంట్లో  సానుకూల శక్తి పుష్కలంగా ఉందనడానికి నిదర్శనమట. దీప కాంతిని దైవత్వానికి చిహ్నంగా భావిస్తారు. ఆ జ్యోతి ఎంత సేపు వెలిగితే, ఆ ఇంట్లో ఉన్న ప్రతికూలతలు (Negative Vibrations) అంతగా తొలగిపోతాయని కూడా అనుకోవాలట.

దైవ అనుగ్రహం: నిత్యం దీపారాధన చేసే సమయంలో జ్యోతి ఎక్కువ సేపు ప్రకాశవంతంగా వెలిగితే అది దైవ అనుగ్రహానికి సూచనగా పెద్దలు చెబుతుంటారు. మీరు చేసే ప్రార్థనలు లేదా పూజను ఆ భగవంతుడు స్వీకరించాడని చెప్పడానికి ఇదొక శుభ సంకేతంగా బావించాలని పండితులు సూచిస్తున్నారు.

Advertisement

మనఃశాంతి మరియు ఏకాగ్రత: నిలకడగా వెలిగే దీపం మనస్సులోని ప్రశాంతతను ప్రతిబింబిస్తుందట. దీపం కొడిగట్టకుండా ఎక్కువ సేపు వెలిగినప్పుడు ఆ కాంతిని చూడటం వల్ల మనసులోని ఆందోళనలు తగ్గి ఏకాగ్రత పెరుగుతుందట.

కుటుంబ క్షేమం: హిందూ సంప్రదాయంలో దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. దీపం సుదీర్ఘకాలం వెలిగితే ఆ ఇల్లు సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుందని, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని పండితులు చెప్తున్నారు.

శాస్త్రీయ కోణం: ఆధ్యాత్మిక నమ్మకాలతో పాటు దీనికి కొన్ని శాస్త్రీయ లేదా భౌతిక కారణాలు కూడా ఉన్నాయంటున్నారు పండితులు. మీరు వేసిన వత్తి నాణ్యత బాగుండి.. నూనె లేదా నెయ్యి స్వచ్ఛంగా ఉంటే దీపం ఎక్కువ సేపు వెలుగుతుందట. అలాగే దీపం ఉన్న చోట గాలి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటే, జ్యోతి నిలకడగా వెలుగుతుందట. ఇది ఆ గదిలో వాతావరణం ప్రశాంతంగా ఉందని సూచిస్తుందట.

దీపం ఆరిపోయే వరకు ఉంచడం కంటే, దీపం వెలుగుతున్నప్పుడే మరికొంత నూనె పోసి అఖండంగా వెలిగించడం లేదా పూజ పూర్తయ్యాక దానంతట అదే శాంతించే వరకు ఉంచడం మంచిదట. దీపం ఎక్కువ సేపు వెలిగితే మంచిదే, కానీ ఒకవేళ ఏదైనా కారణం చేత ఆరిపోయినా భయపడాల్సిన పనిలేదని.. మనసులో దేవుడిని తలుచుకుని తిరిగి వెలిగిస్తే సరిపోతుందని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: నల్లమల్లలో రహస్య ఆలయం – అమర్నాథ్ ను తలపించే ఆలయ విశేషాలు

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×